Home News మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్ తెగల జాబితా నుంచి తొలగించాలి- వీహెచ్‌పీ తీర్మానం

మతం మారిన గిరిజనులను షెడ్యూల్డ్ తెగల జాబితా నుంచి తొలగించాలి- వీహెచ్‌పీ తీర్మానం

0
SHARE

జునాగఢ్ : మతం మారిన క్రైస్తవులు, ముస్లింలను గిరిజన తెగల జాబితా నుంచి తొలగించాలని వీహెచ్‌పీ డిమాండ్‌ చేసింది. మతం మారిన గిరిజనులను గిరిజన తెగల జాబితా నుండి తొలగించేందుకు రాజ్యాంగంలో అవసరమైన సవరణలు చేయాలని, తద్వారా నిజమైన గిరిజనులు వారికి తగిన రిజర్వేషన్ హక్కులను పొందేలా చేయాలని కేంద్ర ధర్మకర్తల మండలి ఏకగ్రీవ తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సుప్రీంకోర్టుతో సహా దేశంలోని అనేక న్యాయస్థానాలు ఈ విషయంలో అనేక సందర్భాల్లో తీర్పులు ఇచ్చాయి.

వీహెచ్‌పి వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ జీ మాట్లాడుతూ.. ఆదివాసీల‌కు రాజ్యాంగం కల్పించిన హక్కులు మ‌త మార్పిళ్ల కార‌ణంగా దూరమ‌వుతున్నాయ‌ని అన్నారు. భారతదేశంలో హిందూ సమాజం యుగయుగాలగా పట్టణాలు, గ్రామాలు, అడవులలో నివసించిందని, వారి ఆధ్యాత్మిక సంప్రదాయం ప్రకారం పూజా విధానంలో వైవిధ్యం ఉన్నప్పటికీ, వారి అంతరంగం ఎప్పుడూ ఒక్కటే అని అన్నారు. వ్యక్తి మతం మారడమంటే జాతీయతనే మార్చుకోవడం అవుతుంద‌ని అన్నారు. పేద షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలను బలవంతంగా లేదా ప్ర‌లోభాల‌కు గురి చేసి మతం మార్చే ప్రయత్నాల ద్వారా భారతదేశాన్ని బలహీనపరిచే కుట్ర‌లు జరుగుతున్నాయ‌ని అన్నారు. క్రైస్తవ మిషనరీల ప్రలోభాలను, ఒత్తిడిని మతం మార్చుకున్నవారు అర్థం చేసుకుంటే మోసపూరిత మార్గాల ద్వారా వారు ఎంత‌టి దారుణాల‌కైనా పాల్ప‌డ‌తార‌ని తెలుస్తుంది. ఒరిస్సాలో స్వామి లక్ష్మణానంద జీ, త్రిపురలో స్వామి శాంతి కాళీ జీ వంటి హిందూ సాధువుల దారుణ హత్యల వంటి నేరాల వెనుక క్రైస్త‌వ మిష‌న‌రీలు ఉన్నాయ‌న్న‌ది అంద‌రికి తెలిసిన వాస్తవ‌మే.

షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి భారత రాజ్యాంగం ప్రకారం క్రైస్తవ మతం, ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తులు షెడ్యూల్డ్ తెగలకు ఇచ్చే రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలను పొందడానికి అర్హులు కాదు. కానీ, మతం మారిన తర్వాత కూడా వారు రెండు రకాల ప్రయోజనాలను పొందుతున్నారు. కేరళ వర్సెస్ మోహన్ కేసులో ఒక తెగకు చెందిన వ్యక్తి తన అసలు మతాన్ని విడిచిపెట్టి మరొక మతాన్ని స్వీకరించి, తన సంప్రదాయాలు, ఆచారాలు వదిలివేస్తే, అతన్ని తెగగా పరిగణించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గిరిజన జనాభాలో మతం మార్చబడిన గిరిజనులు కేవలం 18% మాత్రమే ఉన్నారని సర్వేలు సూచిస్తున్నాయి. అయితే రిజర్వుడ్ సీట్లలో 80% కంటే ఎక్కువ ఆక్రమించుకున్నారు.

పెరుగుతున్న క్రైస్తవుల కుట్రలు, ప్రాబల్యం దృష్ట్యా, నిజమైన గిరిజనులు వారి హక్కులు పొందేందుకు వీలుగా మతం మారిన గిరిజనులను తెగల జాబితా నుండి తొలగించడానికి రాజ్యాంగంలో అవసరమైన సవరణలు చేయాలని VHP కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.