ఆర్‌ఎస్‌ఎస్ గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు మూడు ప్రముఖ వార్తాపత్రికలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అవధ్ ప్రాంత ప్రచార్ ప్రముఖ్ డాక్టర్ అశోక్ దూబే ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దైనిక్ భాస్కర్, హరిభూమి ఎడిటర్, న్యూస్ 24 చీఫ్ ఎడిటర్ రాకేశ్ అగర్వాల్, రమేష్ మిశ్రాలపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది.
ప్రస్తుతం నాగ్‌పూర్ లో ఉన్న ఆర్.ఎస్.ఎస్ ప్రధాన కార్యాలయం కంటే 100 రెట్ల విస్తీర్ణంలో అయోధ్యలో 100 ఎకరాల స్థలంలో RSS రెండవ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తుందని అనే అసత్యపు వార్తలను దైనిక్ భాస్కర్, హరిభూమి, న్యూస్ 24 ఇటీవలి వార్తలలో ప్రచురించాయి. “2025లో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా ముందుగా అయోధ్యలో రెండో ప్రధాన కార్యాలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఇందుకోసం 100 ఎకరాల స్థలం ఇవ్వాలని హౌసింగ్ డెవలప్‌మెంట్ బోర్డుకు విన్నవించారు. గ్రీన్ ఫీల్డ్‌షిప్ ప్రోగ్రామ్ (నవ్య అయోధ్య) కింద సంఘ్ ఈ ఆస్తిని కోరుతోంది” అని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. దీనిపై వెంటనే స్పందించిన ఆర్.ఎస్.ఎస్ పెద్దలు మీడియా సంస్థలపై ఫిర్యాదు చేశారు.
“2023 ఫిబ్రవరి 14న దైనిక్ భాస్కర్ వెబ్‌సైట్‌లో అయోధ్య (ఫైజాబాద్)లో 100 ఎకరాల్లో మరో RSS ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం గురించి కథనం అప్‌లోడ్ చేశారు. ఇది నాగ్‌పూర్‌లోని ప్రస్తుత ప్రధాన కార్యాలయంతో పాటుగా పని చేస్తుంది. ఈ కథనాన్ని రమేష్ మిశ్రా అనే దైనిక్ భాస్కర్ స్థానిక ప్రతినిధి రూపొందించారు. ఈ వార్తల స్లైడ్‌ను అదే రోజున న్యూస్ 24 ఛానల్ ప్రసారం చేసింది. దైనిక్ భాస్కర్, న్యూస్ 24 ద్వారా వ్యాపించిన వార్తలను ఊటంకిస్తూ హన్‌భూమి న్యూస్, టీవీ9 ఫోకస్ 24 న్యూస్, ప్రకాష్ టీవీ, స్టార్‌సవేరా ఛానల్, జోధన అబ్తక్ న్యూస్ జనదేశ్ టుడే ఛానెల్, ది భారత్ న్యూస్, ఓపీ ఇండియా న్యూస్, మ్రా హరియాణా న్యూస్, పంజాబ్ కేసరి ఇతర వార్తా సంస్థలు కూడా ఈ వార్తలు ప్రచురించాయి. ష అని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. మీడియాలో వ్యాప్తి చెందుతున్న నకిలీ నివేదికల ఫోటోకాపీలు, ప్రింట్‌అవుట్‌లు ఎఫ్.ఐ.ఆర్ తో జతచేశారు.
ఆర్.ఎస్.ఎస్ పై నిరాధారమైన వార్తలను ప్రసారం చేసిన దైనిక్ భాస్కర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ అగర్వాల్, దైనిక్ భాస్కర్ స్థానిక కరస్పాండెంట్ రమేష్ మిశ్రా, హన్భూమి కమ్యూనికేషన్స్ చీఫ్ ఎడిటర్/మేనేజింగ్ డైరెక్టర్, NEWS24 చీఫ్ ఎడిటర్/మేనేజింగ్ డైరెక్టర్ పేర్లను ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్నారు.
వాస్తవం ఏమిటంటే చాలా సంవత్సరాలుగా అయోధ్యలో “సాకేత్” అనే పేరుతో ఆర్.ఎస్.ఎస్ తన కార్యాలయాలన్ని కలిగి ఉంది. అయితే అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కొద్దిమంది వ్యతిరేకులు ఆర్.ఎస్.ఎస్ సంస్థ ప్రతిష్టను తక్కువ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వాస్తవాలను తెలుసుకున్నప్పటికీ, తప్పుడు వార్తలను ప్రచురించడం ద్వారా RSS ప్రతిష్ట, సత్యానికి హాని కలిగించే ఉద్దేశ్యంతో ప్రచార మాద్యమాలను ఉపయోగించి వాస్తవికతను కప్పిపుచ్చడానికి
ప్రయత్నిస్తున్నారు.
మీడియా సంస్థలు ఆర్‌ఎస్‌ఎస్‌పై తప్పుడు వార్తలను ప్రచారం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా, అనేక మీడియా సంస్థలు RSS ప్రముఖులను తప్పుగా ఉటంకిస్తూ సంఘ్ గురించి నిరాధారమైన, బాధ్యతారహితమైన వార్తలను ప్రచురించి & ప్రసారం చేశాయి.
ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ జీ మాట్లాడుతూ, “దైనిక్ భాస్కర్, ఇతర మీడియా మాద్యమాలు అయోధ్య, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశ్యంతో నకిలీ వార్తలను ప్రచురించాయి. వాస్తవాలను పరిశీలించకుండా, ఎవరి పేరు చెప్పకుండా కొన్ని మీడియా సంస్థలు సంఘ్ గురించి తప్పుదోవ పట్టించే వార్తలను ప్రచురించడం ఒక ధోరణిగా మారింది. నిరాధారమైన వార్తలను సంచలనాలుగా ప్రచారం చేయడం కాదు, సమాజ ఆలోచనా విధానానికి సరైన దిశానిర్దేశం చేసే బాధ్యతను తీసుకుని సరైన సమాచారం ద్వారా సమాజానికి జ్ఞానోదయం కలిగించాలి. అని ఆయన అన్నారు.