
భారతదేశం యావత్ ప్రపంచానికి గురువుగా ఎదగడానికి కారణం సంస్కృతం భాష. అర్ష సంస్కృతి, వేదాలు, ఇతిహాలు ధర్మసూత్రాలతో పాటు మనకు అనంతమైన వాఙ్మయాన్ని మనకు అందించింది ఈ భాష. అంత ఉన్నతమైన ఈ భాషను మనం విస్మరించడం వల్లనే మనదేశం దురవస్థల పాలు అవుతోంది. అమృత భాష అయిన సంస్కృతానికి ఇవాళ ప్రజలు దూరం కావడం చాలా భాధాకరమైన దురదృష్టకరమైన విషయం. మళ్లీ మనదేశానికి పూర్వవైభవం రావాలంటే ఇతర భాషలతో పాటుగా సంస్కృతాన్ని కూడా తప్పకుండా అభ్యసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే నిజమైన భారతదేశం అంటే ఏంటో మనం తెలుసుకోగలం.