గుజరాత్‌లోని ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభల్లో చివరి రోజున పరమ పూజనీయ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ పత్రికా సమావేశంలో మాట్లాడారు. గత మూడు రోజులుగా అఖిల భారత ప్రతినిధి సభలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తల హజరులో జరిగే అతిపెద్ద సమావేశం ఇది. దాదాపు 1200 మంది కార్యకర్తలు, అధికారులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ సమావేశాల్లో సంఘ శాఖల సంఖ్యను పెంచాలని ప్రణాళికలు నిర్ణయించాము. దానికి తగిన ప్రచారకులు కూడా సిద్ధమవుతున్నారు. సమాజాన్ని చైతన్య పరచడమే సంఘ లక్ష్యం… భౌగోళిక విస్తరణ మాత్రమే కాదు. ఆర్.ఎస్.ఎస్ వెబ్‌సైట్‌లో జాయిన్ ఆర్.ఎస్.ఎస్ ద్వారా సంఘానికి అనుబంధమైన అనేక మంది కార్యకర్తలు సంఘ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. సమాజంలో అద్భుతమైన పరివర్తన మాకు అనుభవమైంది. అనేక మంది కార్యక్రతలు “మేము ఏం పని చెయ్యాలో చెప్పండి” అంటూ ముందుకు వచ్చారు. ఇది సంఘం పట్ల సమాజానికి ఉన్న నమ్మకం.
దేశ భద్రత, సామాజిక సమరసత, సేవ ఇలా అనేక విషయాలలో సంఘ్ చేస్తున్న కార్యక్రమాలు సమాజంలో అనేక మార్పులకు కారణం అయ్యింది. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. గ్రామ వికాసం అనే కార్యక్రమంలో దాదాపు 400 గ్రామాలను ప్రభాత గ్రామాలుగు గుర్తించాం. అక్కడ గమనించగలిగిన మార్పు సంభవించింది. ప్రతి జిల్లాలో ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చడం సంఘ లక్ష్యం. వ్యవసాయ గ్రామ స్వావలంబన, సమాజ సమరసత, సామాజిక సురక్ష ఇలాంటి అనేక అంశాలపై దృష్టి ఆర్.ఎస్.ఎస్ దృష్టి సారిస్తోంది. ఒక గ్రామం మొత్తం ఐకమత్యంతో ఒక కుటుంబగా మెలగడానికి అవసరమైన సమరసత, కుటుంబ సంరక్షణ పర్యావరణ రక్షణ, గోసేవ, విలువలతో కూడిన సమాజం, పరమతసహనం, దేశం కోసం సమాజం కోసం తపించే బలమైన భావన మనమూ మన చూట్టూ ఉన్న సమాజమూ అన్నీ బాగుండాలి అన్న వసుదైక తత్వాన్నిపెంపొదించడమే ఆర్.ఎస్.ఎస్ లక్ష్యం.
సమాజంలో అనేక సంస్థలు ఈ పనులన్నింటిలోనూ ఎంతో సేవా సహకారాలు అందిస్తున్నారు. వారందరినీ ఆర్.ఎస్.ఎస్ కలుపుకునే ముందుకు వెళ్తోంది. స్వచ్చ భారత్ అనేక కార్యక్రమం ఒక ఉదాహరణగా తీసుకుంటే పౌర సమాజం తమ వంతు పాత్రను పూర్తిగా నిర్వహించడం లేదు. సామాజిక బాధ్యతగా పౌరసమాజంలో జరగాల్సిన మార్పు ఇంకా ఉంది. ఈ విషయంపై ఈ సమావేశంలో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము.
రెండో అంశం, భారతీయ సంస్కృతి హిందూ సంప్రదాయం గురించి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని శక్తులు తెలిసో, తెలియకో ఒక తప్పుడు సంకేతాలను ప్రచారం చేస్తున్నాయి. వాటిని ఖండిస్తూ భారతీయ సనాతన హిందూ సంప్రదాయాలను తత్వాన్ని ప్రచారం చేస్తూ సత్యాన్ని ప్రకటించిన అనేక సంస్థలు, వ్యక్తులు, సాహిత్యం, మనకు అందుబాటులో ఉంది. ఆ సత్యాన్వేషణ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించడమైనది.
స్వాతంత్య్ర అమృత మహొత్సవం జరుగుతున్న ఈ సందర్భంలో చరిత్రలో మరుగున పడిన అనేక యోధల చరిత్రలు మనం వెతికితే దొరుకుతాయి. ఇప్పటి దాకా ఎందుకు ఆ చరిత్రలను దాచి ఉంచారు. ఈ మహోత్సవాల సందర్భంగా ఆ మరుగుపడ్డ యోధుల చరిత్రను వెలికి తీసే పని ఆర్.ఎస్.ఎస్ చేపట్టింది. వారి భవిష్యత్ భారత దర్శనాన్ని ప్రస్తుత యువతరానికి తెలియజేసే పని కూడా ఆర్.ఎస్.ఎస్ చేపట్టింది. కరోనా వల్ల ఈ రెండు సంవత్సరాలలో విద్య, ఆర్థిక రంగాలలో కొంత వెనుకబడ్డాం. ఆన్‌లైన్ క్లాసులు అయిన్పటికీ ప్రత్యక్షంగా ఉపాధ్యయుడి సమక్షంలో నేర్చుకొనే విద్యకు విలువ ఎక్కువ. ఆ దిశగా
ప్రయత్నాలు మొదలు పెట్టాం. ఆర్థికంగా కూడా అనేక అంశాలలో కూడా ఈ పెనుబాటు జరిగింది. మన దేశ మానవ శక్తి, భౌగోళిక సంపద రెండింటిని సమన్వయ పరిచి ఆత్మనిర్భర భారత నిర్మాణంపై దృష్టి సారించాలనీ ఈ ప్రతినిధి సభ తీర్మానం చేసింది. కుటీర, పరిశ్రమలు, అంకుర సంస్థలు అభివృద్ధిలోకి రావాలి. ధార్మిక సంపాదన భారతీయ సాంప్రదాయం. ఆ దృష్టిగా ఒక బలమైన పని జరగాలని ఆర్.ఎస్.ఎస్ కొరుకుంటుంది. ప్రభుత్వం కూడా తన ప్రణాళికలు చేస్తుంది. సమాజం కూడా ఆ దిశగా పని చేయాలని తీర్మాణం చేశాము.