కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో భారత్ చేస్తున్న సేవలు మరువలేనివని ఐరాస అభినందించింది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాల కోసం 2 లక్షల కరోనా నిరోధక టీకాలను బహుమతిగా ఇచ్చిన భారత్‌కు ఐరాస ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ప్రపంచానికి భారత్ చేస్తున్న సేవలు మరువలేనివి ఐరాస అని కొనియాడింది. బారత్ చేసిన ఈ సాయం శాంతి పరిరక్షకులు సురక్షితంగా ఉండేందుకు దోహదపడుతుందని ఐరాస సెక్రెటరీ జనరల్ అంటోవియా గుబెర్రన్ తెలిపారు. భారత్ పంపిన 2 లక్షల వ్యాక్సిన్లు శనివారం ముంబై నుంచి బయలుదేరాయి.
విశ్వశాంతికి బలమైన మద్దతుదారు అయిన భారత్.. శాంతి పరిరక్షణ సిబ్బందికి వాక్సిన్లు అందించడాన్ని ఐరాస శాంతి పరిరక్షక దేశ ప్రతినిధి జనరల్ జీన్ పియరీ కొనియాడారు. ఐరాస శాంతి పరిరక్షణ దళంలోలో పనిచేస్తున్న 85,782 సిబ్బందికి బారత్ రూపొందించిన వాక్సిన్లు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు 85 మిలియన్లకు పైగా భారత కరోనా నిరోధక వ్యాక్సిన్లు 70 దేశాలకు చేరుకున్నాయి.