Home News గోశాల నిర్వహిస్తున్న జర్మన్‌ మహిళ

గోశాల నిర్వహిస్తున్న జర్మన్‌ మహిళ

0
SHARE
  • 1200 ఆవులు.. నెలకు 22 లక్షల ఖర్చు
  • ఏళ్లుగా సొంత ఖర్చుతో నిర్వహణ

ఎవరైనా పాలిచ్చే గోవులనే పెంచుకుంటారు. వయసుడిగాక వాటిని నిర్దాక్షిణ్యంగా వదిలించుకుంటారు. యూపీలోని మధురకు దగ్గర్లోని రాధా కుంద్‌లో గల ‘సురభి గోశాల నికేతన్‌’ మాత్రం ఇందుకు భిన్నం! అక్కడన్నీ ముసలి ఆవులే ఉంటాయి. అవి కూడా 1200కు పైనే! దీన్ని ఏదో స్వచ్ఛంద సంస్థ, లేదంటే ఏ ప్రభుత్వ రంగ సంస్థనో నిర్వహిస్తుందనుకుంటే పొరపాటే! ఈ గోశాల నిర్వాహకురాలు 59 ఏళ్ల విదేశీ మహిళ. జర్మనీకి చెందిన ఆమె పేరు ఫ్రెడెరిక్‌ ఇరీనా బ్రూనింగ్‌. గోరక్షణ అంటే ఆమెకు పంచప్రాణాలు. 1978 భారత్‌కు తొలిసారిగా ఓ పర్యాటకురాలిగా వచ్చారు. యూపీలోని రాధాకుంద్‌లో ఓ గురువు శిష్యరికాన్ని స్వీకరించి ఇక్కడే ఉండిపోయారు. ఓసారి పొరుగు వ్యక్తి తన ఆవును కొనమని కోరడంతో కాదనలేకపోయారు. అప్పటి నుంచి గోరక్షణే వృత్తి, ప్రవృత్తిగా జీవిస్తున్నారు. ఆమెను స్థానికులంతా ముద్దుగా ‘సుదేవీ మతాజీ’ అని పిలుచుకుంటారు. ఇప్పటిదాకా ఆవులు, దూడలు కలిపి గోశాలలో 1200దాకా ఉండగా..వాటి పోషణ, పనివాళ్ల జీతాల కోసం నెలకు రూ.22 లక్షల సొంత డబ్బునే వెచ్చిస్తున్నారు. బెర్లిన్‌లో ఉన్న కొన్ని స్థిరాస్తుల ద్వారా వచ్చే అద్దెతో ఆమె గోశాల నిర్వహిస్తున్నారు. గోశాల నిర్వహణ కష్టమవుతున్నా.. మూసివేసే ఉద్దేశం లేదని చెబుతున్నారామె.

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)