మహ్మదీయుల కంటే ముందుగా భారతదేశంపై గ్రీకులు, హుణులు, కుషానులు తదితరులు దండయాత్రలు చేసినా వారు తమ వెంట మతాలను తీసుకోని రాలేదు. లేదా వారి మతాలను భారత దేశంలో వ్యాప్తి చేయలేదు. అంతే గాక వారు సమాజ జీవనంలో కలిసి పోయారు. కొందరు రాజులై రాజ్యాలు ఏలినా ఆనాడు ఇక్కడ ప్రబలంగా ఉన్న బౌద్దాన్ని స్వీకరించారు. స్థానిక సమాజ జీవనాన్ని అంగీకరించి వారు హిందువులైపోయారు.
మహ్మదీయ దండయాత్రల నుంచి ఈ పరిస్థితి మారింది. దురాక్రమణదారులైన మహ్మదీయులు తమ రాజ్య విస్తరణతో బాలు ఇస్లాంను వ్యాప్తి చేయడం తమ కర్తవ్యంగా తీసుకున్నారు. ఖురాన్ విధించిన నియమాలను బట్టి మహ్మదీయ పాలకునికి, కాఫిర్ ప్రజల మధ్య శాంతి అనేది ఉండదు. కాబట్టి తన పాలనలో ఉన్న ప్రజలందరినీ ఇస్లాంలోకి మార్చడం తన విధిగా ప్రతి మహ్మదీయ రాజు భావించాడు. దార్-ఉల్-ఇస్లాంగా మార్చడం ముస్లిం పాలకుని విధి కాబట్టి ప్రజలందరూ ఇస్లంఆను అంగీకరించేవరకు వారిని చంపడం, వారి ఆస్తులను దోచుకోవడంతో బాటు అందరూ ముస్లింగా మారినప్పుడే వారు తమ రక్షణకు అర్హులుగా ప్రతి ముస్లిం ప్రభువు విశ్వసించారు. అందుచేత మహ్మదీయులు పాలనలో హిందువులను హిందువులుగా జీవించలేని పరిస్థితులు ఉత్పన్నవయ్యాయి. అట్టి సంకట పరిస్థితులలో దక్షిణాదిన హిందూ సమాజాన్ని రక్షించడానికి కాక తీయ సామ్రాజ్యం వెలసింది. దాని పతనానంతరం ముసునూరి నాయకులు ముస్లిం ఆగడాలను అణచివేశారు. ఆ తరువాత వెలసిన విజయనగర సామ్రాజ్యం దక్షిణాదిన హిందూ సామ్రాజ్యంగా వెలసి 150 సంవత్సరాల పాటు దక్షిణాదిన ముస్లిం వ్యాప్తిని అరికట్టింది. అందుకే విజయనగర రాజులలో కొందరు హిందు రాయ సురత్రణాం పాక్ పశ్చిమ సముద్రాధితపి అంటూ బిరుదులు పొందారు. శ్రీ కృష్ణదేవరాయలను అల్లసాని పెద్దన హిందూ రాజ్య రమా దురంధర అని కీర్తించాడు. విజయనగర సామ్రాజ్యం హైందవ స్వాతంత్ర్యానికి పతాక, శిబాజీ తన ఎనమిది సంవత్సరాల వయసులోనే తన తల్లి జిజియాబాయితో విజయనగరం వెళ్ళి ఆ మహా సామ్రాజ్య రాజధాని శిథిలాలను చూచాడు. విజయనగరం సామ్రాజ్యం పట్ల శివాజీ అభిమానం పెరిగింది. అట్టి హైందవ సామ్రాజ్య నిర్మాణానికి ఆనాడే శివాజీ నిర్ణయించుకున్నాడు. శిబాజి విజయనగర సామ్రాజ్యం నుంచి స్ఫూర్తి తీసుకున్నాడు. అందుకే శివాజి విజయనగర సామ్రాజ్య నాణేముల పేరైన మదెన అనే పేరుతో తన నాణేలను ప్రయోగించాడు.
విజయనగర రాజులు కేవలం ముస్లిం దాడిని ఎదుర్కొనడమే గాక ముస్లింలుగా మారిన హిందువులను తిరిగి హిందువులుగా మార్చే ప్రయత్నం చేశారు.
విజయనగర స్థాపకులైన హరిహర, బుక్కలు మహ్మద్ బిన్ తుగ్లక్ దక్షిణాదిన దండయాత్ర చేసినపుడు బందీలుగా పట్టుబడి ముస్లింలుగా మార్చబడ్డారు. విజయనగర సామ్రాజ్యానికి ఆద్యులైన స్వామి విద్యారణ్యులు హరిహర, బుక్కలు తిరిగి హిందువులుగా మార్చి వారిచేత విజయనగర సామ్రాజ్య స్థాపన చేయించారు. క్రీ.శ 1336న ఆవిర్భవించి 200 సంవత్సరాలకు పైగా దక్షిణాదిన ముస్లిం వ్యాప్తిని అరికట్టిన మహాసామ్రాజ్యం 1565లో తాలికోట యుద్ధంలో పతనమయింది. ఈ శిథిలాలనుండే శివాజి హైందవ సామ్రాజ్యం ఆవిర్భవించింది. శివాజి హైందవ సామ్రాజ్య నిర్మాణంలో పాటు ముస్లింలుగా మారిన హిందువులను తిరిగి హిందువులుగా మారేందుకు కృషి చేశారు.
10వ శతాబ్ధంలోనే బలవంతంగా ముస్లింలుగా మార్చబడిన హిందువులను తిరిగి హిందువులుగా మార్చడానికి దేవల స్మృతి ప్రాచుర్యంలోకి వచ్చింది. హిందూ స్త్రీలుగానీ పురుషులుగానీ బలవంతంగా ముస్లింలుగా మార్చబడి వారి స్పర్శచేతగానీ, వారి సంపర్కంవల్లగానీ లేదా చాలాకాలం వారితో సహజీవనం చేసినా శుద్ధిచేయబడి హిందూ ధర్మం లోకి వచ్చే అవకాశాన్ని దేవల స్మృతి కలిగించింది. ఆ విధంగా ఇస్లాంను స్వీకరించిన హిందువులు తిరిగి తమ హిందూ ధర్మాన్ని స్వీకరిస్తున్నారు అంటూ అల్‌బిరునీ తన వ్రాతలలో పేర్కొన్నాడు.
క్రీ.శ 1398-99 లో విజయనగర రాజు దేవరాయలు పొరుగు రాజ్యమైన ముస్లిం రాజ్యంపై దండయాత్ర చేశాడు. అదే సమయంలో ఆ రాజ్యపు ముస్లిం రాజు ఫిరోజ్‌షా బహమని 2000మంది బ్రాహ్మణ యువతులను తన సైన్యంతో చెరబట్టాడు. తన స్త్రీలను విడిపించవలసిందిగా బ్రాహ్మణులు చేసిన విజ్ఞప్తి వల్ల దేవరాయలు ముస్లిం రాజుతో ఒక సంధి చేసుకుని ఆ స్త్రీలను విడిపించాడు. ముస్లిం సైనికుల చేత ఆపవిత్రం కాబడిన ఆ స్త్రీలను శుద్ధి చేసి తిరిగి హిందూ సమాజం స్వీకరించినట్టు తాహరిఖ్ ఫెరిస్తా తెలియజేస్తోంది.
హిందూ స్త్రీలు మ్లేచ్చుల చేత చేరచబడినా, వారివల్ల గర్భధారణ అయినా తిరిగి వారిని హిందూ ధర్మంలోకి స్వీకరించవచ్చని దేవల స్మృతి తెలియ జేస్తోంది. అదే విధంగా 12వ శతాబ్ధారంభంలో జీవించిన విజ్ఞానేశ్వరుడు యజ్ఞవల్క స్మృతిపై భాష్యం వ్రాస్తు అనేక స్మృతులలో పేర్కొనబడిన శ్లోకాలను పేర్కొంటూ హిందూ స్త్రీల మ్లేచ్చుల చేత చెరచబడినా ఆమెను శుద్ధి చేసిన తరువాత ఏ కులానికి చెందిందో అదే కులంలోకి స్వీకరించాలని ఆదేశించాడు. ఆ స్మృతినే ఆనాడు భారతదేశ ఉత్తర దక్షిణ ప్రాంతాలలో పాటించినట్టు తెలుస్తోంది.
తల్లి జిజియాబాయి పెంపకం సమర్థ రామదాసు ప్రేరణ వల్ల హిందూ సమాజ రక్షణకై కంకణం కట్టుకున్న శివాజి ముస్లిం పాలకులతో సుదీర్ఘకాలంగా పోరాటం జరిపినా ఆయనలో అన్య మతాల పట్ల ద్వేషం, అసహిష్ణుత కనిపించేవికావు. అదే విధంగా పోర్చుగీసు ఆక్రమించిన ప్రాంతాలలో హిందువుల పట్ల, హిందు పురోహితుల పట్ల క్రైస్తవులు హింసా ప్రవృత్తిని ప్రదర్శించినా శివాజి కాథలిక్ మతాచార్యుల పట్ల చూపించిన గౌరవం, ఔదార్యం కొనియాడదగినది. ముస్లిం మౌల్వీల పట్ల, మసీదుల పట్ల ఖురాన్ పట్ల ఆయన ప్రదర్శించిన ఆదరాన్ని అతడి బద్ధశత్రువులైన ముస్లిం చరిత్రకారులు కూడా ప్రస్తుతించారు. శివాజిని పరమ అసభ్య పదజాలంతో దూషించిన కాఫిఖాన్ సైతం తన స్మరణికలో, శివాజి ఏ నగరంలో ఏ దుర్గంలో ప్రవేశించినా అక్కడ మసీదుల భద్రత పట్ల శ్రద్ధవహించేవాడు. ఎక్కడ ఖురాన్ ప్రతి లభించినా ఆ ప్రతిని గౌవరంగా తన పవిత్ర గ్రంథాల పట్ల చూపించిన వినమ్రతనే చూపించాడు. ఎప్పుడైనా తన సైనికులు ముస్లిం స్త్రీలను నిర్భంధించాన శివాజి వాళ్ళను వారించి వారిని వారి పరివారాల వద్దకు గౌరవ మర్యాదలతో తిరిగి పంపించేవాడు ! అని ది గ్రాండ్ రెబెల్ అనే గ్రంథాన్ని వ్రాసిన ఆంగ్ల చరిత్రకారుడు కిరకైడ్ ప్రస్తుతించాడు.
శివాజి పర మతాలను గౌరవించినా ఆ మతాలు హిందు సమాజం పట్ల వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకించాడు. హిందువులను ఇస్లాంలోకి గానీ, క్రైస్తవ మతంలోనికి మార్చడానికి అంగీకరించలేదు. అంతేగాక ఆ విధంగా క్రైస్తవ, ముస్లిం మతాలలోకి మార్చబడిన వారిని తిరిగి హిందూ ధర్మంలోకి తెచ్చాడు.
శివాజి సైన్యాధిపతులలో ముఖ్యుడైన నేతాజి పాల్కర్ ఒక రణరంగంలో చేసిన పొరబాటుకు శివాజీ చేత మందలింపబడిన కోపంతో ముస్లింగా మారిపోయి సర్ధార్ మహ్మద్ కులీఖాన్ పేరుతో ఔరంగజేబు ఆశ్రయం పొందాడు.
1675లో మరాఠా సైనికులు ఔరంగజేబ్ తమ్ముడు బహదూర్ ఖాన్‌ను ఓడించి కోటి రూపాయలు అతడి వద్ద నుంచి వసూలు చేశారు. అదే సంవత్సరంలో శిబాజి ఔరంగజేబు చెందిన పోరడాకొండా దుర్గాన్నిజయించాడు. ఆ తరువాత అంకోలా, శవేశ్వర్, భాదరా, కార్వార్‌లను కూడా జయించాడు. శివాజి విజయపరంపరలను చూసి ఆందోళన చెందిన ఔరంగజేబ్ ఇస్లాంను స్వీకరించిన శివాజి పూర్వపు సైన్యాధికారి సర్దార్ మహ్మద్ కులీఖాన్‌ను శివాజిపైకి పంపించడం మంచి ఎత్తుగడగా భావించాడు. శివాజి పైకి సైన్యంతో దండెత్తి వచ్చిన కులీఖన్(నేతాజీ పాల్కర్) పరిస్థితులను అర్థః చేసుకుని పశ్చాత్తాపం చెందాడు. మొగల్, సైన్యం నుంచి తప్పించుకొని రాయగడ్ చేరి శివాజి సన్నది చేరాడు. తన ఇంటికి తిరిగి వచ్చిన తన కుమారుణ్ని ఆదరించనట్లే శివాజి నేతాజీ పాల్కర్‌ను ఆదరించాడు. కొన్ని సంవత్సరాల పాటు మ్లేచ్చ సాంగత్యంలో మనలినా తిరిగి అతడిని హిందూ ధర్మంలోకి తీసుకోనడం ఉచితమని శివాజి భావించాడు. జూన్ 19వ తేదీ 1676లో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించి తిరిగి నేతాజీ పాల్కర్‌గా హిందూ సమాజంలో ఆహ్వానించాడు. అంతేగాక ఎవ్వరూ ఏ విధంగానూ సంశయించడానికి వీలు లేకుండా ఉండటానికి శివాజి తన సన్నిహిత బంధువులలోని ఒక కన్యను ఇచ్చి వివాహం చేశాడు. శివాజి ముస్లింలుగా మారిన హిందువును తిరిగి హిందువుగా స్వీకరించడానికి ఆదర్శంగా నిలబడ్డ మహవ్యక్తి. మత మార్పిడుల ద్వారా హిందూ సమాజం క్షయమవ్రజాన్ని శివాజి వ్యతిరేకించలేదు.
యాంటిమోట్, డమస్కస్ దేశాలలో హింసలకు గురియైన క్రైస్తవులు 4వ శతాబ్ధంలో తమ స్వదేశాలను వదలి ఆశ్రయం పొందటానికి భారతదేశంలోని కేరళ తీరాలకు చేరారు. ఆ విధంగా నిరాశ్రయులై వచ్చిన ఆ క్రైస్తవులు సిరియన్ క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఆనాడు కేవలం తమ బ్రతుకుతెరువు కోసం వచ్చిన ఆ క్రైస్తవులు హిందువులతో కలిసి శాంతియుతంగా జీవించారు. కానీ వ్యాపారం కోసం భారతదేశాన్ని చేరడానికి మార్గన్వేషణాగా చేస్తూ వాస్కోడిగామా నాయకత్వంలో బయలుదేఇన పోర్చుగీసు నౌకలు భారతదేశ పశ్చిమతీరాన్ని 1490లో తాకిన తరువాత క్రైస్తవం తన నిజరూపాన్ని ప్రదర్శిచింది. వ్యాపారంతో బాటు క్రైస్తవం మత మార్పిడి శక్తిగా, వసల సామ్రాజ్య శక్తిగా భారతదేశంలో ప్రవేశించింది. అప్పటి నుంచి మత శక్తిగా ఎదుగుతున్న క్రైస్తవం శివాజీ కాలం నాటికి హిందూ సమాజానికి ప్రమాదంగా తయారయింది. స్థానిక హిందువులను క్రైస్తవంలోకి మార్చడానికి గోవాలో అతి క్రూరమైన స్పానిష్ ఇంక్విజిషన్ పద్దతులను ప్రవేశపెట్టారు. ఇందులో స్థానిక హిందువులను క్రాస్‌లకు కట్టి క్రింద మంటలు పెట్టి కాల్చి చంపేశారు. పదునైనా ఇనుక హుక్ లను శరీరానికి గుర్చి వ్రేలాడ తీసేవారు. ఇంకా అనేక రకాలుగా చిత్రహింసలు గురి చేస్తూ హిందువులను క్రైస్తవులుగా మార్చే క్రూరమైన పద్దతిని పాటించారు. అంతేగాక తన స్వాధీనంలో ఉన్న గోవా ప్రాంతంలో రోమన్ కాథలిక్ మినహా మరో మతస్తులు నివసించకూడదంటూ నిషేదాలు పెట్టారు.
పోర్చుగీసు క్రైస్తవ రాజ్యంలో హిందువుల దుస్థితిని చూచిన శివాజి గోవాపైకి తన సైన్యాలను పంపాడు. నవంబర్ 19వ తేదీ 1667న మరాఠా సైన్యాలు గోవాకు అతి సమీపంలోని బర్టేసేలో ప్రవేశించాయి. పోర్చుగీసు క్రైస్తవులు బందీలుగా ఉన్న హిందువులను అప్పగించడానికి తిరస్కరించిన నలుగురు ఫాదరీల తలలను మరాఠా సైనికులు నరికివేసారు. ఆ చర్యతో భయపడిన పోర్చుగీసు వైస్రాయి అతి క్రూరమైన చర్యలను స్వస్తీ చెప్పాడు. శివాజీ గోవానంతటినీ అగ్నికి ఆహుతి చేసి ధ్వంసం చేశాఉ. 150 లక్షల పగోడాల ధనాన్ని తీసుకోని వెళ్ళాడు. ఆ తరువాత డిసెంబర్ 5వ తేదీ 1667న గోవాలో శాంతిని నెలకొల్పేందుకు పోర్చుగీసు శివాజీల మధ్య ఒడంబడిక కుదిరింది.
వాసైలో జెసూట్ క్రైస్తవ మిషనరీలు స్థానిక అమాయక హిందువుల ఆస్తులను జప్తు చేయడంపై శివాజి ఆగ్రహించి తీవ్రమైన హెచ్చరిక చేశాడు. దానివల్ల పోర్చుగీసు అధికారులు జెసూట్ మిషనరీలకు నచ్చజెప్పి హిందువుల ఆస్తులను హిందువులకు తిరిగి అప్పగించారు. శివాజీ పరాయి మతాలు హిందూ సమాజంపై చేసే దాడులను అక్రమాలను సహించలేదు.
జాగృతి సౌజన్యంతో…