Home News సిద్దిపేట జిల్లాలో విగ్రహ ఏర్పాటు విషయమై వివాదం

సిద్దిపేట జిల్లాలో విగ్రహ ఏర్పాటు విషయమై వివాదం

0
SHARE

సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం గువ్వలేగి గ్రామంలో ఆదివారం  కొంతమంది అకస్మాత్తుగా అంబేడ్కర్ విగ్రహాన్ని  గ్రామంలోని వినాయక విగ్రహం పెట్టె స్థలంలోనే పెట్టేందుకు ప్రయత్నం చేశారు. దాంతో గ్రామస్తులు మధ్య అభిప్రాయ భేధాలతో రెండు వర్గాలగా విడిపోయి వాదనకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తుల ఏకబిప్రాయం వచ్చే వరకు ఎలాంటి విగ్రహ స్థాపన చేయకూడదని తాత్కాలికంగా సర్దు బాటు చేశారు.

నిజం టుడె పోర్టల్ ఫాక్ట్ చెక్ వివరాల ప్రకారం,  గువ్వలేగి లోని కొంత మంది గ్రామస్తులను అన్యమత ప్రచారకులు రెచ్చగొట్టి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే అకస్మాత్తుగా అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. ప్రతీ ఏటా గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో  వినాయక చవితి వేడుకలు నిర్వహించే స్థలంలోనే విగ్రహాన్ని పెట్టాలనుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు  వినాయక మండప ప్రదేశాన్ని వదిలేసి గ్రామంలో ఎక్కడైనా విగ్రహం పెట్టుకుందామని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.కానీ దీనికి అన్య మత ప్రచారకులు ఒప్పు కోలేదు.  అంతేకాదు ఒక పథకం ప్రకారం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రచారం చేస్తూ, వారి మధ్యనే బేధాభిప్రాయలు ఏర్పడేలా కుట్ర చేశారు.

దాంతో పాటు సోషల్ మీడియాలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటులో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు అడ్డంకులు కల్పిస్తున్నారంటూ ప్రచారం కూడా మొదలుపెట్టారు. కానీ ఆ  గువ్వలేగి గ్రామంలో తమ శాఖ గాని , ప్రచారకులు కానీ లేరని కొందరు దురుద్దేశ పూర్వకంగా ఆర్ ఎస్ ఎస్ పేరు ప్రస్తావిస్తున్నారని జిల్లాలోని ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు స్పష్టం చేశారు.

పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఇరు వర్గాలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

(నిజంటుడె సౌజన్యం తో )