Home News హైదరాబాద్ లో రోహింగ్యా ముస్లింలు అరెస్ట్, నకిలీ ఆధార్ కార్డుల జప్తు

హైదరాబాద్ లో రోహింగ్యా ముస్లింలు అరెస్ట్, నకిలీ ఆధార్ కార్డుల జప్తు

0
SHARE

హైదరాబాద్ పోలీసులు 5 గురు రోహింగ్యా ముస్లిం లను గుర్తించి అందులో ఇద్దరినీ అరెస్ట్ చేయడం జరిగింది. బుధవారం నాడు సంతోష్ నగర్ లోని నసీబ్ ఫంక్షన్ హాల్ దగ్గర పోలీసులు తనిఖీ నిర్వహించగా ఇద్దరు రోహింగ్య ముస్లిం లు చూపెట్టిన ఆధారాలను నకిలీ ఆధార్ కార్డు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.

స్థానిక పోలీస్ ఎస్ ఐ నాగేష్ ప్రకారం వీరు మయన్మార్ దేశానికి చెందిన హయత్ ఉల్ హక్, ఫాతిమా బాతున్ దంపతులుగా గుర్తించారు. వీరు గత కొంత కాలంగా కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోషన్ దౌలా ప్రాంతంలో ఎలాంటి పత్రాలు లేకుండా కొంత కాలంగా నివసిస్తున్నట్టు తెలిపారు.

రోహింగ్య ముస్లింలు స్థానికంగా స్థిరపడాలి అనే ఉద్దేశంతో నకిలీ ఆధార్ కార్డులు కొరకు పథకం వేశారు. దాంతో అదే దేశానికి చెందినా మరో ముగ్గురితో కలిసి హయత్ ఉల్ హక్ అతని భార్య ఫాతిమా బాతున్ ల పేరు మర్చి తమ పేర్లను జోడించి ఆధార్ కార్డు లు పొందారు.

పట్టుబడ్డ ఇద్దరి నుండి నకిలీ ఓటర్ కార్డులు, ఆధార్ కార్డు, పాన్ కార్డు పాస్ పోర్ట్ లను పోలీసులు సేకరించారు. నిందితులు మరో ముగ్గుర్ పేర్లు వెల్లడించడం తో ఐదుగిరి పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

(సాక్షి సౌజన్యం తో)