Home News హిందూ దేవాలయంగా మారనున్న 30 ఏళ్ల నాటి చర్చి

హిందూ దేవాలయంగా మారనున్న 30 ఏళ్ల నాటి చర్చి

0
SHARE
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం పోర్ట్స్ మౌత్ నగరంలో కల 30 ఏళ్ళ నాటి చర్చి హిందూ దేవాలయంగా మారనుంది. ప్రఖ్యాత స్వామినారాయణ్ సంస్థాన్ ఆధ్వర్యంలో ఈ చర్చి దేవాలయ రూపురేఖలు సంతరించుకోనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ప్రఖ్యాత హిందూ ధార్మిక సంస్థ స్వామి నారాయణ్ సంస్థాన్ గతంలో కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక చర్చిలను కొనుగోలు చేసి హిందూ దేవాలయాలుగా మార్చిన దాఖలాలు ఉన్నాయి. దేవాలయాలుగా మారిన చర్చిలలో ప్రస్తుత వర్జీనియా చర్చి అమెరికాలో 6వది కాగా  ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదవది.
అమెరికాలో ఇప్పటిదాకా లాస్ ఏంజెల్స్, పెన్నీన్సల్వేనియా, లూయిస్విల్లే, ఓహియో మరియు కాలిఫోర్నియా రాష్ట్రాల్లో చర్చిలను హిందూ దేవాలయాలుగా మార్చిన స్వామినారాయణ్ సంస్థాన్ ఇంగ్లండులోని లండన్, బోల్టన్, మాంచెస్టర్ నగరాల్లోని చర్చిలను కూడా దేవాలయాలుగా మార్చింది. ప్రస్తుతం వర్జీనియా చర్చితో పాటుగా కెనడాలోని టొరంటోలో ఉన్న చర్చిని కూడా దేవాలయంగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
దీనిపై స్వామినారాయణ్ సంస్థాన్ ప్రతినిధి శ్రీ భగవత్ ప్రియదాస్ స్వామిజీ మాట్లాడుతూ తమ సంస్థ అధినేత శ్రీ పురుషోత్తమప్రియదాస్ స్వామీజీ మార్గదర్శకత్వలోనే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.
అధికారిక లెక్కల ప్రకారం వర్జీనియా రాష్ట్రంలో సుమారు పదివేల మంది గుజరాతీలు నివసిస్తుండగా వారిలో అధికశాతం ఉత్తర గుజరాత్, కచ్ ప్రాంతాల నుండి స్థిరపడ్డారు. ఐదు ఎకరాల్లో 18వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ చర్చిని సుమారు 1.6 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్టు అంచనా.
Source: VSK Bharat