Home News పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో అభ్యంతరకరంగా రామాయణ ప్రదర్శన

పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో అభ్యంతరకరంగా రామాయణ ప్రదర్శన

0
SHARE

ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా పాండిచ్చేరి యూనివర్శిటీలో కళల విభాగం వార్షిక సాంస్కృతిక ఉత్సవం Ezhini 2K24 లో అభ్యంతరకరంగా, హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా రామాయణం ప్రదర్శన జరిగింది. ప్రస్తుత తాత్కాలిక వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. తరణిక్కరసు ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఇందులో రామాణాయాన్ని కించ‌ప‌రుస్తూ, రామాయణం, అందులోని పాత్రల ఆధారంగా “సోమయానం” అనే పేరుతో ఒక నాటకాన్ని మలయాళం, తమిళం ఆంగ్ల భాషలలో ప్ర‌ద‌ర్శించారు. సీత పాత్రను గీతగా చిత్రీకరించి, రావణ ను భావణ గా చిత్రిక‌రించి వారిద్ద‌రూ డాన్స్ చేస్తున్న‌ట్టు చూపించారు. సీత రావణునికి గొడ్డు మాంసం ఇస్తున్న‌ట్టు, సీత అపహరణ సమయంలో, ఆమె “నాకు పెళ్లయింది, అయితే మనం స్నేహితులుగా ఉండవచ్చు” అని చెప్పిన‌ట్టు నాటకంలో ప్ర‌ద‌ర్శించారు. .

నాటకంలోని మరొక భాగంలో, హనుమాన్‌జీని కాంజనేయుడిగా ఎగతాళి చేసి, రామ్‌కి కాల్ చేస్తున్నప్పుడు సిగ్నల్ కోసం ఉపయోగించే యాంటెన్ ను హనుమంతుడి తోకను చూపించారు. ఈ సిగ్గుమాలిన చర్యలు హిందూ మతం మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఈ నాటకానికి వ్యతిరేకంగా యూనివర్శిటీ క్యాంపస్ లో ఏబీవీపీ (అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్) పెద్దఎత్తున నిరసనలు చేపట్టింది. భారత్ లోని విశ్వవిద్యాలయలు హిందూ వ్యతిరేక భావజాలానికి కేంద్రాలుగా మారుతున్నాయి.