Home News శ్రీ ప్రకాశ్ కాలే అస్తమయం

శ్రీ ప్రకాశ్ కాలే అస్తమయం

0
SHARE

వనవాసి కళ్యాణాశ్రమ్ అఖిల భారత వ్యవస్థా ప్రముఖ్ ప్రకాశ్ కాలే గారు 25 డిసెంబర్ ఉదయం 4.30 గం.లకు నాగపూర్ లో తమ 60వ ఏట పరమపదించారు. 40రోజులుగా క్యాన్సర్ చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు.

వారు బాల్యం నుండి సంఘ స్వయంసేవక్, 1983లో యం. కాం. చదువు పూర్తికాగానే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రచారక్ గా వచ్చి మహారాష్ట్ర లోని బుల్ డానా, వాషిమ్, వార్ధ జిల్లాల్లో జిల్లా ప్రచారక్ గా పని చేశారు. 1999 నుండి వనవాసి కళ్యాణాశ్రమ్ బాధ్యతలోకి వచ్చి విదర్భ ప్రాంత సంఘటన మంత్రిగాను, మహారాష్ట్ర క్షేత్ర సం. మంత్రిగాను ఆ తర్వాత మధ్య క్షేత్ర సంఘటన మంత్రిగా పనిచేశారు. చివరిగా జబల్ పూర్ కేంద్రంగా అఖిల భారత వ్యవస్థా ప్రముఖ్ గా ఉంటూ కేంద్రీయ కార్యకారిణీ సభ్యులుగా ఉన్నారు. వారు గొప్ప సంఘటనా శీలి, వేల మందిని కళ్యాణాశ్రమ్ పనిలోకి దింపిన చురుకైన కార్యకర్త. దేశమంతా జరిగే కళ్యాణాశ్రమ్ సేవా కార్యక్రమాలకు దోహదం చేస్తూ CSR నిధులు విరివిగా వచ్చేలా చేసేవారు. వారి మరణం కళ్యాశ్రమ కార్యానికి తీరని లోటు. వారి ఆత్మకు సద్గతిని ప్రసాదించాలని భగవంతునికి ప్రార్థన.