Home Telugu Articles కమ్యూనిస్టుల చరిత్ర సమస్తం.. చారిత్రక తప్పిదాలమయం

కమ్యూనిస్టుల చరిత్ర సమస్తం.. చారిత్రక తప్పిదాలమయం

0
SHARE

నిరంతరం వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, పత్రికల స్వేచ్ఛ గురించి గొంతుచించుకునే కమ్యూనిస్టు పార్టీలు, ఇందిరాగాంధీ 1975లో విధించిన ఎమర్జెన్సీని పూర్తిగా సమర్థించారు. అద్వానీ, వాజ్‌పేయ్‌లాంటి అనేక మంది జనసంఘ్ నేతలను, మదుదండావతే, జార్జ్‌ఫెర్నాండెజ్‌లాంటి అనేకమంది సోషలిస్ట్ నాయకులను జైళ్ళలో బంధించారు. ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ, జనసంఘ్ నాయకులనెందరినో చిత్రహింసలకు గురిచేసి, జైళ్ళపాలుచేశారు. సాధారణ పౌరుల వాక్‌స్వాతంత్య్రం మాట దేవుడెరుగు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు సైతం ఇందిర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పల్లెత్తు మాటమాట్లాడే ప్రజాస్వామ్యం కూడా లేకుండాపోయింది. పత్రికలలో వచ్చే వార్తలు సైతం ఏవి ప్రచురించాలో ఐజీ స్థాయి పోలీస్ అధికారి సైన్సార్ చేస్తేనే పత్రికలు వార్తలను ప్రచురించేవి.

ఇందిర ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని సమర్థించడం తమ పార్టీ చేసిన చారిత్రక తప్పిదమేనని, రైటిస్టులను (జాతీయవాదులను) అణచివేస్తుందనే ఉద్దేశంతోనే అలా చేయవలసి వచ్చిందని సీపీఐ గతంలో ప్రకటించింది. ఇదొక్క సందర్భంలోనే కాదు, గత 80 ఏండ్లలో కమ్యూనిస్టు పార్టీలు అనేక సందర్భాలలో దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు. కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడూ ఈ దేశ ప్రయోజనాల కోసం పనిచేయలేదు. పైగా రష్యా, చైనాలాంటి కమ్యూనిస్టు దేశాల ప్రయోజనాలకోసం, మన దేశానికి వ్యతిరేకంగా, దేశ ద్రోహం చేయడానికి కూడా ఎన్నడూ వెనకాడలేదు. భారత్‌కు ద్రోహం తలపెట్టిన కొన్ని ఉదాహారణలను చూద్దాం. రెండవ ప్రపంచ యుద్ధకాలం నాటి నుంచి కమ్యూనిస్టుల తీరింతే. జర్మనీ నియంత హిట్లర్‌ని నియంతగా, ఫాసిస్టుగా, క్రూరునిగా ప్రపంచానికి పరిచయం చేసిన రష్యా కమ్యూనిస్టు నేత స్టాలిన్ అదే హిట్లర్‌తో కలిసి ఇతర దేశాలను ఆక్రమించే ఒక దురాక్రమణ ఒప్పందాన్ని ఆగస్టు 23, 1939న కుదుర్చుకున్నాడు.

దీని ప్రకారం ఒకరిపై మరొకరు దండెత్తకూడదని, ఒంటిరాగా గాని ఉమ్మడిగా గాని ఇతర దేశాలను ఆక్రమించాలని, అలా ఆక్రమించిన దేశాలను ఇద్దరుకలిసే పంచుకోవాలని ఒప్పందంలోని ముఖ్యాంశాలు. ఇది దొంగలు  దొంగలు ఊళ్ళు పంచుకునే ఒప్పందంంగా చరిత్రలో చెప్పబడింది. తమ స్నేహితుడు జర్మన్ హిట్లర్‌పై యుద్ధం ప్రకటించిన బ్రిటన్‌ను సామ్రాజ్యవాదిగా, ఫాసిస్టుగా రష్యా ఆదేశాల మేరకు మనదేశ కమ్యూనిస్టులు ఏకి పారేశారు. ఇంతలో జర్మనీ,  రష్యాల నడుమ చెడింది. జూన్ 22, 1941న జర్మనీ సోవియట్ రష్యాపైనే దండెత్తింది. జర్మనీని ఎదుర్కొనేందుకు రష్యా బ్రిటన్‌తో జతకట్టింది. బ్రిటన్ పట్ల మన కమ్యూనిస్టుల వైఖరి కూడా రాత్రికిరాత్రే మారింది. కమ్యూనిస్టుల దృష్టిలో సామ్రాజ్యవాదిగా, ఫాసిస్టుగా ఉన్న బ్రిటన్ రష్యాకు మిత్రుడిగా మారడంతో పవిత్రంగా మారిపోయింది. హిట్లర్ ఫాసిస్టుగా, సామ్రాజ్యవాదిగా మారిపోయాదు.

జాతీయ కాంగ్రెస్‌ను బూర్జువాల పార్టీగా సీపీఐ నిందించింది. మహాత్మగాంధీని బూర్జువాల ప్రతినిధిగా నిందించింది. క్విట్ ఇండియా ఉద్యమాన్ని సైతం సీపీఐ వ్యతిరేకించింది. బ్రిటన్ అధికారులతో కుమ్మక్కైన సీపీఐ నాయకులు కోపర్ట్‌లుగా మారి, క్విట్ ఇండియాలో ఉద్యమిస్తున్న కాంగ్రెస్, కార్మిక నాయకులను అరెస్టు చేయించారు. దీనికి నజరానాగా జైళ్ళలో ఉన్న సీపీఐ నాయకులను విడుదల చేయాలని నాటి సీపీఐ కార్యదర్శి పీసీ జోషీ బ్రిటన్ అధికారులతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో పట్టుబడిన భారత సైనికులను కూడగట్టేందుకు జర్మనీ నేత హిట్లర్‌ను, జపాన్ ప్రధాని ఫిజోలను కలిసిన నేతాజీని ఫిజో, హిట్లర్‌ల పెంపుడు కుక్కగా, వారి బూట్లు నాకే కుక్కగా సీపీఐ నిందించింది. ఇందులో భారత్ ప్రయోజనాలు లేకపోగా, భారత్‌కు వ్యతిరేకంగా పనిచేశారు మన కమ్యూనిస్టులు.

గతకొంత కాలంగా చైనా భారత్‌తో యుద్ధానికి కాలు దువ్వుతోంది. భారత్ చాకచక్యంగా నెరిపిన చాణక్య దౌత్యంతో చెక్‌పెట్టడంతో 72 రోజుల డోక్లం దురాక్రమణ యుత్నాన్ని గత  ఆగస్టులో చైనా విరమించుకుంది. మాటిమాటికి బెదిరింపులకు పాల్పడుతున్న చైనా పట్ల మరింత కటువుగా వ్యవహరించాలని భారత్ ఆసియాన్ దేశాల ప్రజలతో పాటు ప్రపంచంలోని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు. ఊరందరిది ఒక దారైతే ఉలిపికట్టెది ఒకదారి అన్నట్లు సీపీఐ(ఎం) పార్టీకి చెందిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలక్రిష్ణన్‌లు ఇటీవల చైనాను పొగడ్తలతో ముంచెత్తడంతో భారత ప్రజలు దిగ్భ్రాంతికి గురైనారు. అమాయక చైనా అభివృద్ధిని అడ్డుకోవడానికే భారత్ సామ్రాజ్యవాద అమెరికాతో జట్టుకట్టిందని, భారత్ వివిధ దేశాలతో లాలూచి పడి చైనాపై పరోక్ష దాడికి పాల్పడుతున్నదని వారు విమర్శించారు.

సామ్రాజ్యవాద దేశాల కుట్రలకు అమాయక చైనా బలవుతున్నదని కూడా కన్నీరు కార్చారు. ఉత్తరకొరయాను కూడా ప్రశంసలతో ముంచెత్తారు. జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్, భారత్‌ల కూటమిలు చైనా ప్రయోజనాలను దెబ్బతీయడానికేనన్నారు. ఆరెస్సెస్ ప్రయోజనాలకనుగుణంగానే కేంద్రం అమెరికా, ఇజ్రాయిల్‌లతో కూటమి కడుతున్నదని ఘాటుగా విమర్శించారు. భారత్ ప్రత్యక్ష పరోక్ష దాడులకు పాల్పడుతున్న చైనా, పాకిస్తాన్‌లను పల్లెత్తు మాట అనకుండా మన దేశంపైనే తీవ్ర విమర్శలను గుప్పించారు. 120 కోట్లమంది భారతీయులు ఐదేండ్ల కాలానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న నరేంద్రమోదీని వెంటనే గద్దెదించాల్సిందేనని అరిచి గీపెట్టే సీతారాం ఏచూరి, జిన్‌పింగ్‌ను జీవితంకాలం చైనా అధ్యక్షునిగా ఎన్నుకోవడాన్నేమో పరిణతి చెందిన ప్రజాస్వామ్యంగా సమర్థించారు.

అయ్యో వీల్లేంది గిట్ల మాట్లాడుతున్నారు. సీపీఐ పార్టీ మనదేశం పార్టీనే గదా! మనపైనే విమర్శలతో దుమ్మెత్తిపోస్తున్నారు. మన శత్రువులనేమో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇదేం విచిత్రం. కూర్చున్న చెట్టునే నరుక్కునేంత అమాయకులా మన కమ్యూనిస్టు నాయకులు.. అని సామాన్యులు తలగోక్కుంటున్నారు. కుల, మతాలకతీతంగా పనిచేస్తామనే కమ్యూనిస్టులు దేశ విభజన కాలంలో మతతత్వ ముస్లింలీగ్, జిన్నాతో కలిసి మతం ఆధారంగా పాకిస్తాన్ ఏర్పాటును కూడా సమర్థించారు. మన తెలంగాణలో నిజాం వ్యతిరేకంగా ప్రారంభమైన కమ్యూనిస్టుల(సీపీఐ) సాయుధ పోరాటం సెప్టెంబర్ 17, 1948న నాటి హోంమంత్రి సర్దార్‌పటేల్ పోలీస్ యాక్షన్‌తో నిజాం లొంగిపోవడంతో సాయుధ పోరాట ముగిసిపోవాలి. కానీ ముగియకపోగా భారతదళాలకు వ్యతిరేకంగా అంటే దేశానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని సాగించారు.

1951లో రష్యా అధినేత స్టాలిన్ ఆదేశించటంతో తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిలిపివేశారు. ఏదేశ కనుసన్నలలో మనదేశ కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తాయో అర్థమవుతున్నది. నేను రాసిన ఈ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించే ఒకేఒక్క పార్టీ, కమ్యూనిస్టు మాత్రమేనని డా. బిఆర్ అంబేద్కర్ అనేక సందర్భాలలో అనేవారు. నార్త్ బొంబాయి నుంచి లోక్‌సభకు పోటీ  చేసిన నిష్కల దేశభక్తుడు డా.బి.ఆర్. అంబేద్కర్‌ను ఓడించాలని నాటి సీపీఐ కార్యదర్శి డాంగే ప్రచారం చేయడాన్ని చరిత్ర ఎన్నటికీ మరువదు. భారత్ , చినీ భాయి భాయి అంటూ నెహ్రూను మభ్యపెడుతూనే 1962లో చైనా మనదేశం పైకి దండయాత్ర చేసింది. రష్యా మనకు బాసటగా నిలిచింది. రష్యాను అనుసరించే కమ్యూనిస్టులు చైనాను అనుసరించే కమ్యూనిస్టులుగా సీపీఐ నిట్టనిలువుగా చీలిపోయి చైనాను అనుసరించే కమ్యూనిస్టులు మన దేశాన్ని నిందించడంతో పాటు యుద్ధం జరిగే సమయంలో దేశ ద్రోహానికి పాల్పడుతున్నారంటూ అనేక మంది కమ్యూనిస్టు పార్టీ నాయకులను జైళ్లకు పంపారు.

యుద్ధంలో గాయ పడిన, క్షతగాత్రులైన మన సైనికులకు సపర్యలు చేస్తూ వారికి కావలసిన రక్తాన్ని కార్యకర్తల నుంచి సేకరిస్తూ ఆరెస్సెస్ దేశసేవలో తరించింది. ఆరెస్సెస్ దేశసేవకు ముగ్దుడైన నాటి ప్రధాని నెహ్రూ నాటి రిపబ్లిక్ డే పెరేడ్‌లో సైనికుల సరసన పాల్గొనాల్సిందిగా ఆరెస్సెస్ కార్యకర్తలను ఆహ్హానించారు. భారత, చైనా యుద్ధ సమయంలో స్వదేశానికి ద్రోహం చేసి జైలు పాలైన నేతల్లో ఒకరైన నాటి సీపీఐ పొలిట్‌బ్యూరో సభ్యుడు నేటి కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్చుతనందన్‌లో ఏమూలో దాగి ఉన్న దేశభక్తి రగిలి మనం ఇలా దేశద్రోహానికి పాల్పడి చైనాకు సపోర్ట్‌చేయడం బాగాలేదు.

డా. మాసాడి బాపురావు
పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు (ఎబివిపి), 9985490297

(విజయక్రాంతి సౌజన్యం తో)