స్వాతంత్ర్యోద్యమ సాహిత్యంలో తలమానికంగా ఈనాటికీ పరిగణించే ‘భరత ఖండంబు చక్కని పాడియావు’ పద్యాన్ని గొప్పకవి, నాటక కర్త, జాతీయవాది చిలకమర్తి లక్ష్మీనరసింహం ఆశువుగా వినిపించారు. 1907వ సంవత్సరం వంగదేశం నుంచి రాజమహేంద్రవరానికి వచ్చిన బిపిన్ చంద్రపాల్ సమక్షంలో గోదావరీ మండల మహాసభ వేదికపైన ‘భరత ఖండంబు చక్కని పాడియావు’ అన్న పద్యం ఊపిరి పోసుకుంది. ఇంగ్లీషు చదువులు అవసరమే కానీ వారి ఆచార వ్యవహారాలను అనుసరించనక్కరలేదని చిలకమర్తి లక్ష్మీనరసింహం స్పష్టం చేశారు. మన ప్రాచీన సంస్కృతి, సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో విలువైనవని చిలకమర్తి లక్ష్మీనరసింహం హితవు పలికారు.