గోల్కొండ సాహితీ మహోత్సవం ఈ నెల 20, 21 తేదీల్లో హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కాలేజిలో నిర్వహించనున్నారు. రెండు రోజుల కార్యక్రమంలో లబ్ద ప్రతిష్టులైన రచయితలు, గ్రంథకర్తలు, ప్రచురణ కర్తలు, సాహితీ వేత్తలు, పుస్త ప్రేమికులు పాల్గొననున్నారు.
మొదటి రోజు కార్యక్రమానికి హార్యన గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు ముఖ్య అతిథిగా, ప్రముఖ కవి, రచయిత సుప్రసన్నచార్య గారు గౌరవ అథిదిగా , ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ కార్యకారిణీ సభ్యులు శ్రీ వడ్ల భాగయ్య గారు ప్రధాన వక్తగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో డా.రతన్ శార్దా గారు రచించిన “స్వరాజ్య సాధనలో ఆర్.ఎస్.ఎస్” , ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు రచించిన “నిజాం రూల్‌డ్ అన్‌మాస్క్‌డ్”( ఇంగ్లీష్), డా. బి. సారంగపాణి గారు రచించిన “ఆంగ్లేయులు ఏలుబడిన అంతులేని దోపిడి” పుస్తకాల ఆవిష్కరణలు కూడా జరుగుతాయి. ఆ తర్వాత పలు అంశాలపై చర్చా కార్యక్రమాలు, సమావేశాలు జరుగుతాయి. నాటికలు, నృత్య ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి.
రెండో రోజు స్వాతంత్ర్య ఉద్యమ పోరాటాలపై చర్చా కార్యక్రమం ఉంటుంది. అనంతరం స్వాతంత్ర ఉద్యమంలో వీరోచితంగా పోరాడి మరుగున పడిపోయన యోధుల జీవిత చరిత్రపై చర్చా కార్యక్రమం ఉంటుంది. యువ రచయితలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ముగింపు సమావేశంలో ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేకర్ గారు మార్గదర్శనం చేస్తారు.
To register as delegate, kindly click the link here : https://golkondalitfest.org/register-as-a-delegate/