Home News హిందూ కుల పెద్దలతో “సద్భావన సదస్సు” నిర్వహణ  

హిందూ కుల పెద్దలతో “సద్భావన సదస్సు” నిర్వహణ  

0
SHARE

హిందూ సద్బావన వేదిక అద్వర్యంలో “సద్భావన సదస్సు”  కేశవా మెమోరియల్ కాలేజి, నారాయణగూడ, హైదరాబాద్ లో  శుక్రవారం నాడు నిర్వహించడం జరిగింది.  అందులో హిందూ కుల పెద్దలు పాల్గొన్నారు హిందూవులు ఎదుర్కుంటున్న సమస్యలు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాలను చర్చించడం జరిగింది.

ఈ సమవాశం లో ఆర్ ఎస్ ఎస్ ప్రాంత సంఘచలాక్ మాననీయ ప్యాట వెంకటేశ్వర్ రావు గారు మరియు శ్రీ అప్పల ప్రసాద్ గారు, రాష్ట్ర సామజిక సమరసత సంయోజకులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల పెద్దలు మాట్లాడుతూ సమాజంలో ఉన్న వివిధ రకాల అసమానతలను తొలగించి హిందూ సంఘతనం చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని సూచించారు. అదే విధంగా ప్రజలలో విభేదాలను సృష్టిస్తూ కులాల మద్య చిచ్చు పెట్టి విడగొట్టాలి అనే చేస్తున్నారు అని ఆరోపించారు. ఈలాంటి ప్రయత్నాలలో భాగమే కంచే ఐలయ్య లాంటి వ్యక్తులు మేధావి ముసుగోలు హిందువులనే లక్షంగా చేసుకొని ఒక మానసికరపమైన దాడికి ప్రయత్నం చేస్తున్నాడు అని అన్నారు. ఇట్లాంటి సాహిత్యాన్ని బహిశ్కరిస్తూ, కంచే ఐలయ్య పై  చట్ట పరమైన  చర్యలు  తీసుకొని కఠినంగా శిక్ష వేయాలని కోరారు.

ఈ సమావేశంలో సమాజంలోని న్యాయవాదులు, డాక్టర్లు,  టీచర్లు, వ్యాపారస్తులు, ఉద్యోగుల తో పాటి వివిధ రంగాలలో పని చేస్తున్నవారందరూ  పాల్గొన్నారు.