
ఈస్టిండియా కంపెనీ మన దేశానికి వచ్చాక మన ప్రజలను అణచివేసి, దోపిడీచేస్తూ బానిసలుగా చూస్తూ మన ధర్మాన్ని సంస్కృతులను అవహేళన చేసారు. పవిత్ర పూజా కేంద్రాలను ఆక్రమించి మతమార్పిడి చేసారు. ఈ బాధలను భరించలేక కోపోద్రిక్తులైన ప్రజలు తమ రక్షణకోసం ఆంగ్లేయుల నుంచి విముక్తి కోసం స్వాతంత్ర్య సాధనకై పోరాటాలు చేశారు. వారిలో ఒకరు బుదు భగత్.