Home Telugu Articles గో సంరక్షణ చట్టం సద్వినియోగం చేసుకుందాం

గో సంరక్షణ చట్టం సద్వినియోగం చేసుకుందాం

0
SHARE

గోరక్షణ – దేశ రక్షణ కంటే ఏ మాత్రం తక్కువ కాదని మహాత్మా గాంధీ తెలిపారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగివున్న మన గోమాతను కాపాడుకోవటం మనందరి బాధ్యత.

భారతీయులు సగర్వంగా చెప్పుకోదగిన ప్రాచీన భారతీయ నాగరికతలోని అద్భుత విజ్ఞానమే ‘గోవిజ్ఞాన’ సంపద. గోవు విలువ తెలియడం చేత దానికి దేవతాస్థానం ఇవ్వబడింది. గోరక్షణ ఈ దేశానికి అతి ప్రధానమైన అంశం. ఎందుకంటే మన ఈ ప్రత్యేకమైన, ఉత్తమ గోసంపద ప్రపంచంలో ఎక్కడా లేదన్నది ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయం. 

ఈ అద్భుత గోవిజ్ఞాన సంపదను గుర్తించక, మరచిపోయిన సుప్త దశలోని మన రైతు సోదురులు గోవులను భారంగా ఎంచి, సంతలలో 5వేల నుంచి 15 వేలలోపుకే – కసాయివారికి కోతకు అమ్ముకుంటున్నారు. రైతులు గతంలో గోసంపదతో కలసి ఉండటం వల్ల వారికి పాడిపంటలు పుష్కలంగా దక్కేవి. ఆరోగ్యకరమైన ఆహారం లభించేది. ఒక ఆవువేసే పేడ, మూత్రాల వల్ల రైతు 30 ఎకరాలను సులభంగా విష రసాయనాలు లేకుండా వ్యవసాయం చేయవచ్చు. ఒక్క రోజుకు ఒక ఆవు ఇచ్చే పది కిలోల పేడ, పది లీటర్ల మూత్రం ద్వారా ఒక ఎకరాకు సరిపోను ఎరువు పొందవచ్చు. ఇలా రోజుకు ఒక ఆవు రెండు వేల రూపాయల విలువైన ఎరువును ఇస్తుంది. గోమూత్రం, కొన్ని చెట్ల ఆకులతో కలసి పురుగు మందులను తయారు చేయవచ్చు. మనదేశంలో అనాదిగా.. ఇప్పటికీ ఈ పద్ధతులను కొందరు పాటిస్తూ లబ్ది పొందుతున్నారు. అతితక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయగలగడం, అధిగ దిగుబడి సాధించడం, నాణ్యమైన ఉత్పత్తులు పొందడం గోవుల వల్ల సాధ్యం.
నిద్రావస్థలో వున్న ప్రభుత్వ యంత్రాంగం గో సంరక్షణ చట్టాలను తుంగలో తొక్కుతున్నాయి. వీటి రక్షణపై ఎవరి దృష్టీ ఉండటం లేదు. రక్షించవలసిన ప్రభుత్వం విభాగాలు, వైద్యులు, పోలీసు యంత్రాంగాలు – రాజ్యాంగం ఆవులకిచ్చిన హక్కులను గాలికి వదులుతున్నారు. గో వధశాలల యజమానులు తమ అత్యధిక లాభార్జనకు, పై బలహీనతలను సొమ్ము చేసుకొంటూ – యంత్రాంగాన్ని వారి గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు. ఒక్కొక్క మండలంలో 500 నుండి 1000 వెయ్యి ఆవులుపైన ఉన్నవి వేళ్లపై లెక్కపెట్టవచ్చును. దీనివల్ల ఎప్పటికప్పుడు పర్యావరణం, ప్రకృతిలో సమతుల్యత లోపించి మానవుడు ఊహించని కష్టాలను ఎదుర్కొంటున్నాడు.

నానాటికీ తరిగిపోతున్న గోవుల కారణంగా ఏర్పడుతున్న కరవు కాటకాల నేపథ్యంలో గో సంరక్షణ అనేది ప్రస్తుత కాలంలో ఒక తప్పనిసరి బాధ్యతగా మారింది. అయితే ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ అనేక జాతి వ్యతిరేక పార్టీలు, సంస్థలు గోరక్షణ అంటే అదొక మతానికి వ్యతిరేకం అనే స్థాయికి తమ ప్రచారాన్ని తీసుకువచ్చాయి. ఈ క్రమంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని ప్రాణాలకు తెగించి మరీ అడ్డుకుంటున్న జంతుప్రేమికులు, రైతులు, సామాజిక కార్యకర్తలను మతవాదులుగా చూపిస్తూ, మతపరమైన అనేక తప్పుడు కేసులు ఇబ్బందులకు గురిచేస్తున్న దాఖలాలు అనేకం. 

బక్రీద్ మొదలైన పండుగల సందర్భంగా ఆహరం పేరిట గోవులను అక్రమంగా వధశాలలకు తరలిస్తున్న ఘటనలు ఈమధ్య అనేకం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో వాటి అక్రమ రవాణాను అడ్డుకునే గో సంరక్షకులపైనే పోలీసులు, ప్రభుత్వాలు కేసులు నమోదు చేస్తున్నాయి. నిజానికి భారతదేశంలో గో సంవర్ధన మరియు సంరక్షణ కొరకు అనేక చట్టాలు ఉన్నాయి. ఈ వ్యాసం ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేస్తున్నాము.

గోవధ నిషేధించడంతో పాటు వివిధ రకాల గోవుల సంతతి కాపాడాలని భారత రాజ్యాంగంలోని 48వ అధికరణం స్పష్టం చేస్తోంది. భారత ప్రభుత్వం జంతు హింస నిరోధక చట్టం 2016లో కొన్ని నిర్దిష్టమైన నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం మార్కెట్లో గోవుల క్రయవిక్రయాలు జరిపేవారు వాటిని గోవధకు వినియోగించకుండా చూసుకునే బాధ్యత వహించాలి. 
వాహనాల్లో గోవుల రవాణాకు సంబంధించి జంతువుల రవాణా చట్టం 1978లోని నిబంధనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
– వ్యవసాయ నిమిత్తం గోవుని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించాల్సి వస్తే ముందుగా అర్హత కలిగిన పశువైద్యుడి ద్వారా ఆ గోవు యొక్క ఆరోగ్యం ప్రయాణం చేసేందుకు (రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా) అనుకూలంగా ఉన్నట్టుగా సర్టిఫికెట్ పొందాలి. – రవాణా కోసం ఉద్దేశించిన గోవులకు ఎటువంటి అంటువ్యాధులు లేవు అని ఆ సర్టిఫికెట్ ద్వారా వైద్యుడు నిర్ధారించాలి. – గోవులను తరలిస్తున్న వాహనంలో కచ్చితంగా ఒక గోవుల కోసం ఒక ప్రాథమిక చికిత్స సామాగ్రి ఉండాలి. – గోవులను తరలిస్తున్న వాహనంలోని వ్యక్తి వద్ద.. ఆ గోవులను ఎవరు తరలిస్తున్నారు, ఎవరికి చేరవేస్తున్నారు, ఇరువురి వివరాలు, చిరునామా, ఫోన్ నెంబర్లతో పాటుగా ఎన్ని గోవులు ఆ వాహనంలో ఉన్నాయి, వాటికి ఏ విధమైన ఆహారపదార్ధాలు అందుబాటులో ఉంచారు వంటి వివరాలు కూడా కలిగివుండాలి.- రవాణా చేస్తున్న వాహనంలోని గోవుల్లో ఒక్కో గోవుకు మధ్య సగటున కనీసం రెండు చదరపు అడుగుల స్థలం ఉండాలి.  – గోవులకు సరియైన ఆహరం, నీరు అందించిన తరువాతే వాహనంలోకి ఎక్కించాలి. – గర్భంతో ఉన్న గోవును రోడ్డు మార్గంలో కాకుండా రైలుమార్గంలోనే చేరవేయాలి. అటువంటి గోవును ఇతర గోవులతో కలిపి వాహనంలో ఉంచరాదు. ఆ గోవుకు సరియైన గాలి, వెలుతురు అందేవిధంగా తగు చర్యలు తీసుకోవాలి.  

గోవును వధిస్తే నాన్‌బెయిల్‌బుల్ కేసు – సుప్రీం కోర్టు:
గోవులు, పశుగణాలను వధించినా, గాయపరిచినా నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేసే విధంగా ఐపిసి సెక్షన్ 429కు సవరణలు చేయాలని ఉమ్మడి హైకోర్టు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను 2017లో ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకరరావు ఆదేశాలు జారీ చేశారు. గోవధకు సంబంధించి దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో ఆరోగ్యకరమైన ఆవు అనారోగ్యకరంగా ఉందని తప్పుడు ధృవీకరణ పత్రం ఇచ్చిన వెటర్నరీ వైద్యులపైన కూడా క్రిమినల్ కేసులు, నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసే విధంగా ఏపి గోవధ నిషేధం చట్టం 1977 సెక్షన్ 10నిబంధను చేర్చాలని కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో ఎటువంటి పురోగతి కనపడడంలేదని హైకోర్టు పేర్కొంది. 
గోవులను హింసించడం, ఆహారంలో విషం కలిపి చంపడం, వధించడం, అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడే నిందితులకు భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 429 ప్రకారం జరిమానా లేదా గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా రెండింటిని విధించవచ్చు.   

నానాటికీ తరిగిపోతున్న గోవుల కారణంగా ఏర్పడుతున్న కరవు కాటకాల నేపథ్యంలో గో సంరక్షణ అనేది ప్రస్తుత కాలంలో ఒక తప్పనిసరి బాధ్యతగా మారింది. అయితే ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ అనేక జాతి వ్యతిరేక పార్టీలు, సంస్థలు గోరక్షణ అంటే అదొక మతానికి వ్యతిరేకం అనే స్థాయికి తమ ప్రచారాన్ని తీసుకువచ్చాయి. ఈ క్రమంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని ప్రాణాలకు తెగించి మరీ అడ్డుకుంటున్న జంతుప్రేమికులు, రైతులు, సామాజిక కార్యకర్తలను మతవాదులుగా చూపిస్తూ, మతపరమైన అనేక తప్పుడు కేసులు ఇబ్బందులకు గురిచేస్తున్న దాఖలాలు అనేకం. 
బక్రీద్ మొదలైన పండుగల సందర్భంగా ఆహరం పేరిట గోవులను అక్రమంగా వధశాలలకు తరలిస్తున్న ఘటనలు ఈమధ్య అనేకం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో వాటి అక్రమ రవాణాను అడ్డుకునే గో సంరక్షకులపైనే పోలీసులు, ప్రభుత్వాలు కేసులు నమోదు చేస్తున్నాయి. నిజానికి భారతదేశంలో గో సంవర్ధన మరియు సంరక్షణ కొరకు అనేక చట్టాలు ఉన్నాయి. ఈ వ్యాసం ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేస్తున్నాము. 

గోవధ నిషేధించడంతో పాటు వివిధ రకాల గోవుల సంతతి కాపాడాలని భారత రాజ్యాంగంలోని 48వ అధికరణం స్పష్టం చేస్తోంది. భారత ప్రభుత్వం జంతు హింస నిరోధక చట్టం 2016లో కొన్ని నిర్దిష్టమైన నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం మార్కెట్లో గోవుల క్రయవిక్రయాలు జరిపేవారు వాటిని గోవధకు వినియోగించకుండా చూసుకునే బాధ్యత వహించాలి. వాహనాల్లో గోవుల రవాణాకు సంబంధించి జంతువుల రవాణా చట్టం 1978లోని నిబంధనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • వ్యవసాయ నిమిత్తం గోవుని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించాల్సి వస్తే ముందుగా అర్హత కలిగిన పశువైద్యుడి ద్వారా ఆ గోవు యొక్క ఆరోగ్యం ప్రయాణం చేసేందుకు (రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా) అనుకూలంగా ఉన్నట్టుగా సర్టిఫికెట్ పొందాలి.
  • రవాణా కోసం ఉద్దేశించిన గోవులకు ఎటువంటి అంటువ్యాధులు లేవు అని ఆ సర్టిఫికెట్ ద్వారా వైద్యుడు నిర్ధారించాలి.
  • గోవులను తరలిస్తున్న వాహనంలో కచ్చితంగా ఒక గోవుల కోసం ఒక ప్రాథమిక చికిత్స సామాగ్రి ఉండాలి.
  • గోవులను తరలిస్తున్న వాహనంలోని వ్యక్తి వద్ద.. ఆ గోవులను ఎవరు తరలిస్తున్నారు, ఎవరికి చేరవేస్తున్నారు, ఇరువురి వివరాలు, చిరునామా, ఫోన్ నెంబర్లతో పాటుగా ఎన్ని గోవులు ఆ వాహనంలో ఉన్నాయి, వాటికి ఏ విధమైన ఆహారపదార్ధాలు అందుబాటులో ఉంచారు వంటి వివరాలు కూడా కలిగివుండాలి.
  • రవాణా చేస్తున్న వాహనంలోని గోవుల్లో ఒక్కో గోవుకు మధ్య సగటున కనీసం రెండు చదరపు అడుగుల స్థలం ఉండాలి. 
  • గోవులకు సరియైన ఆహరం, నీరు అందించిన తరువాతే వాహనంలోకి ఎక్కించాలి. – గర్భంతో ఉన్న గోవును రోడ్డు మార్గంలో కాకుండా రైలుమార్గంలోనే చేరవేయాలి. అటువంటి గోవును ఇతర గోవులతో కలిపి వాహనంలో ఉంచరాదు. ఆ గోవుకు సరియైన గాలి, వెలుతురు అందేవిధంగా తగు చర్యలు తీసుకోవాలి. 