జిహాదీ హింసకు వ్యతిరేకంగా జరిగే ఎలాంటి ప్రతిచర్యలకు హిందూ సమాజం బాధ్యత వహించదని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జీహాదీల దాడిలో ప్రాణాలు కొల్పొయిన బీజేవైఎం నాయకుడు ప్రవీణ్ నెట్టారు, ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ జిల్లాలో జిహాదీల కత్తుల దాడిలో ప్రాణాలు విడిచిన కన్హయ్య లాల్ తో పాటు జీహాదీల దాడులకు బలైన బాధితుల కుటుంబాలకు, హిందూ సమాజానికి సత్వర న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో విచారించాలని వీ.హెచ్.పి డిమాండ్ చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆలోచించాలన్నారు. జిహాదీ మనస్తత్వం వల్ల ఇలాంటి దుర్మార్గాలు, హత్యలకు పాల్పడుతూ ఉంటే, అప్పుడు హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుందని, దీంతో సహజంగానే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని, అలా జరిగితే దానికి హిందూ సమాజం బాధ్యత వహించదని ఆయన పేర్కొన్నారు.
జీహాదీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా బజరంగ్ దళ్ రాష్ట్ర స్థాయిలో హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసిందని ఆయన పునరుద్ఘాటించారు. ఎవరికైనా హింసాత్మక బెదిరింపులు వస్తే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన పేర్కొన్నారు. లేదా ఎలాంటి చట్టపరమైన సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్‌లను సంప్రదించవచ్చని, విహెచ్‌పి ఎప్పుడూ హిందూ సమాజానికి అండగా నిలుస్తోందని ఆయన తెలిపారు.
ముస్లిం సమాజం ఇప్పుడు తమ నాయకత్వాన్ని నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందని పరాండే అన్నారు. ముస్లిం సమాజం తీవ్రవాదం, తీవ్రవాద మనస్తత్వం కలిగి ఉన్న వారిని సామాజిక క్రమంలో నుండి తొలగించాలని, లేకుంటే వారి మాటలు, చర్యల స్వీయ వైరుధ్యం అలాగే ఉండవచ్చని ఆయన అన్నారు. జమాతే ఇస్లామీ వంటి సంస్థలు ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నాయని, ఒక వైపు వారు “సర్ తన్ సే జుదా” (తల నరికివేయడం), బాంబులను పేల్చే జిహాదీ ముఠాలకు మద్దతుగా నిలుస్తూనే, మరోవైపు కన్వరియా యాత్రలో పాల్గొనే హిందువులకు ఫలహారాలు అందిస్తూ వారికి స్వాగతం పలుకుతున్నట్టు నటిస్తున్నారని ఆయన అన్నారు.
జిహాదీ హింసను ప్రోత్సహించే, రెచ్చగొట్టే విషయాలు ఇంటర్నెట్ ద్వారా ప్రచారం జరుగుతున్నాయని, ఇంటర్నెట్ ద్వారా ప్రచారంలోకి వచ్చే అటువంటి విషయాలను పూర్తిగా నిషేధించాలి ఆయన పేర్కొన్నారు. నేపాల్ నుంచి ఢిల్లీ వరకు టెర్రర్ కారిడార్ నిర్మించాలనే కుట్ర తెరపైకి వచ్చిందని, దానిని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేయాలని మిలింద్ పరాండే డిమాండ్ చేశారు.
Source : VSK BHARATH