Home News పురాతన దుర్గా మందిరంపై ముస్లిం వర్గీయుల దాడి.. హిందూ యువకుడి కిడ్నాప్

పురాతన దుర్గా మందిరంపై ముస్లిం వర్గీయుల దాడి.. హిందూ యువకుడి కిడ్నాప్

0
SHARE

ఢిల్లీ: నగరంలోని చౌరీ బజార్ సమీపంలో గల పురాతన హిందూ ఆలయంపై స్థానిక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దేవాలయంలోని పూజావిగ్రహాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. 

సోషల్ మీడియా ద్వారా వ్యాప్తిలో ఉన్న వీడియో కధనాల ప్రకారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో సుమారు 300 నుండి 400 మంది దాకా పాల్గొన్నట్టు తెలుస్తోంది. దుర్గా మందిరంలో పాటు చుట్టుపక్కల ఉన్న హిందువుల ఇళ్లను కూడా లక్ష్యంగా దాడి జరిపినట్టు స్థానికుల కధనం. 

దాడికి పాల్పడినవారిలో ఆస్ మహ్మద్ అనే కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. స్థానికంగా నివసిస్తున్న సంజీవ్ కుమార్ అనే హిందూ యువకుడితో వాహన పార్కింగ్ విషయమై జరిగిన వాదన సందర్భంగా మహ్మద్ సుమారు మరో 25 మందితో కలిసి తన ఇంటి మొదటి అంతస్తులోకి ప్రవేశించి, ఇంటి యజమానితో పాటు, అతడి ముగ్గురు పిల్లలు, 80 ఏళ్ల వృద్ధురాలిపై కూడా దాడి చేసి గాయపరచినట్టు సంజీవ్ కుమార్ భార్య వివరణ ఇచ్చారు. 

ఈ ఉదంతం అనంతరం స్థానికంగా ఉండే 17 ఏళ్ల యువకుడు కనిపించకుండా పోవడం గమనార్హం. ఆర్గనైజర్ పత్రిక ప్రతినిధితో మాట్లాడిన ఆ యువకుడి తల్లిదండ్రులు.. స్థానిక ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు తమ ప్రాంతంలో విధ్వంసం సృష్టించిన అనంతరం తమ కొడుకుని అపహరించారని ఆరోపించారు.  

ఆమ్ ఆద్మీ పార్టీ తిరుబాటు ఎమ్మెల్యే కపిల్ మిశ్రా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన వీడియోలో.. ఆలయంలో చొరబడి విధ్వంసం సృష్టించిన మూక అనంతరం స్థానిక హౌజ్ ఖాజీ పోలీస్ స్టేషన్ ను కూడా చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. 

పోలీసుల కధనం ప్రకారం.. మందిరానికి సమీపంలోని ఒక ఇంటి ముందు వాహన పార్కింగ్ విషయమై జరిగిన వాదన ఇరువర్గాల మధ్య చిలికిచిలికి గాలివానగా మారింది. అనంతరం ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు రాళ్లు రువ్వడం మొదలుపెట్టినట్టు పోలీసులు ధృవీకరించారు. 

స్థానిక కధనాల ప్రకారం ఈ ప్రాంతంలో 95 శాతం ముస్లింలు నివసిస్తుండగా కేవలం 5 శాతం మాత్రమే హిందువులు ఉన్నారు. 

ఘటన గురించి వార్త అందిన వెంటనే ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

Source: Organiser OpIndia