
బ్రిటిష్ ఇండియా దక్షిణ భారతంలో తొలి రాజకీయ డిటెన్యూ దరిశి చెంచయ్య. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి గదర్ పార్టీలో పని చేసిన సాహసి చెంచయ్య. స్వతంత్ర భారతదేశంలో రాజకీయాల జోలికి వెళ్లకుండా సంఘ సంస్కరణ కోసం శ్రమించారు. స్వరాజ్య సమరంలో తమదైన పంథాలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేశారు దర్శి చెంచయ్య. ఎలాంటి పదవి ఆశించకుండా శేషజీవితాన్ని గడిపిన నిస్వార్థ నేత. సమాజ సేవకు అంకితమైన మహోన్నత స్వరాజ్య సమరయోధులలో దరిశి చెంచయ్య ఒకరు. రోమాంచితం గావించే ఘట్టాలతో నిండిన తన జీవితానికి చెంచయ్య అక్షరరూపం ఇచ్చారు. ఆ పుస్తకం పేరు ‘నేనూ`నా దేశం’.