ఈ రోజు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం (ఆర్.ఎస్.ఎస్) ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందుతున్న సంస్థ, అనేక మంది సంఘాన్ని(ఆర్.ఎస్.ఎస్) అధ్యయనం చేస్తున్నారు. మన దేశంలో సంఘాన్ని అభిమానించే వాళ్ళు, సంఘాన్ని విమర్శించే వాళ్ళు, సంఘం అంటే తెలుసుకోవాలి అనే ఆసక్తి కలిగినవాళ్లు అనేకమంది కనబడుతూ ఉంటారు. సంఘాన్ని వ్యతిరేకించే వాళ్లలో కూడా సంఘం చేస్తున్న ఈ పనిని మేము సమర్ధిస్తాం అని మాట్లాడే వాళ్లు కూడా దేశంలో అనేక మంది కనబడుతుంటారు. సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి సంఘానికి సహకరిస్తున్న వాళ్లు కూడా అనేకమంది దేశమంతా కనబడుతుంటారు, సంఘ క్రమశిక్షణ, నిబద్ధతను చూసి సిద్ధాంతపరంగా సంఘ బద్ధ శత్రువులు కూడా దానిని అంగీకరిస్తూ ఆవిషయాన్ని వాళ్ళ కార్యకర్తలకు చెప్పేవాళ్ళు కనబడుతుంటారు. కొంతమందికి సంఘం అంటే ముస్లిం వ్యతిరేకి అనే భావం వున్నది. అదే సంఘం ప్రారంభించిన నాటి నుండి ప్రచారం జరుగుతూనే ఉన్నది ఇది కాకుండా ఇంకా ఏదైనా అంశం మాట్లాడుతారా అంటే మరేదీ వాళ్లకు కనబడదు. ముస్లిం వ్యతిరేకి అనే అంశాన్ని ప్రక్కనపెట్టి సంఘం ఏమి చేస్తున్నది అని ఎవరైనా ఆలోచిస్తే సంఘం వాళ్లకు అర్ధమౌతుంది.అటువంటి విశేషమైన రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రారంభించిన పరమపూజ్య డాక్టర్ జీ జన్మించి ఈ ఉగాదికి 135 సంవత్సరాలు పూర్తయి 136 సంవత్సరంలో అడుగుపెడుతున్నది. ఈ సందర్భంగా వారి జీవితం లోని కొన్ని విషయాలు మననం చేసుకొందాము.
స్వాతంత్ర పోరాటసమయంలో దేశ పరిస్థితులు
డాక్టర్ జీ జన్మించే నాటికీ దేశంలో ఉన్న పరిస్థితులను గమనిస్తే ఆ పరిస్థితులలో దేశంలో మార్పు కోసం డాక్టర్ జీ చేసిన ప్రయత్నాలను అర్ధం చేసుకోవచ్చు. ఆ నాటి దేశంలో ఏ సమస్య వచ్చినా ఏ మంచి విషయం జరిగిన దాని దృష్టికోణం రాజకీయం, అట్లాగే ఇస్లాం ఒత్తిడి దాంట్లో కనపడుతూ ఉంటుంది. ఈ దేశంలో హిందుత్వం ను వ్యతిరేకించే వాళ్లకు ప్రధాన అంశం ఇస్లాం. నిజంగా వారు ఇస్లాం రక్షకు ల లేక తమ అధికారం కోసం వాళ్ళు ఓట్ బ్యాంకుల ? వాళ్ళు నిజంగానే ఓట్ బ్యాంకులు ఈ దేశంలో కాంగ్రెస్ తదితర అనేక రాజకీయ పార్టీలు ఈ దిశలోనే పనిచేస్తున్నాయి. కాశ్మీర్ ఫైల్స్ పై వచ్చిన అనేక విమర్శలు వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నం మాత్రమే దానిలో కనబడుతున్నాయి ఇస్లాంను కాపాడాలంటే హిందుత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడాలి అనేది ఈ దేశంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. డాక్టర్జీ దేశ స్వాతంత్ర పోరాటంలో పని చేస్తూ చేస్తూ వారికీ వచ్చిన అనేక అనుభవాలను ఆధారం చేసుకుని హిందూ సమాజ సంరక్షణ కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రారంభించారు. డాక్టర్జీ అనుభవాలు ఆనాటి పరిస్థితులు మనం అర్ధం చేసుకొంటేసంఘం ఎందుకు అనేది మనం తెలుసోకోగలుగుతాము ఈ సందర్భంగా దానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
135 సంవత్సరాల క్రితం జన్మించిన డాక్టర్ జీ ని ఈరోజు ఎందుకు స్మరించుకోవాలి ?
135 సంవత్సరాల క్రితం జన్మించిన డాక్టర్ జీ ని మనం ఈ రోజు ఎందుకు స్మరించుకోవాలి, డాక్టర్ జీ ఏమి చేశారు, ఆ రోజుల్లో ఉన్న అనేకమంది మహా పురుషులలో డాక్టర్ జీ ప్రత్యేకత ఏమిటి? దీనిని మనం అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. డాక్టర్ జీ జీవితాన్ని మూడు భాగాలుగా చేసుకుని ఆలోచించవచ్చు
1) డాక్టర్ జీ బాల్యం నుండి కలకత్తాలో డాక్టర్ కోర్స్ పూర్తి చేసే వరకు విప్లవ భావాలతో ఆవేశాలతో పని చేసారు . కలకత్తాలో అనుశీలనసమితి లో చేరి పనిచేసారు డాక్టర్ కోర్స్ పూర్తి చేసి 1916 సంవత్సరం డాక్టర్ జీకలకత్తా నుండి నాగపూర్చేరుకొన్నారు 1916లో ఉగాది రోజున డాక్టర్ జీ ప్రేరణతో అప్పాజీ జోషి రాష్ట్రీయ స్వయంసేవక్ మండల్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు.
2) ఆ తదుపరి ఆరోజుల్లో స్వాతంత్ర పోరాటానికి వేదికలైన కాంగ్రెస్ హిందూమహాసభలలో పనిచేసారు పనిచేస్తు చేస్తూ జైలు కు కూడా వెళ్లి వచ్చారు. ఆ సమయం లోనే పత్రికలూ కూడా నడిపారు సామాజికసమస్యల పరిష్కారంకు అనేక ప్రయత్నాలు చేసారు సామాజిక పరిస్థితులను అధ్యయనం కూడాచేశారు. ఒకప్రక్క స్వాతంత్ర ఉద్యమం లో పనిచేస్తూనే అనేక అనుభవాల ఆధారంగా 1925 సంవత్సరం విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని ప్రారంభించారు. 1930 జూలై 22న అటవీ సత్యాగ్రహం చేసారు, అటవీ సత్యాగ్రహంకారణంగా మళ్ళీ జైలు కు వెళ్లారు 1931 ఫిబ్రవరి 14 వరకు జైలు జీవితం గడిపారు, ఆ తదుపరి డాక్టర్ జీ జీవించివున్న తొమ్మిది సంవత్సరాలు సంఘ కార్య విస్తరణ కే సమర్పించారు
3) 1931 నుండి 1940వ సంవత్సరం వరకు సంఘ విస్తరణ కోసం వారు చేసిన ప్రయత్నాలు వాటి వివరాలు సంక్షిప్తంగా….. వారు చేసిన ప్రయత్నాలలో మూడు విషయాలు ప్రధానం గా మనకు కనబడతాయి. 1)దేశస్వాతంత్రపోరాటంకు వేదికలు గ ప్రారంభమైన సంస్థలు రాజకీయ పార్టీలు గా రూపాంతరం చెందుతున్న సమయం లో వాటిలో చోటు చేసుకొంటున్న పరిణామాలతో సంఘం రాజకీయాలు స్వతంత్రపోరాటానికి మధ్య సంతులనం సాదించ వలసిన ఒక చారిత్రిక అవసరం ఏర్పడింది దానికోసం పని చేసారు 2)స్వతంత్రం కోసం జరుగుతున్నా ఉద్యమాలలో సంఘం ఎట్లా పాల్గొనాలి అనే విషయం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 3)సమీప భవిష్యత్ లో సంఘము దేశమంతా విస్తరించి శక్తివంతం కావటం కోసం దివారాత్రులు పనిచేసారు. సంఘానికి అఖిలభారత స్వరూపం వ్యవస్థ నిర్మాణం చేసారు, శక్తి వంతమైన పునాదులు వేశారు, ఆ పునాదుల పైనే ఈ రోజు సంఘం అప్రతిహతంగా ముందుకు పోతున్నది.
సంఘ్ పనిలో డాక్టర్జీ కి రాజకీయ సవాళ్లు ఎదురైనాయా?
పరమపూజ్య డాక్టర్జీ స్వాతంత్ర ఉద్యమం, దేశ రాజకీయాలు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం మధ్య ఒక సంతులనం సాధించేందుకు చాలా తీవ్ర ప్రయత్నం చేశారు. దాని కారణంగా అనేక సమస్యలు కూడా ఎదుర్కొన్నారు మద్దెల కు రెండు పక్కల వాయింపులు ఉన్నట్లుగా డాక్టర్ జీ కి ఒకపక్క కాంగ్రెస్ యొక్క తీవ్ర అసహనం, రెండో ప్రక్క హిందూ మహాసభ తీవ్ర అసంతృప్తి ఎదుర్కొని సంఘాన్ని జాగ్రత్తగా నిలబెట్టారు. డాక్టర్ జి హిందూ సమాజ సంఘటన కార్యం చేయడం కాంగ్రెస్ వాళ్లకు అదేదో ముస్లిం వ్యతిరేకంగా పని చేస్తున్నారు అనే భ్రమలో చిక్కుకున్నారు. దానితో డాక్టర్ జీ కి అనేక తలనొప్పులు సృష్టించేందుకు ప్రయత్నం చేసారు , రెండో ప్రక్క హిందూ మహాసభ మేము కూడా హిందువుల గురించి ఆలోచిస్తున్నాము పని చేస్తున్నాము కానీ డాక్టర్జీ ప్రారంభించిన RSS మా పనులు ఎందుకు పూర్తిగా సహకరించదు అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉండేవాళ్ళు. కాంగ్రెస్ , హిందూ మహాసభ 1930 తరువాత రాజకీయ పార్టీలు గా మారుతు వచ్చాయి ,దానితో డాక్టర్ జి సంఘాన్నివాటికి దూరంగా నిలబెట్టారు. ఇంకొక ప్రక్క స్వాతంత్ర ఉద్యమంలో సంఘం భాగస్వామ్యం అవుతూనే సంఘ కార్య విస్తరణకు ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకున్నారు. ఇట్లా డాక్టర్ జీ అన్నిటి మధ్య సంతులనం సాధించి సంఘం ఒక సామాజిక సంస్థ గా వికసింప చేశారు. మనదేశంలో ఏకాలంలోనైనా సమాజాన్ని శక్తిమంతంగా ఉంచేందుకు సామాజిక, ధార్మిక వ్యవస్థలను నిర్మాణం చేసేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతూ దేశాన్ని రాజకీయ ఆధిపత్య ధోరణి నుండి కాపాడేందుకు ప్రయత్నం చేస్తూ ఉండే వారు , అందుకే మనదేశం ఎప్పుడూ కూడా కేవలం రాజకీయాలు రాజ్యాధికారం మీద మాత్రమే ఆధారపడి లేదు. ఈ విషయాన్ని గ్రహించిన డాక్టర్ జీ రాజకీయాలకు అతీతంగా ఈ దేశంలో ఒక సామాజిక శక్తిని నిర్మాణం చేసే ప్రయత్నం ప్రారంభించారు అదే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం. సంఘం అంటే హిందూ సమాజం, హిందూ సమాజం అంటే అనేక సామాజిక వ్యవస్థలు,వాటన్నిటిని సమన్వయంతో నడిపించడమే హిందూ సమాజ సంఘటన.
స్వాతంత్ర పోరాట తీరు తెన్నులపై డాక్టర్ జీ వ్యాఖ్యానం
స్వాతంత్ర పోరాట కాలంలో రెండు అంశాలపై ప్రధాన చర్చ జరిగింది 1) దేశానికి స్వాతంత్రం సంపాదించడం 2) ఈ దేశం లోని ముస్లింలు తమ అస్తిత్వం, మనుగడ ప్రమాదంలో ఉంది అని ఉద్యమించడం. దేశ నాయకత్వానికి ఈ రెండు వేర్వేరు సమస్యలు, కానీ స్వతంత్ర పోరాటంలో ఈ రెండిటినీ కలిపి ఆలోచించడం దేశానికి కోలుకోలేని నష్టం కలిగించింది అంతేగాక ఈ దేశం యొక్క మానసికత లో చాలా మార్పులు తీసుకొని వచ్చింది. అవి ఏమిటో గమనిద్దాం. 1906 సంవత్సరం తర్వాత ముస్లిం మనోభావాలు చాలా మార్పులు వచ్చాయి, ముస్లింలు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఈ దేశంలో ఓ ముస్లిం దేశం నిర్మాణం చేసుకోవాలని సంకల్పంతో పెద్ద ఎత్తున భేదోపాయం, దండోపాయం ప్రయోగించారు , దాని కారణంగా ఆ రోజుల్లో ఉన్న హిందూ మహాసభ హిందువులను సామాజికంగా సాంస్కృతం గా ఉద్ధరించాలని దానికోసం ముస్లిముల నుండి ఎదురవుతున్నా సవాళ్లను పదే పదే మాట్లాడటం ప్రారంభించారు మాట్లాడుతూ మాట్లాడుతూ హిందూ మహాసభ ఆలోచనలోనే చాలా పెద్ద మార్పు వచ్చింది, దానితో హిందువులు అంటే ముస్లిం వ్యతిరేకులుగా గాఢంగా ముద్ర పడింది,.
అదే సమయంలో .కాంగ్రెస్ హిందూ ముస్లి ఐక్యత గురించి మాట్లాడుతూవుండేవారు ఈ విషయంలో డాక్టర్ జి ఆలోచన విలక్షణంగా ఉంది మాటిమాటికి హిందూ ముస్లిం ఐక్యత గురించి మాత్రమే మాట్లాడేవాళ్ళు ఈ దేశంలో ఉన్న ఇతర మతాలు ఐక్యత గురించి ఎందుకు మాట్లాడటం లేదు, మతాల విషయంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి కానీ దేశం, జాతి, సంస్కృతీ విషయంలో ఒకే ఆలోచన ఉండాలి ప్రపంచమంతా అలాగే ఉంటుంది అంతేగాని అది కలగూర గంప లాగా ఉండదు అని చెప్పేవారు. కానీ .కాంగ్రెస్ మహమ్మదీయుల అత్యాచారాలను అత్యాశలను భరిస్తూ నోరు మెదపకుండా వాళ్లు చేసే దాడులను వ్యతిరేకించకుండా వాళ్లను సమర్థిస్తూ చేసిన దేశ స్వాతంత్ర పోరాట దుష్పరిణామంఅట్లాగే దీనిలో బ్రిటిష్ వాళ్ళ భేదతంత్రంకూడా ఉన్నది . బ్రిటిష్ వాళ్ళకి తూర్పున ఉన్న భారత్ ను బలహీనం చేయాలంటే ఈ దేశాన్ని ముక్కలు చేయాలనేది వాళ్ళ యోజన చివరకు అవి అన్ని కలగలిసి దేశ విభజనకు దారి తీసింది.
సమకాలీన పరిస్థితులపై డాక్టర్ జీ హెచ్చరికలు – అవి ఇంకా కొనసాగుతున్నాయి?
డాక్టర్జీ రానున్నప్రమాదాలను గుర్తించి దేశాన్ని సూటిగా, తీవ్రంగా , హెచ్చరిస్తూ ఉండేవారు. హిందుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు మూడు రకాలుగా ఉన్నారు 1) ఒకటో రకం ఏదో రకంగా ముస్లిం లను కలుపుకొని పోతే మాత్రమే తాము ఈ దేశానికి ప్రతినిధులుగా గుర్తింపు వస్తుంది అనే భ్రమ కలిగిన వాళ్ళు. 2) రెండవ రకం ఆంగ్లేయ విద్య వ్యామోహంతో ఈ దేశం యొక్క మౌలిక తత్వాన్ని గ్రహించలేక హైందవం ఇస్లాం క్రైస్తవం ల వలె ఒక పిడివాదం కలిగిన మత వర్గము అనే భావన తో ఉండేవాళ్ళు, వీళ్లు ఒకరకంగా ఆంగ్లేయుల విధేయులు 3) మూడవ వర్గం మొదటినుంచి హిందువులకు హిందూ దేశం యొక్క అఖండ స్వరూపానికి సంరక్షణకు శత్రువులు, వీరివల్ల దేశానికి ఇప్పటికే చాలా నష్టం జరిగింది, ఇంకా జరుగుతుంది. ఈ విధంగా గా దేశానికి మన సంస్కృతికి చాలా పెద్ద ప్రమాదం ఏర్పడింది అని చెబుతూ ఉండేవారు. ఆంగ్లేయుల కుట్రలు ఏరకంగా ఉన్నాయో మనం ఇక్కడ గమనిద్దాం 1931 ఏప్రిల్లో లో డాక్టర్ ముంజే లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత లండన్లో భారతదేశం గురించి జరుగుతున్న కుట్రలు గురించి వివరించారు ఆంగ్లేయులు ముస్లిముల కుట్రల ఫలితంగా ఈ దేశ ప్రజలను హిందువులు, ముస్లింలు, దళితులు, భారతీయ క్రైస్తవులు, యూరేషియన్ లు, ఆంగ్లేయులు అనే వర్గాల కింద విభజించి ప్రజాస్వామ్యం పేరిట అధిక సంఖ్యాకులు అల్పసంఖ్యాకుల మీద పెత్తనం చెలాయించే విపత్కర పరిస్థితి నుండి ప్రజలను రక్షించడం మా విధి అని ఆంగ్లప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకటనలో భారత జాతి విభజనకు విషబీజాలు నాటడం జరిగింది దాని పరిణామాలు మనం చూసాము. ఆవే శక్తులు ఈరోజు వికృత రూపంలో ఈ దేశాన్ని ముక్కలు చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆంగ్లేయులు చెప్పిన పాఠం ప్రకారం ఇక్కడి నాయకులు ఈ దేశంలో ఒక జాతి ఒక రాష్ట్రము అంటూ లేదు మనం ఇప్పుడిప్పుడే ఒక జాతిగా రూపొందుతున్నము అని ఇంకా కొందరు ఇక్కడ అనేక జాతులు ఉన్నాయి, ఆ జాతుల సమూహమే ఇండియా అని ఒక కలగూర గంప జాతుల సమూహంగా చిత్రించారు వాళ్లకు ప్రమాణం ఐరోపా ఖండం లోని భాష ఆధారంగా జాతులు ఈ సిద్ధాంతాల రాద్ధాంతాల నుండి దేశం ఇప్పుడిప్పుడే బయటపడే ప్రయాస జరుగుతున్నది. బయట పడి నప్పుడే ఈ దేశం శక్తి వంత మౌతుంది.