Home News దేశ భక్తి ని నిర్మాణం చేయడంలో చిత్ర పరిశ్రమ కీలక పాత్ర పోషించవచ్చు: కెప్టెన్ సి...

దేశ భక్తి ని నిర్మాణం చేయడంలో చిత్ర పరిశ్రమ కీలక పాత్ర పోషించవచ్చు: కెప్టెన్ సి హెచ్ బాల్ రెడ్డి

0
SHARE
సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ అధ్యర్యంలో 71 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా  నేడు (15th August 2017), “నేషనల్ సెక్యురిటి మరియు ఫిల్మ్ మేకింగ్ ” అనే అంశంపై చర్చా గోష్ఠి కార్యక్రమం హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో జరిగింది.
ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా పాల్గొన్న వింగ్ కమాండర్ కెప్టెన్ సి హెచ్ బాల్ రెడ్డి గారు మాట్లాడుతూ దేశం గురుంచి కేవలం సైన్యంలో ఉన్న వారే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరు తమ వంతు  బాధ్యత గా దేశ రక్షణలో పాల్గొనాలి అని అన్నారు. దానికి చిత్ర పరిశ్రమలో ఉన్నవారు  సైతం దేశానికి సంబంధించిన ముఖ్యమైన  సంఘటనలను ఫిలిమ్స్ ద్వారా సమాజంలో  దేశ భక్తి ని నిర్మాణం చేయడంలో కీలక పాత్ర పోషించవచ్చు అని అన్నారు. అదే విదంగా సైనికుల జీవిత చరిత్ర ను ప్రజలకు షార్ట్ ఫిల్మ్ రూపం లో కూడా ప్రజలకు అందివచ్చూ అన్నారు. వారు స్వయంగా  కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న విషయాలను పంచుకున్నారు.
సమాచార భారతి కార్యదర్శి శ్రీ ఆయుష్ గారు మాట్లాడుతూ భారతీయ చిత్ర పరిశ్రమ భారతీయత కు దూరం ఆవుతూ తెలిసో తెలియకనో విదేశీ సంస్కృతి ఆక్రమనలో చిక్కు కొని ఉన్నది. ఈ విదేశీ వ్యూహం నుండి మన సమాజాన్ని, చిత్ర పరిశ్రమ ద్వార జాగృతి చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు.
ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత  శ్రీ రాజశేఖర్ ,  శ్రీ సుమంత్ పరంజీ, చంద్రశేకర్ తో పాటు షార్ట్ ఫిల్మ్ ఔత్సాహికులు , సినీ నిర్మాతలు తదితరులు ఈ చర్చా గోష్ఠి లో పాల్గొన్నారు.