కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో షోయబ్, గుల్ నవాజ్ అనే ఇద్దరు ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం సాయంత్రం అరెస్టు చేసింది.
నివేదికల ప్రకారం.. కేరళ రాష్ట్రానికి చెందిన షోయబ్ 2018లో బెంగుళూరు వరుస పేలుళ్ల కేసులో నిందితుడు. అప్పటి నుండి అతను పరారీలో ఉన్నాడు. అతను ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు కీలక సభ్యుడు.
గుల్ నవాజ్ అనే మరొక ఉగ్రవాది పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా లో చెందిన సభ్యుడు. అతను ఢిల్లీ పేలుళ్ల కేసులో నిందితుడు. సౌదీఅరేబియాలోని రియాద్ లో ఉన్న వీరిద్దరిపై అక్కడి ప్రభుత్వం లుకౌట్ నోటీస్ జారీ చేసింది. 2 వారాల క్రితం రియాద్ సౌదీ అరేబియా అధికారుల సహాయంతో ఎన్ఐఏ ప్రత్యేక బృందం వారిని అదుపులోకి తీసుకుంది. సోమవారం భారత్ తీసుకొచ్చి వారిని అరెస్టు చేశారు.
ఇద్దరు ఉగ్రవాదులను రా, ఇతర దర్యాప్తు సంస్థలు విచారించి షోయబ్ ను బెంగుళూరు కు, గుల్ నవాజ్ ను ఢిల్లీ తీసుకెళ్ళి తదుపరి విచారణ చేపట్టనున్నారు.
Source : OPINDIA