దాదాపు యాభై వేల మంది ప్రజలు బుధవారం నాడు జైపూర్లో సమావేశమై వందేమాతరం గీతం ఆలపించారు. ప్రభుత్వం ‘నోట్లరద్దు’ నిర్ణయం తీసుకొని ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా వారు ఈ విధంగా వార్షికోత్సవాన్నిజరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని‘హిందూ ఆధ్యాత్మిక మరియు సేవ’ ఫౌండేషన్ వారు రాజస్థాన్ బోర్డ్ తో కలిసి నిర్వహించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ సురేష్ ప్రభు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే భారతీయ జనతా పార్టీ రాజస్థాన్ శాఖలు కూడా నోట్ల రద్దు ప్రధమ వార్షికోత్సవాన్ని నల్ల ధన వ్యతిరేక దినంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు వివిధ రకాలైన స్వరసమ్మేళనాలతో వందేమాతరం గీతాన్ని ఆలపించారు.
ఈ కార్యక్రమంలో ఇంకా జాతీయ సేవ పథకం (NSS), నేషనల్ క్యాడెట్ కార్ప్స్(NCC), స్కౌట్స్ అండ్ గైడ్స్ మరియు ఆర్ ఎస్ ఎస్ వాలంటీర్లు ఎక్కువ సంఖ్యలో పాల్గొని హాజరైన ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమావేశాన్ని పర్యవేక్షించారు.