
ప్రపంచానికి మిల్లీమీటర్ తరంగాలు, రేడియో, క్రెస్కోగ్రాఫ్ ప్లాంట్ సైన్స్ అందించిన శాస్త్రవేత్తగా జగదీష్ చంద్ర బోస్ పేరుగడించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక అంతర్జాతీయ పురస్కరాలను బోస్ అందుకున్నారు. అంతర్జాతీయ పరిశోధనా రంగంలో భారతీయ కీర్తి పతాకను ఎగురవేశారు. అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన భారతీయ పరిశోధక శాస్త్రవేత్తగా ఆయన ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు.