Home News గత వందేళ్ల‌లో హిందువుల‌పై జ‌రిగిన మారణకాండపై ‘ది ఢిల్లీ ఫైల్స్’ చిత్రం – వివేక్ అగ్నిహోత్రి

గత వందేళ్ల‌లో హిందువుల‌పై జ‌రిగిన మారణకాండపై ‘ది ఢిల్లీ ఫైల్స్’ చిత్రం – వివేక్ అగ్నిహోత్రి

0
SHARE

గత వందేళ్ల‌లో హిందువుల‌పై జ‌రిగిన మారణకాండ గురించి త‌న రాబోయే చిత్రం ది ఢిల్లీ ఫైల్స్ లో చూయిస్తాన‌ని ప్ర‌ముఖు సినీ ద‌ర్శ‌క నిర్మాత‌ వివేక్ అగ్నిహోత్రి తెలిపారు. చండీఘ‌డ్ లో ఫిబ్ర‌వ‌రి 23, 24, 25 తేదీల్లో జ‌రుగుతున్న చిత్ర‌భార‌తి 5వ చలనచిత్రోత్సవంలో చిత్ర‌రంగానికి సంబంధించి ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ప్రేక్షకులను ఉద్దేశించి వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ 100 సంవత్సరాల క్రితం మోప్లా మారణకాండ జరిగినప్పటి నుండి జరిగిన మారణకాండలో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఈ చరిత్ర రక్తపాతంతో నిండి ఉంద‌న్నారు. బెంగాల్‌లోనే డైరెక్ట్‌ యాక్షన్‌ డేలో 20 వేల మంది హిందువులు హత్యకు గురయ్యార‌ని తెలిపారు. కొన్నిసార్లు కథ చెప్పకపోవడం కూడా నేరమే అవుతుంద‌న్నారు. ఈ సమాజంలో జరిగిన వాస్త‌వ కథలే చెప్పాల‌న్నారు. ఢిల్లీ ఫైల్ ద్వారా, ఈ చరిత్రను వెల్లడించ‌నున్న‌ట్టు తెలిపారు. సమాజంలోని సాధారణ సమస్యలు కథల్లోకి వస్తే సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తార‌ని అన్నారు. ఇంతకుముందు భారతదేశం సినిమాలతోనే బతికేదని, ఇప్పుడు సినిమాల నుండి భారతదేశం కనుమరుగైపోతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సినిమాలు తీస్తున్న వారికి ఎవరి కోసం తీస్తున్నామో తెలియట్లేద‌ని, ఇప్పుడు మన సినిమాలు సామాన్యుడికి దూరమై, సామాన్యుడు కూడా సినిమాలకు దూరమయ్యాడ‌ని అన్నారు. భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవాలంటే భారతీయ సినిమాల విలన్‌లను అర్థం చేసుకోవాలని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు ప్రతి దశాబ్దంలో సినిమాల ప్రయాణంలో విలన్లు మారుతూ వస్తున్నారని, దేశంలోని సినీ నిర్మాతల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ విలన్లే దోహదపడుతున్నారని అన్నారు.

అనంత‌రం మీడియాతో సమావేశమైన వివేక్ అగ్నిహోత్రి వారి ప్రశ్నలకు బహిరంగంగా సమాధానమిచ్చారు. పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాత ఆలోచించి సినిమాలు చేస్తున్నాన‌ని, సినిమా తీయడం కోసం 4- 5 ఏళ్లపాటు తీవ్ర పరిశోధనలు చేసి, ఆ విషయంపై సినిమా తీస్తున్న ఒకే ఒక్క ఫిల్మ్ మేకర్ భారతదేశంలో తానే అని చెప్పడంలో అతిశయోక్తి లేద‌న్నారు. త‌నపై చాలా సార్లు ఫత్వాలు జారీ చేశార‌ని, బెదిరింపులు కూడా వస్తున్నాని కానీ దానిని పట్టించుకోనని తెలిపారు. దేశం కోసం పూర్తి నిజాయితీతో సినిమాలు చేస్తున్నాన‌ని తెలిపారు. ప్ర‌స్తుత స‌మాజంలోని కొద్దిమంది ప్రజల వద్ద వారి తండ్రి, తాత, ముత్తాత ఫోటో కూడా లేద‌ని, మ‌న ముందు త‌రం వారు ఈ దేశం కోసం చేసిన త్యాగాల్ని గుర్తు చేసుకోవాల‌ని దాని గురించి గర్వపడాలని కోరుకుంటున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

సినిమాల్లో ఎజెండా ఉండ‌దు – డా. చంద్రప్రకాష్ ద్వివేది

భారతీయ సినిమా వినోదం లేదా ఎజెండా అనే అంశంపై, ఫేమ్ ఫిల్మ్ మేకర్ డా. చంద్రప్రకాష్ ద్వివేది మాట్లాడుతూ… సినిమా నిర్మాత ఏదైనా ఎజెండాతో సినిమాను సిద్ధం చేయడాన్ని అంగీకరించనని అని అన్నారు. భారతీయ సినిమాలకు ఎజెండాలు ఉండవని, అయితే అవి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ దీని బారిన పడుతున్నార‌ని అన్నారు. “నేను చాణక్య సీరియల్ చేసాను. అందులో నాకు ఎలాంటి ఎజెండా లేదు. అది నా నిబద్ధత. ఈ నిబద్ధత భారతదేశానిది.” అని అన్నారు. సినిమాలపై జరుగుతున్న నిరసనల వెనుక రాజకీయ ప్రయోజనం దాగి ఉందని డా. ద్వివేది అన్నారు. ఆలోచింప‌జేసే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ అని అన్నారు.

94 సినిమాల ప్ర‌ద‌ర్శ‌న

ఐదవ చిత్ర భారతి చిత్రోత్స‌వంలో 2వ రోజు ముగిసే వరకు ప్రదర్శించిన 94 చిత్రాలన‌పు ప్ర‌ద‌ర్శించారు. భారతీయ చిత్ర సాధన కృషి వల్ల ఫిల్మ్ ఫెస్టివల్స్ వంటి కార్యక్రమాల ద్వారా ఎంతో మంది క‌ళ‌కారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వేదిక లభించింది. వీరు తీసిన సినిమాల సామర్థ్యాలు ప్రేక్షకులు చూపించిన ప్రోత్సాహం వాళ్లలో గొప్ప నమ్మకాన్ని కలిగించాయి. రెండో రోజు 47 సినిమాలు ప్రదర్శించబడ్డాయి. ఈ చిత్రాలలో చాలా వరకు కన్నీళ్లు వచ్చేలా ఉన్నాయి. అయితే కొందరు బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని, దేశం పట్ల వారికి ఎలాంటి బాధ్యత ఉందో వివరించారు. భారతదేశంలో కొత్త కోణాలను నెలకొల్పాలన్న మొండితనం చాలా సన్నివేశాల్లో కనిపించింది. మన్మోహన్ వైద్య జీ, అద్వేత కాల వారి మాస్టర్ క్లాస్‌లో ‘సినిమాలో భారతీయత’ అనే అంశంపై ప్ర‌సంగించారు.