మన భారతీయ భక్తి సాహిత్యలో గోదాదేవి గానం చేసిన పాశురాలుగా చెప్పబడే ఈ తిరుప్పావై దివ్యప్రభందం అత్యంత ప్రముఖమైన స్థానాన్ని అలంకరించింది. ఆధ్మాత్మిక భావనను పెంపొందించుకుంటూ స్వకార్యాన్నే కాక లోకహితాన్నీ కాంక్షించాలన్న భావన గోదాదేవి రచనల్లోనూ, ఆమె జీవన శైలిలోనూ వెల్లడవుతుంది.