జార్ఖండ్ లోని రాంచి కోర్టు జాతీయ షూటింగ్ క్రీడాకారిణి తార సహదేవ్ కు తన భర్త రఖిబ్ ఉల్ హసన్ నుండి విడాకులు మంజూరు చేసింది.
జనవరి 2017 లో తార సహదేవ్ కోర్ట్ కు సమర్పించిన పిటిషన్ లో తన భర్త రఖిభ్ ఉల్ హసన్ తాను ఒక హిందువునని, తన పేరు రంజిత్ సింగ్ కోహ్లి అని నమ్మించి 7-జూలై-2014 న హిందూ సంప్రదాయ పద్ధతి లో వివాహం చేసుకున్నాడని, కాని తన భర్త ఒక ముస్లిం, అసలు పేరు రఖిభ్ ఉల్ హసన్ అనే వాస్తవం వివాహం జరిగిన మరుసటి రోజే తెలిసిందని, అప్పటి నుండి తన భర్త అతని కుటుంబ సభ్యులు ఇస్లాం మతం లోకి మారాలని శారీరక, మానసికంగా విపరీతమైన హింసకు గురి చేసే వారని ఆరోపించింది.
వివాహం జరిగిన కొన్ని రోజుల తరువాతనే కొంతమంది మౌల్విలు ఇస్లాం లోకి మతం మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని తిరస్కరించిన కారణంగా తనపై దాడి జరిగిందని, మతం మారక పోతే చంపేస్తామనితన భర్త, కుటుంబ సభ్యులు బెదిరించారని, మతం మారితే ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటామని చెప్పారని ఆరోపించింది.
టైమ్స్ అఫ్ ఇండియా కథనం ప్రకారం జనవరి 2017 లో కేసు నమోదు అయిన తరువాత సి బి ఐ సైతం ఈ కేసు దర్యాప్తు చేసింది.
తమ పరిశీలనలో తార సహదేవ్ విపరీతమైన హింసకు గురైనట్లు గుర్తించామని ఫ్యామిలీ కోర్ట్ ముఖ్య జడ్జీ బి కె గౌతం తెలిపారు. దాంతో పాటు ఒకరిని బలవంతపు మత మార్పిడి చేయరాదని అన్నారు.
ఇండియన్ ఎక్సప్రేస్ కథనం ప్రకారం ప్రస్తుతం రఖీబ్ ఉల్ హసన్ జైలులో ఉన్నాడని తన తల్లి మాత్రం బెయిల్ పై బయట ఉందని, రఖీభుల్ ఉల్ హసన్ గుర్తింపు పత్రాల మార్పు కు సహరించిన ముస్తాక్ అహ్మద్ సైతం జైలులో ఉన్నాడని తెలిపింది.
ఈ తీర్పు తరువాత తార సహదేవ్ మాట్లాడుతూ సి బి ఐ వారు చేస్తున్న దర్యాప్తు లో సైతం న్యాయం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అంతవరకూ పోరాటం చేస్తానంటోంది.