Home News స్వాతంత్య్ర దినోత్సవం రోజున క్రైస్త‌వ‌ మ‌త ప్ర‌చారాలు

స్వాతంత్య్ర దినోత్సవం రోజున క్రైస్త‌వ‌ మ‌త ప్ర‌చారాలు

0
SHARE
  • దేశం కంటే మ‌త‌మే గొప్ప‌ద‌నే ప్ర‌చారం
  • మ‌త‌ప్ర‌చారం పేరుతో స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల అప‌హేళ‌న

భారతదేశ చరిత్రలో ఆగస్టు 15 ఒక ముఖ్య‌మైన‌ రోజు. భారతదేశం యూరోపియన్ వలస శక్తుల నుండి స్వాతంత్య్రం పొందిన రోజున భార‌తదేశం ఎంతో ఘ‌నంగా ఉత్స‌వాలు జ‌రుపుకుటుంది. అయితే, దేశ పౌరులు స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని జరుపుకోకుండా నిరోధించే దురుద్దేశంతో  చర్చిలు అదే రోజున వారి మ‌త కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తున్నాయి.

ఎంతో మంది జీవితాల‌ను, కుటుంబాలతో స‌హా త్యాగం చేసి, లక్షలాది భారతీయ వీరుల‌ నేతృత్వంలో సుదీర్ఘ పోరాటం తర్వాత బ్రిటిష్, యూరోపియన్ పాలన నుండి భారతదేశం స్వాతంత్య్రం సాధించింది. ఆగస్ట్ 15న ప్రభుత్వ సెలవుదినం…  దేశ ప్ర‌జ‌లంతా గ‌ర్వంగా దేశ‌భ‌క్తిని చాటుతూ, స‌మ‌ర‌యోధుల త్యాగాల‌ను స్మ‌రిస్తుంటారు.  మ‌రోవైపు అనేక చర్చిలు ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో రోజంతా క్రైస్త‌వ‌ ప్రార్థనలు, శిబిరాలు, మ‌త కార్య‌క‌లాపాల‌ను నిర్వహిస్తున్నాయి.
ఈ విష‌యంపై హైదరాబాద్‌లోని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ (LRPF) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేసింది. “ఆగ‌స్టు 15 స్వాతంత్య్ర దినోత్స‌వం ప్ర‌జ‌ల పండుగ రోజున మతోన్మాద క్రైస్తవ సంస్థ‌లు  తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని నిశ్చయించుకుంది. వారి పోస్టర్లపై జాతీయ జెండాను వక్రీకరించడం, దానిపై బైబిల్ శ్లోకాలు రాయడం, అగౌరవపరచ‌డం” వంటి దేశ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాగే కొన్ని ప్రత్యేక చర్చి కార్యక్రమాలలో, సాధారణ ప్రార్థ‌న‌న‌ల స‌మ‌యంలో, ఇతర ప్రసారాల సమయంలో అత్యంత ద్వేషపూరిత ప్రసంగాలు కూడా చేస్తున్నారు. స్వాతంత్య్ర‌ సమరయోధులు యేసుక్రీస్తును తమ రక్షకుడిగా, విమోచకునిగా తిరస్కరించార‌ని వారిని “నరకానికి వెళ్లిన అవిశ్వాసులు” అని పిలుస్తారు. ఈ విధంగా, చర్చికి వెళ్లే వారికి స్వాతంత్య్ర పోరాటం, భారతదేశంపై క్రూరమైన బ్రిటిష్ పాలన, మన స్వాతంత్య్ర‌ యోధుల త్యాగాలను వారి మ‌న‌సులో నుంచి తొలగించడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నం జరుగుతోంది. చిన్నపిల్ల‌ల మ‌నుసుల్లో కూడా ఇటువంటి ద్వేషపూరిత ఆలోచనలతో బ‌ల‌వంతంగా నూరిపోస్తున్నారు. దేశం, జాతీయ‌త‌, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగం కంటే కూడా యేసుక్రీస్తుకే ప్రాధాన్యతనిచ్చేలా వారిని త‌యారుచేస్తున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నివారించాలనే చర్చిల నిర్ణయం వెన‌క పెద్ద కుట్ర ఉంది. బ్రిటీష్, ఇతర యూరోపియన్ సామ్రాజ్యవాద శక్తులు క్రైస్తవులు, భారతదేశంలో వారు చేసిన దురాగతాల చరిత్రను తమ అనుచరులు తెలుసుకుంటే, వారిలో యూరోపియన్లు, క్రైస్తవుల పట్ల ప్రతికూల భావాలను పెరుగుతాయ‌ని భ‌యంతో చర్చిలు కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నాయి.
పాస్టర్లు, ఇతర క్రైస్తవ నాయకులు వారి ప్ర‌సంగాల‌లో క్రైస్తవ మతంతోనే దేశ‌ శ్రేయస్సు  ముడిపడి ఉందనే ఆలోచనను ప్రచారం చేస్తున్నారు. దీనికి రుజువుగా యూరోపియన్ల భౌతిక సంపదను వారు సూచిస్తున్నారు. క్రైస్తవ మతంలోకి మారడం వల్ల మెరుగైన జీవితాన్ని గడపవచ్చని ప్ర‌చారంచేస్తున్నారు. ఈ సందేశం చాలా మంది నిరుపేద గ్రామస్తులను ఆకర్షిస్తోంది, వారు తమ పరిస్థితులను మెరుగుపరిచేందుకు మార్గం కోసం చూస్తున్నారు.
స్వాతంత్య్ర‌ దినోత్సవం రోజున చర్చిల చర్యలు వారి స్వంత చరిత్ర, భారతదేశంలో వారి స్థానం గురించి వారి ఆందోళనను ప్రతిబింబిస్తాయి. అలాగే వారి అనుచరుల నుండి ఎదురుదెబ్బ తగులుతుందనే భయాన్ని ప్రతిబింబిస్తాయి. వలసవాదం, దోపిడీలో క్రైస్తవ మతం పాత్ర గురించిన సత్యానికి తమ అనుచరులు ఎలా స్పందిస్తారనే దానిపై వారు ఆందోళన చెందుతున్నారు.
గతంలో అనేక సందర్భాల్లో ఆంధ్ర ప్రదేశ్ క్రైస్తవ బోధకులు బహిరంగ వేదికలపై కింద పేర్కొన్న విద్వేషపూరిత, దేశ వ్య‌తిరేక ప్ర‌సంగాల‌ను చేశారు
  • జాతీయ జెండా కేవలం గుడ్డ ముక్క, దానికి నమస్కారం ఎందుకు?
  • దేశాన్ని రెండుగా విడదీసి క్రైస్తవ భారతదేశాన్ని అందించండి.
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర రాజ్యాంగాల నుండి రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేద్కర్ తీసుకున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజున రోజంతా చర్చిలో మ‌త కార్య‌కలాపాలతో పాటు, మత విద్వేషాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో మణిపూర్ వివాదాన్ని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు చెందిన క్రైస్తవ పాస్టర్లు పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడం మరో ప్రమాదకరమైన పరిణామం. మణిపూర్ పరిస్థితిని హిందువులు క్రైస్తవ హింసగా చిత్రీకరిస్తున్నారు.
క్రైస్తవ మత ప్రచారకుల కార్యకలాపాల వల్ల స‌మాజంలో ప‌రిస్థితులు అస్తవ్యస్తమ‌య్యాయి. వారి ఆలోచ‌న‌లు తోటి పౌరులను ద్వేషం వైపు నడిపిస్తున్నాయి. దేశభక్తి, దేశంపట్ల విధేయత కూడా యేసు, బైబిల్‌పై విశ్వాసానికి లోబడి ఉండాల‌ని వారు ప్ర‌చారం చేస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులను అవహేళన చేయడం, హాత్మా గాంధీ, అంబేద్కర్, ఇతర స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌ను కూడా “నరకంలోకి వెళ్లిన అవిశ్వాసులు”గా ప్రకటించారు.
ఈ పరిణామాలు ఆగకుండా, అంకురార్పణ దశలోనే తుడిచిపెట్టుకుపోతే రానున్న రోజుల్లో తీవ్ర మతకలహాలకు దారి తీస్తుంది. ఇప్పటికే క్రైస్తవ బోధకుల కార్యకలాపాల వల్ల రెండు రాష్ట్రాలలో మత సామరస్యానికి శాశ్వతమైన, కోలుకోలేని నష్టం వాటిల్లింది.