
- పారిశుధ్య కార్మికులకు సన్మానం
సామాజిక సమరసత వేదిక కూకట్ పల్లి భాగ్ జనప్రీయ నగరం మియాపూర్ లోని శ్రీరామలయంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డుకు ఎంపికైన పారిశుధ్య కార్మికురాలు, అచలతత్వ బోధనలో నిష్ణాతురాలైన డి.నారాయణమ్మ గారికి సామాజిక సమరసత వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. అలాగే పారిశుధ్య కార్మికులకు దుప్పట్లు ఇచ్చి సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ గారు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ కీర్తి ప్రపంచానికి పరిచయం చేసినవారన్నారు. దీనులు దుఃఖితులకు సామాజిక సమరసత వేదిక అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సహ కన్వీనర్ మల్కాజి వేణుగోపాల్ గారు, రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ శ్రీమతి కే. రుక్మిణి గారు, తదితరులు పాల్గొన్నారు.