ముస్లిం రాష్ట్రీయ మంచ్ ప్రతి సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలో రోజా ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 4,500 రోజా ఇఫ్తార్ కార్యక్రమాలను నిర్వహించింది. వీటి గురించి సర్వత్ర చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవి
* రోజా ఇఫ్తార్ లో ఆవు పాలనే వినియోగిస్తారు. ఇందులో పాల్గొనేవారంతా తమతమ ఇళ్ళలో రిహాన్(తులసి) మొక్క నాటడంతో పాటు తమతమ బస్తిలలో పళ్ల చెట్లను కూడా నాటుతారు.
* `జెహన్ ఔర్ రుహూ (ఆత్మ ) కీ పాకీజ్ గీ కే సాథ్ సాథ్ జహాన్ కా పాకీజ్ గీ కీ అహద్’ (సంకల్పం) అనే పద్దతిని పాటిస్తారు.
* ఏదైనా ఒక చెడు గుణాన్ని వదిలిపెట్టే సంకల్పం చేసుకుంటారు
* ఏదైనా ఒక మంచి గుణాన్ని అలవాటు చేసుకునే సంకల్పం తీసుకుంటారు.
* నదులు, మహాపురుషుల గురించి ప్రేరణదాయక కథలు వినిపిస్తారు
* దేశ ప్రజానీకం బాగుండాలని ప్రార్ధిస్తారు.
ఇటువంటి ప్రత్యేకమైన రోజా ఇఫ్తార్ ముగింపు కార్యక్రమం ఈ రోజు (9/6/2017) హైదరాబాద్ లో జరుగుతోంది. హజ్ హౌజ్ సమీపం లోని హోటల్ మెర్జాన్ ఇంటర్ నేషనల్ లో సాయంత్రం 6.00 గం.లకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఇందులో కేంద్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ. బండారు దత్తాత్రేయ , ఆర్ ఎస్ ఎస్ సీనియర్ ప్రచారక్ శ్రీ. ఇంద్రేష్ కుమార్ , మౌలానా నదీముల్ కాస్మి, నాబ్స్ అలీ సౌగంద్, సూర్య ప్రకాష్ సింగ్, హిమాలయ పరివార్ తెలంగాణ&ఆంధ్ర అధ్యక్షులు, ముస్లిం రాష్ట్రీయ మంచ్ రాష్ట్ర సంయోజక్ శ్రీ. గిరీష్ జూయల్ తదితరులు పాల్గొంటారు.
మీమ్మల్ని సాదర పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.
ఇట్లు
సయ్యద్ ఫయిజుద్దీన్
అబ్దుల్ సత్తార్