Home Rashtriya Swayamsevak Sangh భగవద్భక్తి, ఆత్మవిశ్వాసాలే మన ఆయుధం – శ్రీశ్రీ రవిశంకర్

భగవద్భక్తి, ఆత్మవిశ్వాసాలే మన ఆయుధం – శ్రీశ్రీ రవిశంకర్

0
SHARE

పాజిటివిటీ అన్ లిమిటెడ్ కార్యక్రమంలో ఈ రోజు (మే 12) ఆధ్యాత్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడారు. వారి ఉపన్యాసానికి తెలుగు స్వేచ్చనువాదం 

ప్రస్తుతం మన దేశం ఈ శతాబ్దపు పెను విపత్తును ఎదుర్కొంటోంది దానివల్ల మనోబలాన్ని కోల్పోవడం, నిరాశకు గురికావడం , మన చూట్టూ ఉన్న కష్టాలు, ఇబ్బందులు మనల్ని కుంగదీస్తాయి. ఈ పరిస్థితుల్లో మనం ఏమి చేయగలం, ఎటు చూసినా మృత్యువు తాండవిస్తోంది, మహమ్మారి వ్యాపిస్తోందని అన్నీ వైపుల నుండి ఆర్తనాదాలు, వేదనలు వినిపిస్తున్నాయి. ఈ స్థితిలో మనం ఏమి చేయాలి? ప్రస్తుతం మనం నాలుగు అంశాలపై శ్రద్ధ వహించాలి.

మొదటిది – ప్రతిఒక్కరూ ధైర్యంగా ఉండడం , అది అందరికీ భగవంతుడు ఇచ్చాడు. దాన్ని మేల్కొల్పడమే మనం ప్రస్తుతం చేయగలిగినది. ఆసుపత్రి లో వైద్యులు రోగులకు చికిత్స చేసి వారి అనారోగ్యాన్ని దూరం చేస్తారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి రోగులను నయం చేస్తారు. ఈ రోజున శారీరికంగా, మానసికంగా ప్రతి వ్యక్తి వైద్యుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇది మనందరి బాధ్యత దాన్ని నిర్వర్తించడానికి మనలో ఉన్న ధైర్య శౌర్య ఉత్సాహాలను మేల్కొల్పాలి. ఉత్సాహంగా ఉంటే నిరాశ ఉండదు .

రెండవది జాగృతమై ఉండడం. దీని వల్ల మనం భావుకతకు గురి కాము. దాని వల్ల మనం పశ్చాత్తాప పడతాము. అందుకే మనం స్థితిని బ‌ట్టి వ్యవహరించాలి. మన కష్టం కంటే ఎదుటివారి కష్టం ఎక్కువగా ఉందని తెలిస్తే అప్పుడు మనం మన కష్టాన్ని మరిచి ఎదుటి వారికి సహాయపడడానికి సిద్ధపడతాము. మనం ధైర్యంగా ఉత్సాహంగా ఉంటేనే మన చుట్టూ ఉన్నవారికి ధైర్యం చెప్పగలం. మనమే కుంగిపోతే ఎవ్వరికీ సహాయపడలేము. ఇంకొకటి కరుణ – ఇది అందరికీ ఉంటుంది. ఏదైనా వేడుక జరుగుతున్నప్పుడు ఎవరికి కరుణ చూపించే అవసరం ఉండదు. మనిషి వేదన, బాధ లో ఉన్నప్పుడే క‌రుణ‌ అవసరం. మనం అప్పుడు సహాయం చేయడానికి సిద్ధపడి వీలైనంత మేరకు సహాయ పడాలి. ఒక నర్సు తన కుటుంబంలో ఎవరో చనిపోయినప్పటికీ తన పని మానకుండా చేస్తూనే ఉంది. ఎందుకంటే ఆసుపత్రి లో ఉన్న రోగులను చూడడం తన బాధ్యత మనలో కరుణా సేవ భావనలు పెంపొందించుకోవాలి. ఇవి అందరిలోనూ ఉంటాయి కానీ మనం వాటిని బ‌య‌టికి తెచ్చి సేవ చెయ్యాలి. దీని వల్ల మనోధైర్యం పెరుగుతుంది.

మూడవది ఉత్సాహంతో పాటు మనం జాగరూకతతో మెలగాలి. నియమాలకు కట్టుబడి మనం మరొకరిని అలా ఉండమని ప్రేరేపించాలి అందరినీ ముందుకు తీసుకెళ్లడానికి ఇది చాలా ముఖ్యమైన అడుగు. మనం బాధలో ఉన్నప్పుడు మన మనస్సు స్థిరంగా ఉండదు మనం మానసికంగా అనారోగ్యంగా కనిపిస్తాము అప్పుడు మనస్సు మన  అదుపులో ఉండదు. మనం చేసే ఏ పనీ సరిగా కాదు తర్వాత పశ్చాత్తాప పడతాం. వీటిని జయించాలంటే ప్రాణాయామం, ధ్యానం, మంత్రోచ్ఛారణ చేయాలి. వీటి వల్ల ఆత్మబలం వస్తుంది. ఇది మన పూర్వేకులు కొన్ని శతాబ్దాలుగా చేస్తూ వచ్చారు. పిల్లలు పరీక్షలకు వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెడతారు. సంవత్సరం అంతా దేవుడికి దండం పెట్టకుండా పరీక్షసమయంలో మాత్రం దేవుడిని తలుస్తారు. ఇప్పుడు మన అందరి పరిస్థితి అలాగే ఉంది. మనందరం భగవంతుడి పై భక్తి కలిగి ఉండాలి. మనం ఒక విషయం నమ్మాలి . భగవంతుడు ఉన్నాడు ఆయనే మనకి బలం ఇస్తున్నాడు, ఇస్తాడు దిక్కులేనివాడికి దేవుడే దిక్కు అంటారు. మనం ఎవ్వరం చూడని వైరస్ తో పోరాడాలి. పోరాడుతున్నాము మనం భగవంతుడిపై నమ్మకం ఉంచాలి. మనం నిస్సహాయులమై ఉన్నాము. భగవంతుడు మన మానసికమైన ఉద్వేగాన్ని దూరం చేస్తాడు. ఈ విషయాలను మనం ఆచరిస్తే ఈ రుగ్మతలను అధిగమించగలం. యోగా ఉద్దేశం – హేయం దుఃఖమనాగతమ్.

ఏ బాధైతే వచ్చిందో దానిని ఎదుర్కోవడం యోగా. అలాగే ఏ బాధ ఇంకా రాలేదో, సమీప భవిష్యత్తులో రావచ్చునో దానికి ఎదుర్కునేందుకు సిద్ధం కావడం కూడా యోగానే.  యోగాభ్యాసం, ప్రాణాయామం,ధ్యానం మొదలైనవాటిని మనం ఆచరించాలి. మన ఆహారంపై కూడ ధ్యాస పెట్టాలి . మంచి పౌష్టికాహారం తీసుకోవాలి ఆయుర్వేదాన్ని అనుసరించాలి.  పసుపు, తిప్పతీగ,యష్టిమధు,అమృత్ మొదలైనవి వాడితే కరోనా తరువాత వచ్చే బలహీనతలను ఎదుర్కోవచ్చు.

జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడి పై నమ్మకం ఉంటే ఆ నమ్మకం మనల్ని కాపాడుతుంది. ఆత్మ స్థైర్యాన్ని పెంచండి. మనస్సులు నకారాత్మకమైన విషయాలకు తావివ్వకుండా ఉండాలంటే వాటికి దూరాన ఉండండి. అంటే టి‌వి, మ‌నుషుల‌తో మాట్లాడడం , వినడం చేయకండి. ఎందుకంటే అన్నీ చోట్లా, అందరూ, ఒకటే మాట్లాడుతారు. రోగం –రోగం- రోగం. ఇది కాకుండా మంచి విషయాలు మాట్లాడదాం. సమస్య ఉన్నదేదో ఉంది, మనం మాట్లాడినంత మాత్రాన అది పెరగడం తప్ప తరగదు. అందుకని నకరాత్మకమైన విషయాలకు వీలైనంత దూరంగా ఉండాలి. దాని వల్ల వాతావరణం ప్రశాంతంగా ఉండదు. అందరూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు ప్రయత్నించాలి. మనం ఈ విపత్కర పరిస్థితి నుండి తప్పక బయట పడతాము. ఇది తథ్యం. ఎవరైనా దీన్ని వ్యతిరేకిస్తే మనం బలంగా నిలబతాము. అందరూ ఉత్సాహవంతులు కావాలి, ధైర్యంగా ఉండాలి , కారుణ్యం చూపించాల్సిన సమయం ఇది. దాని వ్యక్తపరచండి. భగవంతుడిపై నమ్మకం పెంచుకోండి. యోగా సాధన , ఆయుర్వేదం పై దృష్టి పెట్టండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పరుల కొరకు ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉండండి. దీని వల్ల మన మనస్సులో సకారాత్మకమైన స్థితి ఏర్పడుతుంది. ఓం శాంతిః  జై హింద్

విజ్ఞ‌ప్తి : మా కంటెంట్ ఉపయోగకరంగా ఉందని భావించి ఈ పనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్ధికంగా సహకరించదలచిన దాతలు ఈ కింది లింక్ ద్వారా మీ విరాళాలను అందించవచ్చు. మీరు ఇచ్చే విరాళం ఎంతైనప్పటికీ మీ సహకారం మాకు విలువైనది, DONATE HERE