- అఖిల భారతీయ గ్రాహక్ పంచాయతి రాష్ట్ర సమావేశం లో పలు తీర్మానాల ఆమోదం
దేశంలో వున్న ప్రతి వినియోగదారుడి హక్కులు తెలుసుకొని వారి హక్కులను కాపాడేందుకు దేశంలో అఖిల భారతీయ గ్రాహక్ పంచాయతి సంస్థ పాటు పడుతుందని గ్రాహక్ పంచాయతి రాష్ట్ర అద్యక్షులు బండి నరేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెమలికంటి విజయ్ సంయుక్తంగా తెలిపారు. ఆదివారం హిమాయత్ నగర్ లోని రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వినియోగదారుడి హక్కులపై ముద్రించిన పుస్తకాన్ని విడుదల చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కొనుగోలు దగ్గర వినియోగదారుడు మోస పోతున్నారని, అనేక సంస్థలు మోసం చేస్తూ నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయకుండా ప్రజలను నష్ట పరిచి నగదును వినియోగదారుడు నుండి దోచుకుంటున్నయని తెలిపారు.
దేశంలో వినియోగదారుడి కి అండగా ఉంటూ గ్రాహక్ పంచాయతి సంస్థ పనిచేస్తుందని, దేశంలో ఈ సంవస్తరం గ్రహక్ పంచాయతి స్వర్ణ జయంతి ఉత్సవాలను జరుపుకుంటుందనీ దేశం వ్యాప్తంగా అనేక చోట్ల వినియోగదారుడిని జాగృతం చేసేందుకు అనేక సద్దస్సులు, సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘటన కార్యదర్శి లక్ష్మణ స్వామి మాట్లడుతూ, ప్రతి జిల్లా నుండి ప్రతితిష్టత కలిగిన వ్యక్తులతో కలిపి స్వాగత కమిటీ వేసి వినియోగదారుడి రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
రాష్ట్ర కార్యాలయం ప్రారంభంతో పాటు, వివిధ రకాల అంశాలపై రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించారు. ఈ నెల జనవరి 21న రాష్ట్ర స్వాగత కమిటీ సమావేశం భాగ్యనగర్ లో నిర్వహించేందుకు రాష్ట్ర కమిటీ అంగీకారం తెలిపింది. ఈ స్వాగత కమిటీ సభ్యుల పేర్లు ఈ నెల జనవరి 12 వరకు రాష్ట్ర కార్యాలయానికి అందించాలని తీర్మానం జరిగింది. జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గ్రహక్ పంచాయతి ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాలను జిల్లా కేంద్రాలలో జరుపాలని సభ్యులు తీర్మానించారు.
నూతన రాష్ట్ర కార్యవర్గంలోకి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అరవింద్ కుమార్ ను, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కాశీ విశ్వనాథ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో వినోద్ శ్రీ వాస్తవ మెదక్, బాల మురళీధర్ స్వర్ణ జయంతి కన్వీనర్, మానిక్ రావు, నాగమల్ల సురేష్, వీనస్, సత్యం, ప్రద్యుమ్న షిండే, రామ చంద్రుడు, అరవింద్, తదితర సభ్యులు పాల్గొన్నారు.