Home Telugu శ్రీ . హరిహర శర్మ గారు స్వర్గస్తులు కావడంతో లక్షలాది మంది విద్యార్థులు, జాతీయవాదులు ఒక...

శ్రీ . హరిహర శర్మ గారు స్వర్గస్తులు కావడంతో లక్షలాది మంది విద్యార్థులు, జాతీయవాదులు ఒక మార్గదర్శకుడిని, ప్రేరణదాతని కోల్పోయారు.

0
SHARE

SAMACHARA BHARATI CULTURAL ASSOCIATION

పత్రికా ప్రకటన

29 జూన్ , 2017

శ్రీ . హరిహర శర్మ గారు స్వర్గస్తులు కావడంతో లక్షలాది మంది విద్యార్థులు, జాతీయవాదులు ఒక మార్గదర్శకుడిని , ప్రేరణదాతని కోల్పోయారు.

శ్రీ. తుమ్మలపల్లి హరిహర శర్మ గారు ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ జిల్లాలోని గ్రామంలో జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎం . ఎ ఇంగ్లీష్ పూర్తిచేసిన తరువాత ఎల్.ఎల్.ఎం చేశారు.

రాజమండ్రి, కర్నూల్, కడప మొదలైన చోట్ల ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకునిగా పనిచేసిన తరువాత ఆయన హైదరబాద్ మెహిదీపట్నం లోని విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించి, అక్కడే పదవీ విరమణ చేశారు.

నారాయణ్ గూడ లోని రచనా జర్నలిజం కళాశాల సంస్థాపకులలో ఒకరైన శ్రీ. శర్మగారు  వ్యవస్థాపక ప్రిన్సిపాల్ గా కూడా కొంతకాలం వ్యవహరించారు.

1950 లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో చేరిన ఆయన వివిధ సంస్థలను నిర్మించడంలో స్వచ్ఛందమైన సేవలను అందజేశారు.

  1. జాగృతి ప్రకాశన్ ట్రస్ట్ అధ్యక్షులు (2000 2005). తరువాత కార్యదర్శి (2007 నుండి 2017) –  ఈ ట్రస్ట్ ద్వారా 50 సంవత్సరాలుగా జాగృతి తెలుగు వారపత్రిక వెలువడుతోంది.
  2. ప్రస్తుతం కేశవ మెమోరియల్ విద్యా సంస్థల కార్యదర్శి.
  3. రెండు దశాబ్దాలుగా శంకర కృప (శృంగేరి శంకరమఠ్ ఆధ్యాత్మిక పత్రిక) సంపాదకులు
  4. ఎబివిపి పత్రిక సాందీపనికి మార్గదర్శకులు

గతంలో ఆయన

  1. 12 ఏళ్లపాటు సమాచార భారతి అధ్యక్షులు ఉన్నారు.
  2. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అధ్యక్షులుగా వ్యవహరించడంతోపాటు 30 ఏళ్లపాటు ప్రాంత ప్రముఖ్ గా ఉన్నారు.
  3. వారు ABVP జాతీయ ఉపాధ్యక్షులుగా ఒక పదివి కాలం భాద్యత నిర్వహించారు. చాలా ఏళ్లుగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ కార్యవర్గం లో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు.
  4. ప్రజ్ఞ్య భారతి సంస్థాపక సభ్యులుగా మరియు భారతీయ ప్రజ్ఞ్య సంపాదక మండలి లో సభ్యులుగా కూడా ఉన్నారు.

ఇలా వివిధ సంస్థలలో విశేష సేవలను అందించిన శ్రీ. హరిహర శర్మ గారు తన 78 ఏట స్వర్గస్తులయ్యారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన విద్యానగర్ లోని దుర్గాబాయి దేశముఖ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య,  ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఆయన కన్నుమూయడంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని లక్షలాది కార్యకర్తలు ఒక ప్రేరణదాతను, మార్గదర్శకుడిని కోల్పోయారు.

ఓం శాంతి

Dr.G.Gopal Reddy

President

Samachara Bharati Cultural Association