Home News అబుదాబిలో తొలి హిందూ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

అబుదాబిలో తొలి హిందూ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

0
SHARE

దుబాయ్‌ : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) రాజధాని అబుదాబిలో తొలి హిందూ దేవాలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. వేలాదిమంది భారతీయుల సమక్షంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో బోచసన్‌వాసి శ్రీ అక్షర్‌పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్‌) అధిపతి మహాంత్‌ స్వామి మహారాజ్‌ గర్భగుడి నిర్మాణం కోసం పునాదిరాయి వేశారు. అబుదాబిదుబాయ్‌ ప్రధాన రహదారి సమీపంలో 14 ఎకరాల విస్తీర్ణంలో ఏడు అంతస్తులుగా ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. ఇందులో కళాకృతులు ప్రదర్శనశాల, గ్రంథాలయం, వ్యాయామశాల, పూదోట, క్రీడా మైదానం, దుకాణాలు, ప్రార్థన మందిరాలు, బోధన శాలతో పాటు పలు సందర్శన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమానికి యుఎఇ మంత్రులు కూడా హాజరవ్వడం విశేషం.