Home News నూపుర్ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై రిటైర్డ్ న్యాయమూర్తుల బహిరంగ లేఖ

నూపుర్ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై రిటైర్డ్ న్యాయమూర్తుల బహిరంగ లేఖ

0
SHARE

దాదాపు 15 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 77 మంది మాజీ బ్యూరోక్రాట్లు మరియు 25 మంది ఆర్మీ వెటరన్లు నూపుర్ శర్మ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు కు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటన విడుదల చేశారు.

దీనిపై సంతకం చేసిన వారిలో బాంబే హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి క్షితిజ్ వ్యాస్, గుజరాత్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ ఎం సోనీ, రాజస్థాన్ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు ఆర్ ఎస్ రాథోడ్, ప్రశాంత్ అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ ఎన్ ధింగ్రా ఉండగా, మాజీ ఐఏఎస్‌ అధికారులు ఆర్‌ఎస్‌ గోపాలన్‌, ఎస్‌ కృష్ణకుమార్‌, రాయబారి (రిటైర్డ్‌) నిరంజన్‌ దేశాయ్‌, మాజీ డీజీపీలు ఎస్‌పీ వైద్‌, బీఎల్‌ వోహ్రా, లెఫ్టినెంట్‌ జనరల్‌ వీకే చతుర్వేది (రిటైర్డ్‌), ఎయిర్‌ మార్షల్‌ (రిటైర్డ్‌) ఎస్‌పీ సింగ్‌ కూడా సంతకాలు చేశారు.

“రాజ్యాంగం ప్రకారం అన్ని సంస్థలు తమ విధులను నిర్వర్తిస్తేనే ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం చెక్కుచెదరకుండా ఉంటుందని సాధారణ పౌరులుగా మేము విశ్వసిస్తాము. కానీ సుప్రీం కోర్టులోని ఇద్దరు న్యాయమూర్తులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ‘లక్ష్మణ రేఖ’ను అతిక్రమించాయని అందువల్లే బహిరంగ ప్రకటన జారీ చేయవలసి వచ్చింది అని ఆ ప్రకటన పేర్కొంది.

అన్ని వార్తా ఛానెల్‌లు ప్రసారం చేసిన ఆ వ్యాఖ్యలు న్యాయ ధర్మానికి అనుగుణంగా లేవు. న్యాయపరమైన పద్ధతులను మరియు న్యాయబద్ధతను చూపించి ఈ వ్యాఖ్యలను సమర్థించలేమని పేర్కొంది. “ఇటువంటి దారుణమైన అతిక్రమణలు న్యాయవ్యవస్థ చరిత్రలో ఎప్పుడూ లేవు.” అని ఆ ప్రకటన పేర్కొంది.

ఆ వ్యాఖ్యలు నూపుర్ శర్మ ద్వారా వేయబడిన పిటిషన్‌లో లేవనెత్తిన అంశానికి సంబంధించినవి కావు మరియు అవి న్యాయవిచారణ యొక్క నిబంధనలను దాటి సాగాయి. నుపూర్ శర్మ న్యాయవ్యవస్థ జోక్యాన్ని కోరింది, అయితే అది ఆమెకు నిరాకరించబడింది, మరియు ఈ ప్రక్రియలో, భారత రాజ్యాంగం మూల సూత్రాలపై దాడి జరిగిన దానిలా ఉందని ప్రకటన పేర్కొంది. అటువంటి వ్యాఖ్యలు ద్వారా ఉదయపూర్‌లో పట్ట పగటిపూట జరిగిన శిరచ్ఛేద ఘటన దాదాపు క్షమించబడినట్లే అని ఆ ప్రకటన పేర్కొంది.

“ఎఫ్‌ఐఆర్ నమోదు తప్పనిసరిగా అరెస్టుకు దారితీయాలనే వ్యాఖ్యపై న్యాయ నిపుణ సోదరులు ఆశ్చర్యం మరియు దిగ్భ్రాంతి చెందుతారు అని ఈ వ్యాఖ్యలు వ్యవస్థపై చెరగని మచ్చ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలు మరియు దేశ భద్రతపై తీవ్రమైన పరిణామాలను కలిగి ఉన్నందున, తక్షణ దిద్దుబాటు చర్యలకు కూడా ప్రకటన పిలుపునిచ్చింది.

“కేసు విచారణలో ఉన్న ఉదయ్‌పూర్‌లో పట్టపగలు అనాగరికంగా తల నరికివేయడాన్ని ఒక కోణంలో పలుచన చేసే ఈ వ్యాఖ్యల కారణంగా భావోద్వేగాలు విస్తృతంగా చెలరేగాయి .” ఇటువంటి వ్యాఖ్యలు భారత రాజ్యాంగం యొక్క సారాంశం మరియు స్ఫూర్తికి శిలువ వేయడం అని పేర్కొంది. బెంచ్ చర్య ప్రజాస్వామ్య సమాజానికి ఎప్పటికీ ఒక సరి కాదని ప్రకటన పేర్కొంది. చట్టబద్ధమైన పాలన మరియు ప్రజాస్వామ్యాన్ని కొనసాగాలి ఈ వ్యాఖ్యలు తేలికగా తీసుకోలేంత తీవ్రమైనవి
అని వీరి ప్రకటన పేర్కొంది.

వివిధ ఎఫ్‌ఐఆర్‌లను కలపడానికి సంబంధించిన చట్టం యొక్క స్థితిని తెలియజేస్తూ, నూపుర్ శర్మ ప్రాథమిక హక్కును పరిరక్షించే బదులు ఆమె పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి కోర్టు నిరాకరించిందని ఈ ప్రకటన పేర్కొంది. ఇతర రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు/కేసులను కలపడానికి హైకోర్టుకు అధికార పరిధి లేదని పూర్తిగా తెలిసి కూడా ధర్మాసనం హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా శర్మను ఉపసంహరించుకునెలా ఒత్తిడి చేసిందని ప్రకటన పేర్కొంది.

“నూపూర్ కేసును వేరే విధంగా ఎందుకు పరిగణించాలో అర్థం చేసుకోవడంలో అంతా విఫలమవుతున్నారు. సుప్రీం కోర్టు యొక్క ఇటువంటి విధానం ఎటువంటి పొగడ్తలకు నోచుకోదు మరియు ఈ దేశం అత్యున్నత న్యాయస్థానం యొక్క పవిత్రత మరియు గౌరవాన్ని ప్రభావితం చేస్తుంది కూడా అని వీరి ప్రకటన పేర్కొంది.