Home News 2018 ప్రపంచ పుస్తకమేళా లో నవయుగభారతి, సంవిత్ కేంద్ర వారి పుస్తకాల ఆవిష్కరణ

2018 ప్రపంచ పుస్తకమేళా లో నవయుగభారతి, సంవిత్ కేంద్ర వారి పుస్తకాల ఆవిష్కరణ

0
SHARE

న్యూ ఢిల్లీ ప్రగతి మైదాన్ లో జరుగుతున్న ‘ప్రపంచ పుస్తకమేళా 2018’ లో నవయుగభారతి, సంవిత్ కేంద్ర వారు ప్రచురించిన పుస్తకాలను ఈ రోజు (సోమవారం) ఉదయమ్ 11 గంటలకు ఆవిష్కరించడం జరిగింది.

  1. Liberation Struggle of Hyderabad
  2. Useful and Interesting Anecdotes
  3. నవదివాకరుడు బాబా సాహెబ్ అంబేద్కర్
  4. రాష్ట్ర సేవిక సోదరి నివేదిత
  5. మనమూ భూమి పర్యావరణం
  6. ఇజ్రాయిల్ విముక్తి లో భారత సైనికుల వీరోచిత సమరం

పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శ్రీ  శక్తి సింహ జి, నెహ్రూ  గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు, శ్రీ భూపేందర్జీ, బిజేపి జాతీయ కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు, శ్రీ వడ్డి విజయసారధి, నవయుగ భారతి సంపాదకులు, శ్రీ రాహుల్ శాస్త్రి, సంవిత్ కేంద్ర అద్యక్షులు,  శ్రీ భరత్ అఖిల భారతీయ అధివక్త పరిషత్ కార్యదర్శి, శ్రీ వి రాజగోపాల్, సాహిత్యానికేతన్ మేనజర్ తదితరులు  పాల్గొన్నారు.

శ్రీ రాహుల్ శాస్త్రి గారిని సన్మానిస్తున్న శ్రీ రాజేందర్ జి
శ్రీ వి రాజ గోపాల్, శ్రీ రాహుల్ శాస్త్రి,  శ్రీ వడ్డి విజయసారధి, శ్రీ రాజేందర్ చడ్డా, శ్రీ  శక్తి సింహ, శ్రీ భారత్ ( కుడి నుండి ఎడమ)

2018 న్యూడిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ నవయుగ భారతి స్టాల్ ను సందర్శించిన ప్రముఖులు శ్రీమతి మృదులా సిన్హ, గోవా గవర్నరు , ప్రముఖ రచయిత్రి మరియు శ్రీ రామ్ జి నాయక్, ఉత్తర ప్రదేశ్ గవర్నర్.
 
శ్రీ విజయసారథి, నవయుగ భారతి సంపాదకులు, వచ్చిన అతిధులకు నవయుగభారతి, సంవిత్ కేంద్ర ద్వార ప్రచురించబడిన తెలుగు ఇంగ్లీష్ పుస్తకాలను పరిచయం చేస్తూ కొన్ని పుస్తకాలను వారికి అందచేయడం జరిగింది.
ప్రముఖంగా “Liberation Struggle of Hyderabad” పుస్తకం, తెలుగు లో వచ్చిన అంబేద్కర్ పుస్తకాల గురుంచి వారిద్దరు ఆసక్తి గా అడిగి తెలుసుకున్నారు.
శ్రీమతి మృదుల సింహ గారికి పుస్తకాలు పరిచయం చేస్తున్న డా. వడ్డి విజయ సారథి గారు
శ్రీ రామ్ జి నాయక్ , ఉత్తర ప్రదేశ్ గవర్నర్