భారతదేశంలో అనేక గ్రామాలున్నాయి. ఈ గ్రామాలన్నింటిలో హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన గ్రామదేవతలను, ఇతర దేవాలయాల్లోని దేవుళ్లను అక్కడి ప్రజలు కొలుస్తుంటారు. ఇలా గ్రామాల్లో కొలువైన గ్రామీణ దేవీదేవతలకు, ఇతర దేవుళ్లకు అక్కడి స్థానిక ప్రజలే పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ సంస్కృతి సంప్రదాయాలను ఆచరిస్తూ ఉంటారు. గ్రామీణ దేవాలయాల్లో పూజ నిర్వహణకై పూజ పద్దతులను తెలియజేయడానికి ధర్మజాగరణ ఆధ్వర్యంలో శిక్షణ కార్యాక్రమం ఏర్పాటు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని గ్రామీణ పూజారులకు 7 రోజుల శిక్షణా శిబిరం సూర్యపేట జిల్లాలోని మట్టపల్లి శ్రీ లక్ష్మి నరసింహస్వామి పుణ్య క్షేత్రంలో సెప్టెంబర్ 30 నుండి అక్టోబరు 7వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో 3 జిల్లాలు 41 మండలాలు 64 గ్రామాలు 18 సామాజిక వర్గాలకు చెందిన 81 మంది శిక్షార్థులు పూజారి శిక్షణ పూర్తి చేశారు.
ఇలా ప్రతీ గ్రామంలో ఆ గ్రామదేవతలకు పూజలు నిర్వహించడం వల్ల గ్రామస్తుల మధ్య ఐక్యమత్యం పెరిగి మనమంతా ఒకటే అనే భావన పెరుగుతుంది. దీని వల్ల గ్రామంలో సాంస్కృతిక విలువలతో పాటు మానవ సంబంధాలు మెరుగుపడతాయి. దీని వల్ల గ్రామంలో అన్యమత ప్రచారం, మతమార్పిళ్లను పూర్తిగా నివారించవచ్చు. ఇలాంటి కార్యక్రమాలతో గ్రామాల్లో ధార్మిక విప్లవం కోసం ధర్మజాగరణ విభాగం నిరంతరం కృషి చేస్తోంది.