సత్యదేవ
కోనసీమకు మూడువైపులా గోదావరి, నాలుగోవైపు సముద్రం ఉండడంవల్ల ఆ ద్వీపంలోకి తురకలు సులభంగా చొచ్చుకుని పోలేరనే దూరదృష్టితో ప్రోలయ తన రాజధాని రేకపల్లికి దూరాన ఉన్న కోనసీమను ఎంచుకున్నాడు. అది అతడి వివేకానికి, కార్యదక్షతకు నిదర్శనం. అంతేకాదు తురకలు గోదావరి దాటిరాకుండా రేవులన్నింటిలోను సేనలను కావలిగా ఉంచాడు. ఇంతచేశాడు కాబట్టే విలసశాసనంలో ప్రోలయను ”అంశావతీర్ణో భగవాన్” అంటూ భగవంతుని అంశావతారంగా వర్ణించారు.
అపాహృతాంస్తై రతిపాపచారై|
ప్రత్తాన్ పురాణైర్మనుజేంద్రవర్యై|
అనేకశ| పూర్వమహీసురేభ్య|
ప్రోలక్షితీశో దద దగ్రహారాన్||
కృత్వాప్రవృత్తాన్ విరతప్రసంగాన్
యజ్ఞాన్ హవిర్ధూమ పరంపరాభి|
తురుష్క సంచారణ జాతపాపా
నాంధ్రాన్ ప్రదేశా ననఘా నకార్షీత్||
కృషీవలశ్చాపి కృషే ఫలానాం
యథోదితం భాగమదు| ప్రహృష్టా|
తపస్విన ష్షష్ఠ మివప్రభాగం
ప్రథ్వీభుజేస్మై తపస| ఫలానామ్||
తా. పూర్వపురాజులు బ్రాహ్మణులకిచ్చిన అగ్రహారాలను ముస్లిములు లాక్కొనగా, వాటిని తిరిగి ఇప్పించాడు. ముస్లిముల పాపకార్యాలచేత కలుషితములైన భూములను (ముస్లిములు తాము ఆక్రమించిన హిందువుల స్థలాలను అపవిత్రం చేయడానికి గోమాంసం పడవేసి దున్నడం, గోతుల్లో పూడ్చిపెట్టడం చేసేవారు.) శుద్ధి చేయించి తిరిగి యజ్ఞకుండాల నుంచి పొగలు వెడలేటట్లు చేశాడు. తపస్వులు, తమ తపస్సులో ఆరవభాగాన్ని రాజుకిచ్చినట్లే, రైతులు తమ పంటలో ఆరవపాలు ప్రోలయకు సంతోషంగా సమర్పించారు.
ఇదీ పరాయిపాలనకు, స్వపరిపాలనకుగల భేదం. ఒక్కొక్కసారి పరాయిపాలన సౌఖ్యంగా ఉన్నట్లు అనిపించవచ్చు. స్వపరిపాలన కష్టంతోను శ్రమతోను కూడుకొని అనేక దోషాలు కలిగి ఉన్నట్లు అనిపించవచ్చు. కాని జాతి మనుగడకు, సంస్కృతి మనుగడకు స్వపరిపాలనే ఏకైక మార్గం. ముసునూరి నాయకులు ఈ సత్యాన్ని పూర్తిగా గ్రహించి స్వపరిపాలన స్థాపించడానికి తమ సర్వశక్తులు ఒడ్డి విజయం సాధించారు. అందుకే తరువాత వచ్చిన స్వతంత్య్రోద్యమాలకు వెలుగుబాట చూపి ధృవతారలుగా నిలిచిపోయారు.
ప్రోలయ మరణానంతరం, సా.శ. 1330 నుంచి జాతీయ విమోచనోద్యమానికి ప్రోలయ పినతండ్రి కొడుకు, అత్యంత ఆప్తుడు, పుత్ర సమానుడు, శిష్యుడు అయిన కాపయనాయడు సారధ్యం వహించాడు. కృష్ణానదికి దక్షిణంగా ఉన్న ప్రదేశంలో ఆరవీటి సోమదేవరాజు, అతడి సోదరుడు కోటికంటి రాఘవుడు రాయలసీమను విముక్తం చేశారు.
ఇక తెలంగాణ ప్రాంతాన్ని విముక్తం చేసే ప్రయత్నంలో కాపయ తక్కిన దక్షిణాది పాలకుల సహాయసహకారాలను కోరాడు. హోయసాల మూడవ బల్లాలుడు (సా.శ. 1291-1342) కాపయకు సహాయంగా సైన్యాన్ని పంపాడు. కాపయ 1336-1342లో ఓరుగల్లు కోటను ముట్టడించి అక్కడ తిష్టవేసిన సుల్తాను ప్రతినిధి మలిక్ మక్బూల్‌ను ఓడించి తరిమికొట్టాడు. ఆరవీటి సోమదేవరాజుకు స్వాతంత్య్రపోరాటంలో తోడ్పడవలసిందిగా ప్రోలయ వేమారెడ్డిని కోరాడు. దాని ఫలితంగా వేమారెడ్డికి ‘రాచూరు దుర్గ విభాళ‘ అనే బిరుదు వచ్చింది. ప్రోలయవేముని సామంతుడు ఉండిభక్తిరాజు కూడా విమోచనోద్యమంలో పాత్రవహించాడు. సోమదేవరాజు కంపిలిమీద దండెత్తి దాన్ని ఆక్రమించుకుని ఉన్న సుల్తాను సేనలను ఓడించాడు. ఆ తరువాత కంపిలి (అనెగొంది) రాజ్యం 1330లో విజయనగర సామ్రాజ్యంగా రూపాంతరం చెంది హరిహర బుక్కరాయలు, విద్యారణ్యుల కృషితో మూడు శతాబ్దాలపాటు హిందూ స్వాతంత్య్రాన్ని నిలబెట్టింది.
సా.శ. 1336 నాటికి ముసునూరి కాపయ నాయకత్వాన ఆంధ్రదేశమంతా ముస్లింపాలన నుంచి విముక్తమైంది. ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్ర సురత్రాణ బిరుదులతో ముసునూరి కాపయనాయడు ఓరుగల్లు రాజధానిగా పాలించాడు. పడమట కౌలాస, బీదరు మొదలు తూర్పున బంగాళాఖాతం వరకుగల రాజ్యం కాపయ ఆధీనంలోకి వచ్చింది.
స్వాతంత్య్రసమరం విజయవంతమవడంతో హిందూ నాయకుల్లో క్రమంగా అధికార కాంక్ష, స్వార్థచింతన పెరిగి దేశక్షేమం మరుగున పడింది. ఎవరికి వారు దేశక్షేమాన్ని మరచి ఒకరి రాజ్యాన్ని మరొకరు కబళించాలనే దురాశ పెరిగింది. ఈ పరిణామాలకు తోడు దక్షిణాన వరంగల్లుకు పొరుగున ముస్లిం బహమనీ రాజ్యం ఏర్పడింది. జాతీయ విమోచన సమితిలోని రాచకొండ వెలమనాయకులు బహమనీలతో చేతులు కలిపారు. వీటన్నింటి ఫలితంగా కాపయనాయకుని నాయకత్వం బలహీనమై, కొత్తరాజ్యాలు ఏర్పడి, తిరిగి హిందువులు 1350లో బహమనీ ముస్లిముల దుండగాలకు గురయ్యారు.
స్వాతంత్య్రోద్యమం తరువాత ఏర్పడిన రాజ్యాలలో ముసునూరి నాయకుల వరంగల్ రాజ్యం, పద్మనాయక (వెలమ) రాచకొండ రాజ్యం, యాదవ తెగ క్షత్రియుల విజయనగర రజ్యాం, పంటరెడ్ల కొండవీటి రాజ్యం, మంచికొండనాయకుల కోరుకొండ సంస్థానం, కొప్పుల నాయకుల పిఠాపురం సంస్థానం ముఖ్యమైనవి. వీటికితోడు కాపయ ముస్లిం స్వభావాన్ని ఆర్థం చేసుకోవడంలో చేసిన పొరబాట్లు కూడా అతడికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయి. ఉదాహరణకు ఢిల్లీ సుల్తానుల దాడికి గురైన అలావుద్దీన్ బహమన్‌షా అనే బహమనీ సుల్తానుకు సహాయం చేశాడు. కాని కాపయకు బహమన్ షా విశ్వాసఘాతుకం చేశాడు. ముస్లిమేతరులతో స్నేహం చేయరాదని, ఒకవేళ చేసినట్లు నటించినా, దాన్ని ఏక్షణాన్నైనా శతృత్వంగా మార్పుచేయడం ముస్లిముల మతకర్తవ్యమని వారి మతసూత్రాలు బోధిస్తున్నాయి. ముస్లిమేతరులు మిత్రద్రోహం చెయ్యరని కాదు. కాని అది వారి మతకర్తవ్యం కాదు. వ్యక్తిగతలోపం. అదేవిధంగా ముస్లిముల ముస్లిమేతరులతో చేసుకున్న ఒప్పందాలను గౌరవించవలసిన అవసరం లేదని (ఖురాను 9 – 3), వారు ఎప్పుడు తలచుకుంటే అప్పుడు ఒప్పందాన్ని ఉల్లంఘించవచ్చని వారి మతసూత్రాలు బోధిస్తున్నాయి. దీన్ని ఎరుగని హిందువులు అనేక సందర్భాల్లో నష్టపోయారు. నష్టపోతున్నారు.
రాజ్యంకోసంగాని, మరే ఇతర కారణంవల్లగాని ముస్లిములు ముస్లిమేతరులతో చేయి కలిపినా, లేక సాటి ముస్లిముతో విరోధించినా అది తాత్కాలికమే. వారి అంతిమ లక్ష్యం ఇస్లాం వ్యాప్తి, ముస్లిమేతరుల సర్వనాశనం. అది వారి శాశ్వత లక్ష్యం. ఈ శాశ్వత లక్ష్యం వైపుగానే వారి వ్యూహాలు, పథకాలు, సమస్తం ఉండాలని వారి మత గ్రంథాలు చెపుతున్నాయి. ఇతర మతగ్రంథాలకు, ముస్లిం గ్రంథాలకు మధ్య ముఖ్య భేదం ఒకటుంది. మహమ్మదు మాటలు, చేతలు కించిత్తు మార్పు లేకుండా అనుకరించడం ముస్లిముల మత కర్తవ్యం. తక్కిన మతాలవారు తమ దైవాన్నో, ప్రవక్తనో ఆదర్శంగా తీసుకుని ఆ బోధలను కాలానుగుణంగా ఆచరించవచ్చును. కానీ ముస్లిములు అలా కాదు. వారి ప్రవక్త ఆనాడు ఎలా ప్రవర్తించాడో, ఎలా జీవించాడో అలాగే మార్పులేకుండా ప్రవర్తించి, జీవించాలి. అందువల్ల ముస్లిం స్వభావాన్ని, ప్రవర్తనను అర్థం చేసుకోవాలంటే ప్రవక్త జీవితాన్ని, బోధనలను తెలుసుకోవడం ముస్లిమేతరులకు తప్పనిసరి. అంతేకాదు ముస్లిముగా మారిన వ్యక్తి తన పూర్వసంస్కారాలను పూర్తిగా కోల్పోతాడు. ఇస్లాం మతసూత్రాలు అతడిలో కలిగించే మార్పు అలాంటిది. ఉదాహరణకు కాపయ చేతిలో వరంగల్‌లో చిత్తుగా ఓడి, పారిపోయిన మాలిక్ మక్బూల్ తెలంగి. కాకతీయ ప్రతాపరుద్రుని సేనానుల్లో ఒకడైన గన్నయ. ఓరుగల్లు పతనానంతరం తురకలకు బందీగా చిక్కి, ముస్లిముగా మారిపోయాడు. వారి విశ్వాసాన్ని పొందాడు. హిందువుగా ఉన్నప్పుడు దేశరక్షణకు పాటుపడిన వ్యక్తి మతం మారాక హిందువులమీద అత్యాచారాలు జరపడమేకాక దేశస్వాతంత్య్రాన్ని వ్యతిరేకించాడు. ఇదీ మతమార్పిడి వల్ల వ్యక్తుల్లో కలిగే మార్పు. ఈ ముఖ్య విషయాన్ని హిందువులు గుర్తించి జాగ్రత్తపడకపోవడంవల్ల కాపయనాయకుడి నాటి నుంచి నేటివరకూ నష్టపోతూనే ఉన్నారు.
1370లో కాపయకు, రాచకొండ నాయకులకు భీమవరం దగ్గర జరిగిన యుద్ధంలో కాపయ్య మరణించాడు. ఆ విధంగా ఓరుగల్లు కేంద్రంగా విలసిల్లిన హిందూసామ్రాజ్యం మరోసారి విచ్ఛిన్నమైంది. కాపయ చేతిలో ఒకప్పుడు ఓడిపోయి, పారిపోయిన మాలిక్ మక్బూల్ సుల్తాను ప్రతినిధిగా మళ్ళీ వరంగల్‌లో అడుగుపెట్టాడు. 1323లో తరలించిన అపారసంపదకు అదనంగా మరింత సంపదను ఢిల్లీకి తరలించాడు. అది ఢిల్లీ సుల్తానుల దండయాత్రలకు, భోగవిలాసాలకు ఖర్చయింది. ఆ విధంగా శాశ్వతమైన ఐక్యసంఘటన, పోరాట పథకం హిందూ రాజులలో లేకపోవడంవల్ల హిందూ సమాజ పతనానికి దారితీసింది. మరొకవైపు హిందువులకంటే అనైక్యత, ఆటవికత ఎక్కువ ఉన్నప్పటికీ తమ మతానికి చెందని సమాజాలను దోచుకుని తుదముట్టించడమే లక్ష్యంగా కలిగిన ముస్లిం సుల్తానులు శాశ్వత ప్రాతిపదికపై ప్రకటించిన జిహాద్‌ను హిందువులు ఏమాత్రం గుర్తించి జాగ్రత్తపడలేదు. అది హిందువుల దుస్థితికి కారణం. హిందువులు ముస్లిం స్వభావాన్ని అర్థం చేసుకోలేదనడానికి తాజా ఉదాహరణలు 1947 దేశవిభజన, నేటి కాశ్మీర్, బంగ్లాదేశీ చొరబాటుదార్లు, పాకిస్థానీ ప్రేరిత ఉగ్రవాదం.
(సమాప్తం)