Home Ayodhya #MobLynching: రామమందిర నిర్మాణ నిధి సేకరిస్తున్న బజరంగ్‌దళ్ యువ కార్యకర్త దారుణ హత్య

#MobLynching: రామమందిర నిర్మాణ నిధి సేకరిస్తున్న బజరంగ్‌దళ్ యువ కార్యకర్త దారుణ హత్య

0
SHARE

అయోధ్య రామమందిర నిర్మాణం కోసం నిధిసేకరణలో ఉన్న రామభక్తుడిని దారుణంగా హత్యచేసిన ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.  రింకూ శర్మ అనే ఓ 24 ఏళ్ల బజరంగ్ దళ్ కార్యకర్త మకర సంక్రాంతి నుండి దేశ వ్యాప్తంగా ప్రారంభమైన రామ మందిర నిర్మాణ నిధి సేకరణ అభియాన్‌లో చురుకుగా పాల్గొంటున్నాడు. తాను నివసించే మంగోల్‌పురి ప్రాంతంలో ప్రజలకు రామ మందిర చరిత్ర వివరిస్తూ.. మందిర నిర్మాణానికి నిధులను సేకరిస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక ముస్లిం యువకులు అతడితో వాగ్వాదానికి దిగిన ఘటన గత నెలలో చోటుచేసుకుంది. సమయానికి పెద్దలంతా చేరడంతో ఆ వివాదం అంతటితో ముగిసింది.

కానీ జరిగిన ఘటనను మనసులో పెట్టుకున్న ముస్లిం వర్గానికి చెందిన దాదాపు 30 మంది యువకులు ఫిబ్రవరి 10వ తేదీన రింకు శర్మ ఇంటిపై దాడికి దిగారు. రామ మందిర నిర్మాణ నిధి సేకరణలో చురుగ్గా పాల్గొంటున్న రింకు శర్మపై కుటుంబ సభ్యుల కళ్ల ఎదుటే కత్తులతో పొడుస్తూ లాఠీలతో దాడి చేశారు.

తొలుత నలుగురు వ్యక్తులు ఆయుధాలతో వచ్చి.. రింకు ఇంటి తలుపులను తట్టి లోపలికి ప్రవేశించి అతని తండ్రిని, సోదరులను నెట్టేస్తూ.. విచక్షణా రహితంగా కొట్టారు. కత్తులతో పొడవడంతో తీవ్రంగా తీవ్ర రక్తస్రావం జరిగింది. అంతేకాదు.. ఇంట్లో ఉన్న ఎల్పీజీ సిలిండర్‌ను తీసి రింకు శర్మపై దాడి చేయబోతుండగా అడ్డుకున్నామని రింకు శర్మ సోదరుడు ఓ జాతీయ పత్రికకు వివరించాడు. తమపై కూడా దాడిచేస్తూ తన సోదరుడిపై తమ ముందే విచక్షణారహితంగా దాడి చేశారని, అతడు తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయి మరణించాడని భావించిన తర్వాతే దుండగులు అక్కడి నుండి వెళ్లిపోయారని, అయితే వెంటనే తాము తమ సోదరుడిని సమీప ఆస్పత్రికి తరలించామని తెలిపారు. చికిత్స పొందుతూ.. ఫిబ్రవరి 11వ తేదీన ప్రాణాలు విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు కారకులైన నలుగురు వ్యక్తుల్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను మహ్మద్‌ ఇస్లాం, డానిష్ నస్రుద్దీన్‌, దిల్షాన్‌, దిల్షాన్‌ ఇస్లాంగా గుర్తించారు.

ఘటనపై విశ్వ హిందూ పరిషత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థ అధికార ప్రతినిధి సురేంద్ర జైన్ దీనిపై స్పందించారు. బజరంగ్ దళ్‌ కార్యకర్తపై దాడి హేయమైన చర్య అని.. రామ మందిర నిర్మాణం అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నిర్మాణమవుతుందని.. నిధి సేకరిస్తున్న కార్యకర్తలను హతమార్చడం దారుణమన్నారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీలను కూడా జాతీయ మీడియా విడుదల చేసింది.