Home News చైనా వ‌స్తువుల బ‌హిష్క‌ర‌ణ… రూ. 50వేల‌ కోట్ల నష్ట‌పోయిన చైనా ఎగుమతిదారులు

చైనా వ‌స్తువుల బ‌హిష్క‌ర‌ణ… రూ. 50వేల‌ కోట్ల నష్ట‌పోయిన చైనా ఎగుమతిదారులు

0
SHARE

భార‌త‌దేశంలో చైనా వ‌స్తువుల అమ్మకం దారులు ఈ సంవత్సరం దీపావళి, ఇతర పండుగలకు ముందు భారీ మొత్తంలో నష్టాన్ని చవిచూస్తున్నారు. గత సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ‘చైనీస్ వస్తువులను బహిష్కరించాలి’ అని పిలుపునిచ్చింది. భారతీయ వ్యాపారులు చైనా వస్తువుల దిగుమతిని నిలిపివేయ‌డంతో చైనా సుమారు రూ.50,000 కోట్ల వ్యాపార నష్టాన్ని చవిచూడబోతోంది. ” అని సిఎఐటి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ సంవత్సరం చైనా నుండి ట‌పాకాయ‌లు, ఇతర చౌకైన పండుగ ఉత్పత్తులను నిషేధించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్య వ‌ల్ల‌ భారతదేశంలోని స్వదేశీ పరిశ్రమలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. శుక్రవారం CAIT విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. పండుగ సీజన్‌కు ముందు దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్‌లలో వినియోగ‌దారుల సంఖ్య పెరగడాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ దీపావళికి భారతీయ మార్కెట్లు లాభాల బాట‌లో సాగుతున్నాయి. దీపావళి సమయంలో వినియోగదారుల వ్యయం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ రూ. 2 లక్షల కోట్ల వరకు అందుకోవచ్చు.

భారతీయులు ఎక్కువగా చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తిని కోల్పోతున్నారని, ఇది భారతీయ వస్తువులకు డిమాండ్‌ను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, 20 ‘పంపిణీ నగరాల్లో’ బాడీ రీసెర్చ్ టీమ్ నిర్వహించిన సర్వేలో ఇప్పటివరకు దీపావళి వస్తువులు, బాణసంచా లేదా ఇతర వస్తువుల కోసం చైనా ఎగుమతిదారులకు భారతీయ వ్యాపారులు లేదా దిగుమతిదారులు ఎటువంటి ఆర్డర్లు ఇవ్వలేదని తేలింది.

ప్రతి సంవత్సరం రాఖీ నుండి ఆంగ్ల నూతన సంవత్సర రోజు వరకు మ‌ధ్య కాలంలో వ‌చ్చే పండుగ‌ల‌ సీజన్‌లో భారతీయ వ్యాపారులు ఎగుమతిదారులు చైనా నుండి దాదాపు 70,000 కోట్ల రూపాయల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటారు. ఈ ఏడాది రాఖీ పండుగ సందర్భంగా డ్రాగన్ దేశం దాదాపు రూ.5000 కోట్లు, గణేష్ చతుర్థి సందర్భంగా మళ్లీ రూ.500 కోట్ల నష్టాలను చవిచూసింది.

ఇదే ధోరణి కొనసాగితే చైనా ఉత్పత్తులను భారత్‌లోని వ్యాపారులు బహిష్కరించడమే కాకుండా చైనా తయారు చేసే వస్తువులను కొనుగోలు చేసేందుకు వినియోగ‌దారులు కూడా ఆసక్తిని కోల్పోతారు