Home News వంద చేతులతో సంపదను సృష్టించండి – వెయ్యి చేతులతో పంచండి

వంద చేతులతో సంపదను సృష్టించండి – వెయ్యి చేతులతో పంచండి

0
SHARE

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రెండు రోజుల హిందూ ఎకనామిక్ ఫోరం ప్రాంతీయ సమావేశం ఫిబ్రవరి 8, 9 తేదీల్లో విజయవాడలోని ఫార్చ్యూన్ మురళి పార్కులో జరిగింది.

హిందూ ఎకనామిక్ ఫోరం (హెచ్ఇఎఫ్) అనేది హిందూ సమాజంలోని వివిధ వ్యక్తులను, పారిశ్రామికవేత్తలు, వ్యాపార వేత్తలు, బ్యాంకర్లు, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులు, ఆర్థికవేత్తలు, విద్యావేత్తలతో పాటు స్వీయ – ఆర్గనైజింగ్ గ్రూపుల్లోని నాయకులు వారి వేగవంతమైన వృద్ధిని సాధించడానికి ఇది ఒక వేదిక.

హిందూ ఆర్థిక శక్తి ఒక ప్రముఖ ఆర్థిక వ్యవస్థగా తిరిగి ఉద్భవించే అవకాశం ఉందని హెచ్ఇఎఫ్ అభిప్రాయపడింది.  ఇందుకోసం హిందూ సమాజం సహకారం అవసరమని పేర్కొంది.

“సతా హస్త సంహారా, సహస్ర హస్త సంకీరా” అని వెదోక్తి. అంటే” వంద చేతులతో సంపదను సృష్టించండి వెయ్యి చేతులతో పంచుకోండి” అనేదే HEF లక్ష్యం.

శనివారం సాయంత్రం ప్రపంచ హిందూ ఎకనామిక్ ఫోరం వ్యవస్థాపకుడు స్వామి విజ్ఞానంద్ సమక్షంలో ప్రారంభ సమావేశం జరిగింది. ఒకప్పుడు ప్రపంచ జిడిపిలో భారత్ భాగస్వామ్యం సుమారు 33 శాతంగా ఉండేదని, ఇప్పుడు అది చాలా దిగువకు పడిపోయిందని, భారత్ తిరిగి తన పూర్వ వైభవాన్ని సాధించవలసిన అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య నైపుణ్యంలోని అంతరాన్ని తగ్గించడానికి యువతలో నైపుణ్యాభివృద్ధిని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.

హెచ్ఇ..ఎఫ్ విజయవాడ ఆర్గనైజింగ్ కమిటీ చైర్‌పర్సన్ శ్రీ ఎస్ఎన్ కుమార్ బుద్ధవరపు ఈ సమావేశానికి ఎజెండాను రూపొందించారు.

8 రోజుల పాటు 40 మంది వక్తలు ప్రసంగించిన ఈ రెండు రోజుల కార్యక్రమానికి 250 మంది రిజిస్టర్ చేసుకున్న ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ ఏడాది జూలైలో 6 నుంచి 8 వరకు నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో జరగనున్న ప్రపంచ హెచ్‌ఇఎఫ్-2020 ఫోరమ్‌కు వెళ్లనున్న బెంగళూరు హెచ్‌ఇఎఫ్ ప్రతినిధులను స్వాగతించారు.

ఈ  కార్యక్రమంలో అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, హెల్త్ అండ్ ఫార్మా, టూరిజం, ఎడ్యుకేషన్, ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్, ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు.

జాతీయంగా, అంతర్జాతీయంగా వ్యాపారాన్ని మరింతగా పెంచడానికి ఒక స్పష్టమైన అవగాహనకు రావడంతో సమావేశం ముగిసింది.

హిందూ ఎకనామిక్ ఫోరం (హెచ్ఇఎఫ్) అనేది వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూహెచ్‌ఇఎఫ్) తో అనుసంధానించబడిన ఒక స్వచ్ఛంద సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ వ్యాపార వర్గాల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న అంకితమైన అంతర్జాతీయ సంస్థ.  అంతర్జాతీయ వాణిజ్యం, వ్యాపారాలలో వృద్ధి చెందడానికి భారతదేశంలోని హిందూ వ్యాపార వర్గాలకు వనరులను బలోపేతం చేయడం ఫోరమ్ ప్రాథమిక లక్ష్యం.

WHEF ప్రయాణం 2012 లో హాంకాంగ్‌లో ప్రారంభమైంది, తరువాత 2013లో బ్యాంకాక్ కి, 2014 న్యూ ఢిల్లీకి, 2015లో లండన్ కి, 2016లో లాస్ ఏంజిల్స్ కి, 2018లో చికాగోకి, 2019లో ముంబైకి విస్తరించింది.

ఆరోగ్య సంరక్షణ సెషన్‌కు ధనుష్ ఇన్ఫోటెక్‌కు చెందిన శ్రీ డిఎస్‌ఎన్ మూర్తి, లైలా గ్రూప్ శ్రీ బి కిరణ్, సిద్దా మెడిసిన్ నిపుణుడు ప్రొఫెసర్ గుణ మహేశన్ నాయకత్వం వహించారు.

పర్యాటక, వ్యాపార అవకాశాలపై జరిగిన సెషన్‌కు శ్రీ విష్ణుభట్ల రామచంద్ర అధ్యక్షత వహించారు, దీనిలో ప్రభుత్వ సలహాదారు శ్రీ లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ లోని పర్యాటక రంగంలోని అవకాశాలను వివరించారు.

డాక్టర్ రాజు గన్నవరపు- మంత్ర స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, శ్రీ తాతా రావులు భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విద్యలో జరుగుతున్న పరిణామాలపై లోతైన విశ్లేషణలు ఇచ్చారు.

ఐటి పరిశ్రమ అభివృద్ధిపై శ్రీ ప్రసాద్ గరపతి, రఘుపతి కల్లూరి మాట్లాడారు. పెట్టుబడి అవకాశాలపై శ్రీ గోపి ప్రసాద్, చైనాకు చెందిన శ్రీ మూర్తి మార్గనిర్దేశం చేశారు.

vskandhra.org వారి సౌజన్యం తో