Home News బీబీసి ద్వంద్వ వైఖరి

బీబీసి ద్వంద్వ వైఖరి

0
SHARE

ఇటీవల డెన్మార్క్ లో జరుగుతున్న యూరో ఫుట్ బాల్ పోటీల్లో డెన్మార్క్, ఫిన్లాండ్ ల మధ్య  మ్యాచ్ ను బీబీసి (బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్) ప్రసారం చేసింది. మ్యాచ్ మధ్యలో డెన్మార్క్ ఆటగాడు ఎరిక్సన్ గుండెపోటుతో అస్వస్థతకు గురై మైదానంలోనే పడిపోయాడు. అతనికి వెంటనే అక్కడే అత్యవసర చికిత్స అందించారు. ఆ సమయంలో అతనికి అందిస్తున్న చికిత్స ఎవరూ చూడకుండా మిగిలిన ఆటగాళ్ళంతా అతను చుట్టూ నిలబడ్డారు. అయినా బీబీసి అక్కడి దృశ్యాలను కొద్ది నిముషాలు ప్రసారం చేసింది. కానీ ఆతరువాత ఆ ప్రసరానికి బేషరతుగా క్షమాపణలు చెప్పింది.`ఫుట్ బాల్ మ్యాచ్ కు సంబంధించి కొన్ని అనవసర దృశ్యాలు ప్రసారమయ్యాయని మేం గమనించాం. అందుకు క్షమాపణలు చెపుతున్నాం. మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయిన వెంటనే టెలికాస్ట్ ఆపేశాం. అయినా కొన్ని అనవసర దృశ్యాలు ప్రసారం అయ్యాయి’ అంటూ ప్రకటించింది. యాంకర్ గారీ లినేకర్ కూడా క్షమాపణలు చెపుతూ ట్వీట్ చేశాడు.

ఇలా డెన్మార్క్ ఫుట్ బాల్ మ్యాచ్ గురించి ఇంత సున్నితంగా వ్యవహరించి, జర్నలిజం విలువలకు, నైతిక విలువలకు కట్టుబడిన బీబీసి భారత్ లో కోవిడ్ మరణాలకు సంబంధించి ప్రసారం చేసిన వార్తల్లో ఈ విలువలేవీ పాటించకపోవడం విచిత్రం. కోవిడ్ తో మొత్తం ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంటే భారత్ లో మాత్రమే పెద్ద సంఖ్యలో మరణాలు సంభావిస్తున్నాయంటూ బీబీసి కధనాలు ప్రసారం చేసింది. కోవిడ్ తో మరణించిన వారి దహన సంస్కారాల దృశ్యాలు(ఇలా దహన సంస్కారాల వీడియోలు, ఫోటోలు సంబంధిత కుటుంబాల అనుమతి లేకుండా వాడటం అనైతికం) యధేచ్చగా ప్రసారం చేసింది. ఉత్తర్ ప్రదేశ్ లో గంగానది ఒడ్డున కోవిడ్ వల్ల చనిపోయినవారి శవాలను పెద్ద సంఖ్యలో పూడ్చిపెట్టారంటూ ఒక వార్త ప్రచారం కూడా చేసింది. నిజానికి అవి కోవిడ్ బాధితుల శవాలు కావు, ఆ మరణాలు ఇప్పుడు కోవిడ్ వల్ల సంభవించలేదు. ఈ వార్తలపై అనేక అభ్యంతరాలు వ్యక్తమైనా బీబీసి మాత్రం ఎప్పుడు క్షమాపణలు చెప్పలేదు, విచారం వ్యక్తం చేయలేదు.

Source : ORGANISER