బ్రిటీషు వారి అస్తవ్యస్తమైన పాలనా విధానానికి వ్యతిరేకంగా ఆంగ్లేయులపై విచిత్ర యుద్ధం చేసిన ధీశాలి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ‘చీరాల-పేరాల ఉద్యమం’ ద్వారా వేలాది మంది ప్రజల్లో స్వరాజ్య స్ఫూర్తిని రగలించారు. ‘ఆంధ్రరత్న’ బిరుదాకింతుడైన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఖద్దరు పంచె, కండువా, తలపాగాతో, మెడలో రుద్రాక్షమాలతో సదా కనిపించేవారు. తెల్లదొరలపై పోరాటానికి ప్రజలను ఏకతాటిపై నిలపడంలో నిర్భయత్వాన్ని ప్రదర్శించారు. భారతీయులకు స్ఫూర్తిమంతంగా నిలిచారు.