సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా ధర్మానికి పంచమాన బిందువులైన మాత, భూమాత, గోమాత, ధర్మగ్రంథాలు, మఠమందిరాల పరిరక్షణకై విశ్వహిందూ పరిషత్ ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగానే భారతీయ సమాజానికి మూలమైన స్త్రీ మూర్తి ఉన్నతితో పాటు, సకల సమృద్ధి సాధించే దిశగా దానివల్ల సనాతన భారతీయ పునర్వైభవాన్ని తీసుకువచ్చేలా మాత సమాజ నిర్మాత అనే ధ్యేయంతో మహిళా యువతి విభాగమైన దుర్గావాహిని పనిచేస్తోంది.