Home Views హిందువులను పట్టించుకోకపోవడమే సెక్యులరిజమా?

హిందువులను పట్టించుకోకపోవడమే సెక్యులరిజమా?

0
SHARE

ప్రజలు చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం…  అన్ని మతాల వారిని సమానంగా చూసినప్పుడే అది నిజమైన సెక్యులర్, ప్రజాస్వామ్య ప్రభుత్వమవుతుంది. కానీ తమిళనాడు లోని ఏఐడిఎంకె ప్రభుత్వం క్రైస్తవులకు అనుకూలంగా, మరోవైపు హిందువుల పట్ల ప్రతికూలంగా వ్యవహరిస్తోంది.

ఇటీవల కరోనాతో మరణించిన టీవీ జర్నలిస్ట్ జాన్ కెన్నెడీ కి తమిళనాడు ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేసింది. రెండేళ్ల బాలుడు సుజిత్ బోరు బావిలో పడి చనిపోగా ఆ కుటుంబానికి రూ. కోటి తో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. పోలీస్ కస్టడీలో మరణించిన ఇద్దరు క్రిస్టియన్ తండ్రి కొడుకులకు రాష్ట్ర ప్రభుత్వం తలో రూ. 25 లక్షల తో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు..

పైన పేర్కొన్న వారందరూ క్రిస్టియన్లు కావడం.. వారికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో నష్టపరిహారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం గమనార్హం.

అయితే దేశ సరిహద్దు వద్ద జరిగిన కాల్పుల్లో మరణించిన తిరుమూర్తి అనే సైనికుడికి కేవలం రూ. లక్ష  మాత్రమే తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

ఎస్సై ఆంటోని మైకేల్ హింసలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సేలం సాధు కుటుంబానికి తమిళనాడు ప్రభుత్వం ఎటువంటి పరిహారం ప్రకటించలేదు. పైగా ఎస్సై పై పెట్టిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని కుటుంబాన్ని పోలీసు ఉన్నతాధికారులు బెదిరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించకపోవడం విచారకరం.

రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలను అనుమతించ లేదు. దేవాలయాల్లో ఉత్సవాలు నిర్వహించడానికి కూడా అధికారులు అనుమతులను నిరాకరించారు.  కానీ చెన్నై, బసంత్ నగర్ లోని వేలన్ కన్ని చర్చి లో జెండా కార్యక్రమంలో వేలాది మంది క్రైస్తవులు పాల్గొన్నప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు.

పై విషయాలన్నీ గమనిస్తే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించడంలో, కరోనా నిబంధనలు అమలుచేసే విషయంలో హిందువుల పట్ల వివక్ష చూపుతోందని స్పష్టంగా అర్థమవుతోంది.

Source : https://www.organiser.org/