Home News ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 4

ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 4

0
SHARE
  • క‌న్నెప‌ల్లి వెంక‌ట సుబ్రమ‌ణ్యం

శివాజీ మరణం తర్వాత మరాఠ సామ్రాజ్యం:

శివాజీ మరణం తర్వాత పీష్వాలు రాజ్యాన్ని అస్తగతం చేసుకున్నారని క‌మ్యూనిస్టులు అంటున్నారు. కానీ శివాజీ మరణం తర్వాత తొమ్మిదేళ్లు శంబాజీ మహారాజ్, 11 ఏళ్లు రాజారాం, 7 ఏళ్లు తారా రాణి సాహెబ్ పోరాటం చేశారు. ఈ 27 ఏళ్ల యుద్ధం, The 27 years battle saved hinduism అని పెద్దలు చెబుతారు. 27 సంవత్సరాలు వారు హిందూ ధర్మాన్ని కాపాడారు.

పీష్వాల చేతుల్లోకి సామ్రాజ్యం ఎప్పుడు వచ్చిందన్న‌ది తెలుసుకుందాం.. శంభాజీని చంపిన తరువాత శంబాజీ కొడుకు సాహుజిని, శంబాజీ భార్యను మొగల్స్ తీసుకువెళ్లి తమ దగ్గర పెట్టుకుంటారు. ఈ 27 సంవత్సరాల యుద్ధంలో ఎప్పుడైతే మొఘలులు ఓడిపోయారో, 1707లో ఔరంగాజేబు చనిపోయాడు. ఆ తర్వాత మారాఠాలలో మరాఠాలు కొట్టుకోవాలని చెప్పి, మొఘలులు సాహుజి మహారాజును విడుదల చేస్తారు.

సింహాసనం కోసం సాహుజీ, తారా రాణి సాహెబ్ ల మ‌ధ్య వివాదం సృష్టించాల‌ని మొఘల్స్ ఎత్తుగ‌డ వేస్తారు. కానీ వారు పంథాల‌కు పోకుండా, వారి మధ్య సయోధ్య కుదుర్చుకున్నారు. దీంట్లో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి బాలాజీ విశ్వనాథ్ భట్, ఆయన తర్వాత కాలంలో పీష్వా అవుతారు. అప్పటివరకు దక్షిణ భారతదేశంలో మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న మరాఠ సామ్రాజ్యాన్ని, బాలాజీ విశ్వనాథ్ కుమారుడు బాజీరావు ఆ తర్వాత బాలాజీ బాజీరావు, వీరిద్దరూ అటక్ నుండి పేషావర్ వరకు రాజ్యాన్ని విస్తరింపచేస్తారు. అటక్ నుండి కటక్ వరకు విస్తరించి ఉన్న మరాఠ‌ సామ్రాజ్యాన్ని ఎట్టి పరిస్థితిలో ఓడించాల‌ని హమ్మద్ షా అప్డాలి వంటి వారు వచ్చారు. అలాగే మరాఠా సామ్రాజ్యం మ‌రాఠ పీష్వాల నుండి బ్రిటీష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. పిశ్వాలు ఎప్పుడూ క్రింది కులాలను తొక్కేయలేదు. బహుశా ఇబ్రహీంఖాన్ ఖాద్రి వంటి సేనాధిపతులను తీసుకొచ్చింది పిష్వాలు. కాబట్టి ఇలాంటి త‌ప్పుడు క‌థ‌నాల్ని ప్ర‌చారం చేయ‌డం స‌మంజసం కాదు. పానిపట్టు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత కూడా పీశ్వాల రాజ్యం పడిపోలేదు, బ్రిటీష్ వాళ్లు వచ్చిన తర్వాత వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆధునిక ఆయుధాల ముందు నిలువ లేక 1800 సంవత్సరంలో బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయారు.

నగ్నక్ మహర్ అనే వ్యక్తి అంబేద్కర్ గారు పుట్టిన కులంలోనే పుట్టారు. వారి వృత్తాంతం ఇప్పుడు చూద్దాం, ఆయన ఒక వెయ్యి మంది సైనికులతో వెళ్లి మూడు వేల మంది సైనికులు ఉన్నమొఘల్స్ కోటలను గెలుస్తారు. తర్వాత పీష్వాలు తమలో కలుపుకొని క్షత్రియునిగా మార్చారు. ఆయనకు ఒక పెద్ద జాగీర్ కూడా ఇచ్చారు. కాబట్టి పీష్వాలు తక్కువ కులం వారికి వ్యతిరేకులు, కుల వ్యవస్థను తీసుకువచ్చారన్నది వాస్తవం కాదు. రాజ్యాన్ని ఢిల్లీ, పాకిస్తాన్ ,ఆపనిస్తాన్ సరిహద్దుల వరకు విస్తరించారు పీష్వాలు . శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత కొంతకాలానికి ఆ స్థాయిలో విస్తరించింది పీష్వాలు. పీష్వాలు సామ్రాజ్యాన్ని అంతా తమ చేతిలోకి ఉంచుకోకుండా రాజ్యాన్ని 5 భాగాలుగా చేసి, ఐదు వంశాలని నియమించారు. వారిలో బొంస్లేలు సతారాన్ని పాలించారు. వారు శివాజీ వంశస్థులే. పీష్వాలు పూణేలో ఉండేవారు. ఇందోర్ లో హోల్కర్స్ ఉండేవారు. గ్వాలియర్ లో సింధియాలు, వారు క్షత్రియ కులానికి చెందినవారు కాదు. అంతకు ముందు వారు కుంభీలు (కౌలు రైతు), బరోడాలో గైక్వాడ్ లు ఇలా ఐదు చోట్ల ఐదు రాజ్యాలు పెట్టి సతారాలో ఉన్న రాజ్యాన్ని కాపాడింది మారాఠ పిష్వాలు. కొన్ని త‌ప్పుడు నిర్ణ‌యాల వల్ల వారు పానిపట్టు యుద్ధంలో ఓడిపోయారు. అంత మాత్రాన అహమద్ షా అబ్దాలీ భారతదేశాన్ని అంతా ఆక్రమించుకోలేకపోయాడు, తిరిగి వెనకకు వెళ్ళిపోయాడ‌న్న‌ది అస‌లు వాస్తవం.

బీమా కోరేగావ్ యుద్ధం:

బీమా కోరేగావ్ యుద్ధంతో పీష్వాల ఆధిపత్యం పోయింది. పీష్వాలు పూర్తిగా వెనుకకు వెళ్ళిపోలేదు. ఈ యుద్ధంలో పీష్వాలు ఓడిపోవడానికి ప్రధాన కారణం బ్రిటీష్ వారి దగ్గర ఉన్న ఆధునిక ఆయుధాలు. భీమా కోరేగాంవ్ యుద్ధాన్ని మనం విజయోత్సవంలా జరుపుకోవాలా?. మన దేశంలోకి ఎవరో వచ్చి, వారి కిందికి మనం వెళ్లి, మన సొంత వాళ్ళను చంపి, ఆ తర్వాత అదేదో ఘనకార్యంలా ఉత్సవాలు చేసుకోవడం అంటే ఎంతవరకు సబబు? అర్థం చేసుకోవాలి. ఒక రకంగా భారతీయుల పాలన ఆపివేసింది 1800 నాటి యుద్ధం. ఆ తర్వాత బ్రిటీష్ వాళ్లు అందర్నీ పిడించారు. అని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ విషయాలు బ్రాహ్మణులు తక్కువ కులాలను అణిచివేశారు. అంటే అంబేద్కర్ ను వివాహం చేసుకుంది కూడా ఒక బ్రాహ్మణ స్రీ కాదా, అంబేద్కర్ గారికి ఆ పేరు పెట్టింది ఒక బ్రాహ్మణుడు కాదా, ఇవన్నీ ఎందుకు చెప్పడం లేదు. శివాజీ పునరుద్ధరించిన దేవాలయాలు ఎందుకు కనిపించడం లేదు. కాబట్టి బీమా కోరేగావులో బ్రిటిష్ అందరి సంపద దోశారు. దానివల్ల అందరూ ఇబ్బంది పడ్డారు.

భవాని మాత ఖడ్గం:

శివాజీ మహారాజ్ కు భవాని మాత ఖడ్గం ఇచ్చిందని చరిత్ర చెబుతోంది. శ్రీశైలంలో గోపురం ఏనాడు నుండి ఉన్నది, ఇప్పటిది కాదు. శివాజీ మహారాజ్ దక్షిణ భారతదేశంలోకి వచ్చినప్పుడు ఆయనతో హైదరాబాద్ నిజాం సంధి చేసుకుని శివాజీ గారికి దారి ఇస్తాడు. అప్పుడు శివాజీ దక్షిణ భారతదేశ క్రింది భాగానికి వెళ్లి ,ఎక్కడైతే ఆకృత్యాలు జరుగుతున్నాయో అక్కడ నవాబులను ఓడిస్తాడు. అలా శ్రీశైలం వెళ్ళినప్పుడు శివాజీ దేహ త్యాగం చేస్తానని అంటాడు. మీరు దేహ త్యాగం చేస్తే ధర్మ పరిరక్షణ గురించి ఏంటని ఆయన సర్దార్లు ప్రశ్నిస్తారు. నాకు చనిపోవాలని ఉంది, బ్రతకాలని లేదంటున్న‌ప్పుడు భవాని మాత ద‌ర్శ‌న‌మిచ్చి ఆ ఖడ్గాన్ని బహుకరించింద‌ని చ‌రిత్ర‌లో స్ప‌ష్టంగా ఉంది. ఆ తర్వాత శివాజీ క్రిందికి వెళ్లి అరుణాచలంలో మసీదు నిర్మిస్తుంటే ఆ మసీదును శివాజీ కూల్చి, మళ్లీ శివాలయం నిర్మిస్తారు. శివాజీ బౌద్ధుడు అని చెప్పే వారికి ఇది ఒక చంప పెట్టు. ఆ త‌ర్వాత తమిళనాడులోని గంజికోట గెలుస్తాడు. త్యాగయ్య అనే సినిమాలోశరభౌజీ అనే రాజు ఉంటాడు. అతని అసలు పేరు సర్ఫోజీ ఆయన మరాఠా రాజు. శివాజీ సొంత తమ్ముడు వెంకోజీ, అతనికి తంజావూర్ రాజ్యాన్ని ఇచ్చారు. ఈ వెంకోజి తరువాతి రోజులల్లో శిల్పిని పంపి సతారా వద్ద నున్న సజ్జన్‌గడ్ లో శ్రీరాముని మూర్తిని చెక్కించారు.

బాల గంగాధర తిలక్

“స్వరాజ్యం నా జన్మ హక్కు” అని పోరాడి, కాంగ్రెస్‌లో ఉండి అన్ని కులాలు కలిసి ఉండాలని చెప్పిన బాలగంగాధర్ తిలక్ గారిలో కూడా కులాన్ని వెతుక్కోవడం హాస్యాస్పదం. తిలక్ గారు శివాజీ జయంతి ఉత్సవాలు ప్రారంభించలేదు. అంతకంటే ముందే ఉన్నాయి. గజానన్ మహారాజ్ చరిత్రను గ‌మ‌నిస్తే.. మిగతా యోగుల చరిత్రను తీసుకున్న ఆ ఉత్సవాలకు తిలక్ గారిని అతిథిగా పిలిచారని కొన్ని పుస్త‌కాలు కూడా చెబుతాయి. కాబట్టి, బాల‌గంగాధ‌ర్ తిల‌క్ కంటే ముందే ఎందరో శివాజీ ఉత్సవాలు నిర్వహించారు.

గోవింద్ బలవంత్‌ పాడ్సే అనే వ్యక్తి తనను తాను శివాజీగా ఊహించుకొని, తన గురువుగా సమాధానం స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. 1857 కంటే ముందు, శివాజీ అంత స్ఫూర్తి ఆయన బాటలో మేము అందరం నడుస్తామని మహారాష్ట్ర ప్రాంతంలో అంత బలంగా ఉందంటే, ఏదో జ్యోతిబాపూలే, శివాజీ సమాధి వెలికితీశారు అని రాశారే అది అబద్ధం .1857 కంటే ముందే మేము armed strugle చేస్తాము. మాకు శివాజీ స్ఫూర్తి అని, అలాగే మాకు 1857లో పోరాడిన ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, తాంతియాతోపే గాని, అప్పటికే శివాజీ స్ఫూర్తితోనే 1857లో పోరాడారు. అంతేకాకుండా ఇక్కడ ఎవరో మాట రాశారు శివాజీ మహారాజ్ ని ఎవరో ముస్లిం గురు ప్రభావితం చేశాడని, ముస్లిం కాదు ఎందుకంటే తను స్వయంగా పూజించుకున్న సమర్థ రామదాసు విగ్రహం పీష్వాల కు ఇస్తే వారు దాన్ని పూజిస్తారు.

నానాసాహెబ్ పీష్వా చనిపోయే వరకు (1857) బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. నానాసాహిబ్ చనిపోయే ముందు సమర్థ రామదాసు గారి విగ్రహం, వారి వెంట్రుకను గంగార్పణ చేసి చనిపోయారని చరిత్రలో స్పష్టంగా ఉంది. తిలక్ కంటే ముందే శివాజీ ఉత్సవాలు జరిగాయి, శివాజీని వెలుగులోకి తీసుకు వచ్చింది తిలక్ గారి పాటలు మాత్ర‌మే కాదు, శివాజీ బ్రతికుండగానే శివ చరితము మొట్టమొదటి రాసింది శ్రీమంతయు యోగి అన్న పుస్తకం శివాజీ బతికున్న కాలంలో రాశారు. కాబట్టి శివాజీ చరిత్ర లేదని అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. శివాజీ గారి గురువు సమర్థ రామదాసు. శివాజీ చివరి వరకు హైందవుడు గానే ఉన్నారు. అలాగే శంబాజి మహారాజు కూడా హైందవ ధర్మం కోసం పోరాడారు, వారి తమ్ముడు రాజారాం, తారా రాణి సాహెబ్ కూడా హిందూ ధర్మం కోసం పోరాడారు. శివాజీ పోరాడకపోతే హైందవం ఉండేది కాదు. కాబట్టి ఛ‌త్రపతి శివాజీ మహారాజ్ భ‌విష్య‌త్ త‌రానికి కూడా హైందవ హృదయ సామ్రాట్ గానే గుర్తిండిపోతారు.

మొద‌టి భాగం – ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 1

రెండ‌వ భాగం – ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 2

మూడ‌వ భాగం – ఛ‌త్ర‌ప‌తి శివాజీ చరిత్ర‌.. వ‌క్రీక‌ర‌ణ‌లు, వాస్త‌వాలు – 3