Home News దేశ ప్రగతి లో సంస్కృతి పరంగా మనమంతా ఒక్కటే అనే భావన కీలకం – శ్రీమతి...

దేశ ప్రగతి లో సంస్కృతి పరంగా మనమంతా ఒక్కటే అనే భావన కీలకం – శ్రీమతి నిర్మల సీతారామన్

0
SHARE

దేశ ప్రగతి లో సంస్కృతి పరంగా మనమంతా ఒక్కటే అనే భావన కీలక పాత్ర పోషిస్తుందని గౌరవనీయ దేశ రక్షణ శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ అన్నారు. దేశంలోని వివిధత్వాన్ని పరిరక్షించడానికి ఒక సమైక్యతా సూత్రం అవసరమని,  దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉన్నదన్నారు.

సంస్కృతి ఫౌండషన్  హైదరాబాద్ లో “ రీ ఎమర్జన్స్ అఫ్ ఇండియా దట్ ఇస్ భారత్ –రోల్ అఫ్ ఫిఫ్త్ ఎస్టేట్” అనే అంశం పై నిర్వహించిన చర్చా గోష్టిలో పాల్గొన్నారు. సాంస్కృతిక ఏకత్వ భావన కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దేశాన్ని నిలబెట్టుతూ వచ్చింది. దేశంలో  ఉత్తర దక్షిణ ప్రాంతాలను, పశ్చిమ, పూర్వత్తోర ప్రాంతాలను కలిపివుంచే వివిధ సాంస్కృతిక  పద్దతులను సీతరామన్ గుర్తుచేసారు. సాంస్కృతిక సంబందాలు మన కుటుంబాలను దృడంగా కట్టిఉంచేవని, కాని సాంకేతిక ప్రగతి, పరికరాల కారణంగా కొంత వరకు అంతరాలు ఏర్పడ్డాయన్నారు.

కార్యక్రమంలో ప్రధాన వక్త గా పాల్గొన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ  శ్రీ సురేష్ జీ  సోని  భారతదేశంలో సంస్కృతికి ఎదురవుతున్న ప్రమాదాలను  ఆదర్శవంతమైన ఆచరణ తో కూడిన వ్యవస్థల ద్వారా  మాత్రమే తప్పించవచ్చని అన్నారు.

మన దేశం సహననికి కేంద్ర బిందువని, సాంస్కృతిక భిన్నత్వంలో కూడా అందరిని అంగీకరించగల సమాజం మనదని వివరిస్తూ అనేక చరిత్ర విషయాలను సురేష్ జి ఉదహరించారు. అనేక వ్యవస్థలు, చట్టాలు అందుబాటులో ఉన్నాయి.  కాని అవి ప్రభావంతంగా పని చేయాలంటే  వాటికి ఆధారభూతమైన విలువలతో కూడిన పద్దతి అవసరమన్నారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ బి వి అర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యావిధానం లో సంస్కృతి పరమైన అంశాలను ప్రవేశ పెడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో  అన్వయించడం వలన సాంసృతిక విలువలకు బలం చేకుర్చగలుగుతామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎల్ నరసింహ రెడ్డి, మాజీ పాట్నా హై కోర్ట్ న్యాయమూర్తి, డా కె ఐ వరప్రసాద్ రెడ్డి, శాంత బయోటెక్ అధిపతి, డా  వేమూరి  రవీంద్ర బాబు,  మాజీ డైరక్టర్ ఐ సిఏఅర్, ఐఅర్అర్, శ్రీమతి మాధవిలత కొంపల్లి, విరంచి హాస్పిటల్స్ అధిపతి, డా కే అరవింద రావు, ఆంధ్ర ప్రదేశ మాజీ డి జి పి, బూర్ల దక్షిణామూర్తి, ఆర్ ఎస్ ఎస్ తెలంగాణా ప్రాంత సంఘచాలక్, ఎస్ అర్ రామానుజం, గాయని సునీత తో పాటు  పుర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, అధ్యాపకులు, క్రీడాకారులు, సామజిక నేతలు,  సంఘ అధికారులు తదితరులు పాల్గొన్నారు.