1303 వ సంవత్సరంలో అల్లా ఉద్దీన్ చిత్తౌడ్ నేటి రాజస్థాన్ లో 30వేల మంది హిందువులను ఊచకోత కోశాడు. ఇతడే 1353లో బెంగాల్లో లక్షా ఎనభై వేల మంది హిందువులను చంపివేశాడు.1365-67 సంవత్సరాల మధ్య బహమనీ సుల్తానులు దక్షిణ భారతదేశం విజయనగర సామ్రాజ్యంలోని 5 లక్షల మంది హిందువులను సంహరించారు. 1398 తైమూరు లంగ్ అనే ముష్కరుడు ఢిల్లీలో లక్షకు పైగా సాధారణ ప్రజలను ఊచకోత కోశాడు.1565 సంవత్సరంలో..కపటి మొగలాయి అక్బర్… మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్ పూర్ లో 48 వేలకు పైగా హిందువులను సంహరించాడు.1568లో రాజస్థాన్ చిత్తోడ్ ఘడ్ లో 30వేల మంది హిందువులను చంపివేశారు. ఈ దుర్మార్గపు ఘటనలో 8వేల మంది రాజపుత్ర మహిళలు జోహార్ (అంటే… దుర్మార్గుల చేతిలో పడకుండా చితి పేర్చుకొని అందులో దూకి మసి అయిపోవడం.) చేశారు.
1738 లో నాదిర్షా రెండు సంవత్సరాల లోనే.. మూడు లక్షల మంది హిందువులను ఊచకోత కోశాడు. 1921వ సంవత్సరంలో కేరళ మలబారులో ఉద్యమం లో భాగంగా ‘మోప్లా’ అనేచోట రెండువేల మంది హిందువులను ఊచకోత కోశారు. అప్పుడు అక్కడ రాజు గాని పాలకుడు గాని లేడు. 1946లో ముస్లింలీగ్ పిలుపు మేరకు మహమ్మదాలీ జిన్నా డైరెక్ట్ యాక్షన్ పేరుతో రెచ్చగొట్టగా కలకత్తాలో పదివేలు, బెంగాల్ లోని ‘నౌఖాలీ‘ (ప్రస్తుతం ఈ పట్టణం బంగ్లాదేశ్లో ఉంది) ఐదువేల మంది హిందువులను హత్య చేశారు. అని అంబేడ్కర్ మహాశయులు ప్రస్తావించగా.., వారు ఆ పుస్తకంలో పేర్కొనని అనేక వందల వేల సంఘటనలు, అవమానాలను, హత్యాకాండలను అనుభవించింది భారతజాతి.
మన విద్యావిధానాన్ని మాయం చేశారు.
మానవత్వాన్ని మంటగలిపారు. 413- సంవత్సరాల మధ్య ప్రథమ కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయం ప్రారంభించాడు. కనోజ్ రాజు హర్షవర్ధనుడి కాలంలో 606-642 లో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది. పదివేల మంది దేశ విదేశీ విద్యార్థులు 64 విభాగాలలో చదువుకున్న చరిత్రను ఈ గురుకులానికి ఉంది. 1200 సంవత్సరంలో భక్తియార్ పదివేల మంది విద్యార్థులను రెండు వేల మంది ఆచార్యులను కిరాతకంగా చంపి అక్కడి గ్రంధాలయాలను కాల్చి వేయగా అవి ఆరు నెలలపాటు కాలాయట. దక్షిణాదిన మాలిక్ కాఫర్ అనేక దేవాలయాలను, కాకతీయ సామ్రాజ్యాన్నీ అనేక అందమైన కట్టడాలను, వేయి స్తంభాల గుడినీ, ఇంకా అనేక ఆలయాలను ధ్వంసం చేసి లక్షల మంది ప్రజలను ఊచకోత కోశాడు.
కర్ణాటకలో టిప్పు సుల్తాన్ లక్షలమందిని, ‘మేల్కోటే’లో కేరళ రాష్ట్రంలోని మలబారులో వేలాదిమంది పూజారులను సామాన్య పౌరులను వెతికి వెతికి సంహరించిన దుష్ట చరిత్ర సజీవంగా ఉంది. రాముని గుడి కట్టించి నందుకు కంచర్ల గోపన్నను జైలులో బంధించిన గోల్కొండ నవాబుల హయాంలోనూ హింస సాగింది. 1949 సెప్టెంబరు18 న నిజాముల పాలన అనంతరం, హైదరాబాదులోని మీర్ ఉస్మాన్ అలీ ఇంటిని భారత సిక్కు మిలిటరీ సోదా చేయగా ‘మూడు ట్రక్కుల‘ నిండా హిందూ మహిళల మంగళ సూత్రాలు బస్తాలలో దొరికాయి. అంటే ఎన్ని లక్షల మంది మహిళల మంగళసూత్రాలను వీరు తెంచి వేశారో ఊహించుకోవచ్చు.
విదేశీ క్రైస్తవ మత దాడులు, నరసంహారం:
గోవా ఇంక్విజిషన్ పేరిట 55వేల మంది హిందూ మత పెద్దలను మతం మార్చుకోకపోతే హత్యలు చేసినట్టు స్వయంగా పోర్చుగల్ అధికారులే తమ డైరీలలో.. తమ నివేదికలలో పేర్కొన్నారు. చివరికి 1990వ దశకంలో భారతదేశానికి క్షమాపణలు ఆ దేశ సుప్రీంకోర్టు క్షమాపణలు చెప్పింది.
కేరళ ఇంక్విజిషన్, మలబార్ ఇంక్విజిషన్, ఈశాన్య రాష్ట్రాల్లోని మేఘాలయ, మణిపూర్ సిక్కిం, త్రిపుర వంటి రాష్ట్రాలలో…ఝూర్కండ్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాలలో క్రైస్తవ మూకలు అక్కడి గిరిజనులు, సాధారణ ప్రజలను లెక్కలేకుండా చంపారు. విచ్చలవిడిగా మత మార్పిడులు చేశారు. ఇది మన దేశంపై దండెత్తిన ముస్లిం, క్రైస్తవ పాలకుల, మత నాయకుల చరిత్ర కాగా, ఇలా తీవ్రవాదులుగా మారి నర సంహారం చేసిన వారిని మిత్రులుగా పాలకులుగా వారి అనుయాయులను మైనారిటీ సోదరులుగా భావించి తరించే నేటి దుస్థితిని చూసి సాధువులు, సన్యాసులు, విశ్వహిందూ పరిషత్ వారు భయపడుతునారు. ఈ భయం నుంచి సహజంగానే పరిష్కారం వైపు అడుగులు వేయటం హిందువులకు వారి సంస్థలకు కర్తవ్యం అవుతుంది. ఇది ఎవరు కాదనలేని నిజం.
ప్రపంచపు ఆలోచనా పద్ధతులను ప్రభావితం చేసినవారు:
రాష్ట్రీయ స్వయంసేవక సంఘం, కమ్యూనిస్టు ఆలోచన పద్ధతులు ఒకే సమయంలో ప్రారంభం కాగా, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు ఆర్థిక స్వావలంబన, సమానత్వం అనే నినాదాలతో నేటికి సుమారుగా 10 కోట్ల మంది ప్రజల చావుకు కారణమయ్యారు. కానీ వారు కోరుకున్న ఆర్థిక స్వావలంబన, సమానత్వం మాత్రం సాధించలేకపోయారు…శవాల కుప్పలు, రక్త ప్రవాహాలు మాత్రమే అనుభవించిన ఆయాదేశాలు ఇంకా, ఆ సిద్ధాంతం మాకు అవసరమా..? అంటూ కమ్యూనిస్టు దేశాలకు దేశాలే మత రాజ్యాలుగా… పెట్టుబడిదారీ రాజ్యాలుగా మారుతున్న క్రమంలో ..భారత కమ్యూనిస్టులు విదేశాల్లో భూస్థాపితమైన కమ్యూనిస్టు సిద్ధాంతమును పట్టుకుని దాని వెనుకనే నడుస్తున్నారు. పనిలోపనిగా ‘ప్రేమ తత్వాన్ని’ ప్రబోధిస్తూ, సేవలను అందిస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి సేవ, ధార్మిక, సామాజిక , సంస్థలను అవమానపరుస్తూ …అవహేళన చేస్తూ, అవకాశం ఉన్న చోట్ల కార్యకర్తలను హత్యలు చేస్తూ, వారి విదేశీ దాస్యపు బావాలను ప్రదర్శిస్తున్నారు.
ఇవన్నీ …భయానికి కారణాలే…! అయినా.. విశ్వహిందూ పరిషత్ తమ హిందూ జాతిని రక్షించుకోవడానికి ఎన్నుకున్న మార్గం ప్రజాస్వామ్య పద్ధతి. హింసకు తావు లేని ‘శుద్ధ సాత్విక ప్రేమ’ మారం. ఇది ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నది. పశ్చిమ దేశాలలో భారతదేశం, హిందుత్వ ప్రభావం పెరుగుతున్నది. ఆఫ్రికా దేశాలు సైతం ‘హరే రామ హరే కృష్ణ’ అంటూ ఆనందంతో తరిస్తున్నాయి. ఇది వారికి కంటగింపుగా మారింది. విశ్వహిందూ పరిషత్ ప్రయత్నాల కారణంగా విదేశాలలో ధర్మప్రచారానికి గతంలో ఉన్న అడ్డు తొలగింది. సముద్ర మార్గంలో ప్రయాణించవచ్చు అనే భావన స్వామీజీలలో పెంచిన కారణంగా పరిణమించిన ప్రభావాన్ని జీర్ణించుకోలేని ‘జియో పొలిటికల్ ‘సంస్థలు పనికట్టుకొని విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్, హిందూ సన్యాసుల పైన కాషాయం టెర్రరిజం అంటూ విష ప్రచారం చేస్తున్నారు. ఈ విష ప్రచారాలు శాశ్వతంగా కొనసాగవు. చీకటిలో ఉన్న ప్రపంచానికి వెలుగు నందించేందుకు, ఉదయించే ‘కాషాయ వర్ణపు’ సూర్యుణ్ణి ఏ గబ్బిలమూ, ఏ అరచేయీ, ఏ కొయ్య చెక్కా, అట్టముక్కా… ఆపలేవు||
ఆకారపు కేశవరాజు రాంచీ
(విజయక్రాంతి సౌజన్యం తో)
(ఈ వ్యాసం మొదట 29 జూన్, 2018 నాడు ప్రచురితమైంది)